అన్నం తినేముందు రోజూ ఈ శ్లోకం చదువుకోండి!

ఏది భుజించినా అధి భగవంతుడి ప్రసాదంగానే భావించి స్వీకరించాలి

అందుకే ముందుగా అన్నపూర్ణాదేవిని స్మరించుకుని భుజించాలి

అన్నపూర్ణే సదాపూర్ణే శంకరప్రాణవల్లభే
జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్ధం భిక్షాం దేహి చ పార్వతి

ఎప్పుడూ పూర్ణంగా ఉండే తల్లీ, శంకరుడి ప్రాణవల్లభురాలైనా పార్వతీ దేవి నాకు జ్ఞానం, వైరాగ్యం సిద్ధించడానికి భిక్ష పెట్టు..

అన్నం బ్రహ్మరసో విష్ణు: భోక్తా దేవో మహేశ్వరః
ఇతిస్మరన్ ప్రభుం జానః దృష్టి దోషై: నలిప్యతే

ఆహారం బ్రహ్మ, అందులో సారం విష్ణువు, దానిని సేవించేవాడు మహేశ్వరుడే...ఇది తెలుసుకుంటే ఆహారంలో మలినాలు మీలో చేరవు

ప్రాలేయాచలవంశపావనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలమ్బనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ

హిమవంతుని వంశాన్ని పవిత్రము చేసినదానవు, కాశీ పట్టణ రాణివి, దయామయివి, అన్నపూర్ణేశ్వరివి అగు నీవు బిక్షపెట్టుము

Image Credit: Pinterest