ప్రయాణం చేసేముందు ఈ శ్లోకం చదువుకోవాలి

జలే రక్షతు వారాహః స్థలే రక్షతు వామనః
అతవ్యాం నారసింహశ్చ సర్వతః పాతుకేశవః

నీటిబాధనుంచి వరాహావతారం, భూ సంబంధమైన బాధలనుంచి వామనావతారం...

అడవుల్లోని బాధలనుంచి నరసింహావతారం, అన్ని బాధలనుంచి అన్ని అవతారాలకి మూలమైన శ్రీహరి రక్షించుగాక!

వనమాలీ గదీ శారజ్ఞి శంఖీ చక్రీ చ నందకీ
శ్రీమాన్ నారాయణో విష్ణు: వాసుదేవోభిరక్షతు

ఈ శ్లోకం విష్ణు సహస్రనామంలో ఉంటుంది...ఇది చదువుకుని బయలుదేరితే ఎలాంటి అడ్డంకులు ఉండవని విశ్వాసం

ఆపదా మపహర్తారం దాతారం సర్వసంపదామ్
లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం

ఆపదలు పోగొట్టేవాడు, అన్ని సంపదలు ఇచ్చేవాడు, లోకంలో అత్యంత సుందరమైనవాడు అయిన రామచంద్రుడికి నమస్కరిస్తున్నా

ఈ శ్లోకం చదువుకుంటే అనుకోకుండా ఎదురయ్యే ఆపదల నుంచి బయటపడే మార్గం కనిపిస్తుంది...

Image Credit: Pixabay