ఉత్తమ భర్త లక్షణాలివే - మీలో ఒక్కటైనా ఉందా!

స్త్రీ ఎలా ఉండాలో అనే కాదు..పురుషుడు కూడా ఎలా ఉండాలో చెప్పింది ధర్మశాస్త్రం

కార్యేషు యోగీ
పనులు చేయడంలో యోగిలా ప్రతిఫలాన్ని ఆశించకుండా చేయాలి

కరణేషు దక్షః
కుటుంబాన్ని నడపడంలో, కార్యాలను నిర్వహించడంలో నేర్పుతో, సంయమనంతో వ్యవహరించాలి

రూపేచ కృష్ణః
రూపంలో కృష్ణుడిలా అంటే 8 పెళ్లిళ్లు చేసుకోవాలని కాదు..ఎప్పుడూ ఉత్సాహంగా ఉండాలి

క్షమయాతు రామః
ఓర్పులో రాముడిలా ఉండాలి. పితృవాక్యపరిపాలకుడైన రాముడిలా క్షమించేగుణాన్ని కలిగిఉండాలి.

భోజ్యేషు తృప్తః
భార్య వండినదాన్ని సంతృప్తిగా భుజించాలి

సుఖదుఃఖ మిత్రం
సుఖదుఃఖాలలో కుటుంబానికి మిత్రునిలా అండగా ఉండాలి. మంచి చెడ్డలలో పాలు పంచుకోవాలి.

ఈ 6 కర్మలను సక్రమంగా చేసే పురుషుడే ఉత్తమ పురుషుడు - ఉత్తమ భర్త

Image Credit: Pixabay