బిర్యాని ఆకు ఇంట్లో రకరకాల వంటల్లో, రకరకాలుగా వాడుతారు. జ్యోతిషంలో కూడా దీనికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. పెద్ద కారణాలు లేకుండా జీవితంలో కష్టాలు ఎదురవుతుంటాయి. ఇలాంటపుడు ఒక బిర్యాని ఆకును పర్స్ లో పెట్టుకుంటే కష్టాలు తీరుతాయి. కొంత మందికి చాలా నరదృష్టి ఉంటుంది. దీనికి పరిష్కారంగా పర్సులో బిర్యాని ఆకును పెట్టుకుంటే ఫలితం ఉంటుంది. అప్పుల బెడదతో బాధ పడుతుంటే లక్ష్మీదేవి పాదాల దగ్గర అర్పించి అది శుక్రవారం నాడు పర్సులో పెట్టుకుంటే పరిష్కారం దొరుకుతుంది. అనుకున్న పనులు చాలా కాలంగా పూర్తికావడం లేదంటే ఇంట్లోంచి బయటకు వెళ్లే ముందు బిర్యాని ఆకు దగ్గర పెట్టకోవడం మంచిది. ఉద్యోగంలో కష్టాలు, అవాంతరాల్లో ఉంటే పర్సులో ఒక బిర్యాని ఆకు పెట్టుకుంటే శుభవార్త వింటారు. ఆర్థిక సమస్యలు వేధిస్తుంటే ఒక బిర్యాని ఆకు దగ్గర పెట్టుకుంటే త్వరలోనే సమస్యలు దూరం అవుతాయి. బిర్యాని ఆకు మీద సింధూరంతో మీ కోరిక రాసి లక్ష్మీదేవి ముందు ఉంచి పూజించుకోవాలి. దాన్ని పర్సులో ఉంచుకుంటే కోరిక ఫలిస్తుంది. ఈ సమాచారం కేవలం అవగాహన కోసమే.