హోలీ 2024: మీ మనసు తెలిపే రంగు రంగుల పండుగ హోలీ రోజు మీరు చల్లే రంగు మీ మనసేంటో చెప్పేస్తుంది ప్రేమ, అనుబంధానికి సూచన ఎరుపు రంగు..మనసైన వారిపై ఈ రంగు చల్లుతారు పసుపు రంగు చల్లితే ప్రశాంతంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నట్టు అర్థం ఆకుపచ్చ రంగు చల్లితే కష్టాలు పోవాలని కోరుకుంటున్నట్టు శ్రీ కృష్ణుడికి రంగుగా చెప్పే నీలం...మీలో ఉండే విశ్వాసం, ఆధ్యాత్మిక, సానుకూల శక్తికి సూచిక ప్రశాంతతకు, స్నేహానికి గుర్తుగా పింక్ కలర్ చల్లుకుంటారు ఆరెంజ్ కలర్ సానుకూలతకు ప్రతీక..ఈ రంగు ఆధ్యాత్మికతకు కూడా సూచన ఆకాశం రంగు అంటే రాయల్టీకి సూచన..హోలీ రంగుల్లో స్పెషల్ కలర్ ఇది మీ జీవితాన్ని ఈ హోలీ రంగులమయం చేయాలని కోరుకుంటూ హోలీ శుభాకాంక్షలు Image Credit: Pixabay