హోలీ రోజే కామదహనం - ప్రేమ జయం! ఫాల్గుణ పౌర్ణమి రోజు కాముని పున్నమి పేరుతో సంబరాలు జరుపుకుంటారు. సతీవియోగంతో విరాగిగా మారిన పరమేశ్వరుడికి హిమవంతుని కుమార్తె పార్వతితో వివాహం జరిపించాలనుకుంటారు దేవతలు పార్వతీదేవిపై పరమశివుడి దృష్టి నిలిచేలా చేయమని మన్మథుని సాయం తీసుకుంటారు. మన్మథుడు శివుడిపైకి పూల బాణాన్ని ప్రయోగించి, తపోభంగం కలిగిస్తాడు. ఆగ్రహంతో శివుడు మూడో కన్ను తెరిచి మన్మథున్ని భస్మం చేస్తాడు. అలా కోరికలు దహింపజేసిన రోజు కావడం వల్ల హోలీ రోజు కామదహనం పేరుతో మన్మథుడి బొమ్మను తగులబెడతారు చతుర్దశి నాడు కాముని దహనం అనంతరం పాల్గుణ పౌర్ణమి నాడు వచ్చే హోలీ పండుగను ఘనంగా జరుపుకుంటారు మార్చి 23 చతుర్థశి - కామదహనం మార్చి 24 ఆదివారం హోళికా పూర్ణిమ Image Credit: Pixabay