హోలీ 2024: హోలికా దహనం ఎందుకు చేస్తారు!
హిరణ్యకశపుడి కుమారుడైన ప్రహ్లాదుడు నిత్యం శ్రీ మహా విష్ణువు ధ్యానంలో ఉంటాడు.
భరించలేకపోయిన హిరణ్యకశపుడు ప్రహ్లాదుడిని చంపాలని తన సోదరి హోళికను పిలుస్తాడు.
ఆమెకు ఉన్న శక్తిని వినియోగించి ప్రహ్లాదుడిని మంటల్లో ఆహుతి చేయాలని కోరుతాడు.
ఆమె ప్రహ్లాదుడిని ఒడిలో కూర్చోబెట్టుకుని మంటల్లో దూకుతుంది.
అయితే విష్ణుమాయతో ప్రహ్లాదుడు మంటల్లోంచి బయటపడగా...హోళిక మాడి మసైపోతుంది.
హోలిక దహనమైన రోజునే ‘హోలీ’ అని పిలుస్తారనే ప్రచారం ఉంది.
అందుకే కొన్ని ప్రాంతాల్లో ‘హోలిక’ దహనం నిర్వహిస్తారు.
కొత్తగా పెళ్లైన మహిళలు మాత్రం చూడకూడదంటారు. హోళికా దహనం అంటే శరీరం అగ్నిలో కాలుతుంది కదా..
శవదహనం కదా..అందుకే కొత్తగా పెళ్లైన వాళ్లు చూస్తే వారి జీవితంలో బాధలు వెంటాడతాయంటారు.
Image Credit: Pixabay
సీ మోర్
తిన్న ప్లేట్లో చేయి కడిగే అలవాటుందా!
వధూవరులకు బాసికం ఎందుకు కడతారు!
ఐదోతనం అంటే!
హోమం ఎందుకు?