హోలీ 2024: మార్చి 24 or 25 హోలీ ఎప్పుడు జరుపుకోవాలి - ఇదిగో క్లారిటీ

మార్చి 23 చతుర్థశి - కామదహనం. మార్చి 24 ఆదివారం ఉదయం 9 .30 వరకూ చతుర్థశి ఉంది ఆ తర్వాత పౌర్ణమి మొదలైంది.

మార్చి 24 ఆదివారం రాత్రికి పౌర్ణమి ఘడియలున్నాయి..అందుకే మార్చి 24 ఆదివారం హళికా పూర్ణిమ

మార్చి 25 సోమవారం ఉదయం 11 గంటల 30 నిముషాల వరకే పౌర్ణమి ఉంది..అంటే రాత్రికి పౌర్ణమి ఘడియలు లేవు.

అన్ని తిథులు సూర్యోదయానికి ఉండడం ప్రధానం అయితే పౌర్ణమి, అమావాస్య ఘడియలు మాత్రం రాత్రికి ఉండడమే ముఖ్యం

అందుకే హోలీ మార్చి 24నే కానీ మార్చి 25 ఉదయం కూడా హోళీ జరుపుకోవచ్చు...

దివాలీ తర్వాత దేశవ్యాప్తంగా సంబరంగా జరుపుకునే పండుగ 'హోళీ. యుగయుగాలుగా ఈ పండుగ జరుపుకుంటున్నారు..

ఏటా ఫాల్గుణ మాసంలో పౌర్ణమి రోజున వచ్చే ఈ పండుగను..హోలీ, కాముని పున్నమి, డోలికోత్సవం అని కూడా అంటారు.

ఈ పండుగ గురించి పురాణాల్లో ప్రచారంలో చాలా కథలున్నాయి...

Image Credit: Pixabay