అన్వేషించండి

Ugadi Panchangam in Telugu (2024-2025) : శ్రీ క్రోధి నామ సంవత్సర కన్యా రాశి ఫలితాలు - ఉగాది రాశిఫలాలు 2024 to 2025

Ugadi Panchangam 2024 -2025: ఏప్రిల్ 9 మంగళవారం నుంచి క్రోధినామ సంవత్సరం ప్రారంభమవుతుంది. ఈ ఏడాది సింహ రాశివారి ఆదాయ వ్యయాలు , వార్షిక ఫలితాలు ఇక్కడ తెలుసుకోండి...

Ugadi Panchangam  Sri Krodhi Nama Samvatsaram 2024 to 2025 Virgo Yearly Horoscope : శ్రీ క్రోధి నామసంవత్సరం కన్యా రాశి వార్షిక ఫలితాలు

కన్యా రాశి: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
ఆదాయం : 5 వ్యయం : 5 రాజ్యపూజ్యం : 5 అవమానం : 2

కన్యా రాశివారికి శ్రీ క్రోధి నామ సంవత్సరం మిశ్రమ ఫలితాలనిస్తోంది.  ఎంత కష్టపడినా అందుకు తగిన ఫలితం పొందలేరు. బయటకు గంభీరంగా కనిపించినా లోపల ఏదో భయం వెంటాడుతుంది. అకారణంగా మాటలు పడతారు, రావాల్సిన డబ్బు సమయానికి చేతికి అందదు. చేతిలో ఉన్న సొమ్ము హారతి కర్పూరంలా ఖర్చైపోతుంది.  సొంత వ్యవహారాలు కన్నా ఇతరుల వ్యవహారాలపైనే ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు. మీ డబ్బుతో ఉపకారం పొందినవారే మీకు కీడు చేస్తారు అప్రమత్తంగా ఉండాలి. అపనిందలు తప్పవు, శారీరక - మానసిక బాధలు తప్పవు. వృధా ఖర్చులు పెరుగుతాయి, వ్యసనాల బారినపడతారు. వైవాహిక జీవితంలో మాట పట్టింపులుంటాయి...

అయితే శని ఆరో స్థానంలో బలంగా ఉండడం వల్ల మీ ధైర్యమే మీకు శ్రీరామరక్ష. సమస్యలు ఎదురవుతున్నప్పటికీ ధైర్యంగా ముందుకు అడుగేస్తారు. 

Also Read: ఉగాది నుంచి ఈ రాశివారికి చుక్కలే - మనోధైర్యమే మిమ్మల్ని నడిపించాలి - శ్రీ క్రోధి నామ సంవత్సర వార్షిక ఫలితాలు!

కన్యా రాశి ఉద్యోగులకు

శ్రీ క్రోధి నామ సంవత్సరంలో కన్యారాశివారికి మిశ్రమ ఫలితాలున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతికూల ఫలితాలు లేవు కానీ ప్రమోషన్ వచ్చే అవకాశం తక్కువ. నిరుద్యోగుల నిరీక్షణ ఫలిస్తుంది. ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్నవారికి మంచి ఫలితాలు లేవు..ఉన్నతాధికారులతో మాటలు పడతారు. శ్రమకు తగిన ఫలితం పొందలేరు...

కన్యా రాశి వ్యాపారులకు

ఈ రాశి వ్యాపారులు ఆశించిన స్థాయిలో లాభాలు పొందలేరు కానీ నష్టపోరు. కిరాణా వ్యాపారులకు పర్వాలేదు. ఫైనాన్స్ వ్యాపారం చేసేవారికి కలసిరాదు. కాంట్రాక్ట్, రియల్ ఎస్టేట్ వ్యాపారం  చేసేవారికి పర్వాలేదు. బంగారం, వెండి వ్యాపారులకు అంత లాభాలు రావు

Also Read: మొదటి 2 నెలలు మినహా క్రోధినామ సంవత్సరం ఈ రాశివారికి తిరుగులేదంతే!

కన్యా రాశి కళాకారులకు

శ్రీ క్రోధి నామ సంవత్సరం ఈ రాశి కళాకారులకు గురుబలం కలిసొస్తుంది కానీ భారీగా లాభాలుండవు. టీవీ, సినిమా రంగాల్లో ఉండేవారికి అలా రోజులు గడిచిపోతాయి. కెరీర్ మీరు ఆశించిన స్థాయిలో లేకపోయినా పర్వాలేదంతే...

కన్యా రాశి విద్యార్థులకు

ఈ రాశి విద్యార్థులకు గురుబలం వల్ల చదువుపై శ్రద్ద పెరుగుతుంది. పరీక్షలలో మంచి ఫలితాలు సాధిస్తారు. ఎంట్రన్స్ పరీక్షలు రాసేవారు మంచి ఫలితాలు పొందుతారు కానీ ఆశించిన చోట సీట్లు పొందలేరు. క్రీడాకారులకు శుభఫలితాలే ఉన్నాయి.

కన్యా రాశి రాజకీయనాయకులకు

కన్యా రాశి రాజకీయ నాయకులు శని బలం వల్ల రాణిస్తారు. ప్రజల్లో మంచి గుర్తింపు సంపాదిస్తారు. సమయానికి అనుకూలంగా వ్యవహరించడం వల్ల  పార్టీ పరంగా మీపై మంచి అభిప్రాయం ఉంటుంది కానీ ఎన్నికల్లో విజయం సాధించడంపై డౌటే. ఖర్చు  మాత్రం భారీగా అవుతుంది..

Also Read: శ్రీ క్రోధి నామ సంవత్సరంలో ఈ రాశివారికి మంచి చెడు సమానంగా ఉంటాయి!

కన్యా రాశి వ్యవసాయదారులు

శ్రీ క్రోధి నామ సంవత్సరం కన్యా రాశి వ్యవసాయదారులకు మొదటి పంట కన్నా రెండో పంట లాభిస్తుంది. కౌలుదార్లకు ఆర్థిక ఇబ్బందులు తప్పవు. అప్పులు చేస్తారు. 

ఓవరాల్ గా చెప్పుకుంటే శ్రీ క్రోధి నామ సంవత్సరం కన్యా రాశివారికి మిశ్రమ ఫలితాలున్నాయి. కొందరికి యోగం, మరికొందరికి అయోగం ఉంటుంది..ఇది మీ వ్యక్తిగత జాతకంలో ఉండే గ్రహస్థితిపై ఆధారపడి ఉంటుంది. శని బలంగా ఉన్నా రాహుకేతువుల సంచారం ప్రతికూల ఫలితాలనిస్తుంది. మీ ధైర్యమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది...

Also Read: ఈ రాశివారికి గతేడాది కన్నా ఈ సంవత్సరం విశేషమైన యోగ కాలం - క్రోథి నామ సంవత్సరం పంచాగం 2024 to 2025

మీ నక్షత్రం, రాశి ఏంటో తెలియకపోతే...మీ పేరులో మొదటి అక్షరం ఆధారంగా మీ నక్షత్రం తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి...

Also Read:  Ugadi Panchangam in Telugu (2024-2025) : క్రోధినామ సంవత్సరంలో మీ రాశి ఆదాయ - వ్యయాలు , గౌరవ అవమానాలు!

Note: జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పిన వివరాలు, కొన్ని పుస్తకాల ఆధారంగా రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR News: ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
NEET Row: 'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
Team India Victory Parade: జగజ్జేతలకు జేజేలు,  టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
జగజ్జేతలకు జేజేలు, టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
India's T20 World Cup Glory Celebrations: ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Jagtial Pencil Artist | పెన్సిల్ ఆర్ట్ తో అదరగొడుతున్న జగిత్యాల జిల్లా కళాకారుడు | ABP DesamDharmapuri Ramesh Social Service With Face book | సోషల్ మీడియాతో సామాజిక సేవచేస్తున్న రేణిగుంట రమేశ్Team India At ITC Maurya Hotel in Delhi | హోటల్ కు చేరుకున్న టీం ఇండియా |ABP DesamTeam India Lands In Delhi After World Cup Win | దిల్లీలో అడుగుపెట్టిన టీంఇండియా |ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR News: ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
NEET Row: 'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
Team India Victory Parade: జగజ్జేతలకు జేజేలు,  టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
జగజ్జేతలకు జేజేలు, టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
India's T20 World Cup Glory Celebrations: ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
Jagan : పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
Revanth In Delhi : బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
Team India Victory Parade: టీమిండియాకు ముంబయి గ్రాండ్ వెల్కమ్, భారీ జనం మధ్యన ఊరేగింపు
టీమిండియాకు ముంబయి గ్రాండ్ వెల్కమ్, భారీ జనం మధ్యన ఊరేగింపు
BRS News: రైతు ఆత్మహత్య వీడియోను పోస్ట్ చేసిన హరీశ్ రావు - చూస్తే కన్నీళ్లు ఆగవు!
రైతు ఆత్మహత్య వీడియోను పోస్ట్ చేసిన హరీశ్ రావు - చూస్తే కన్నీళ్లు ఆగవు!
Embed widget