Manmohan Singh Death | మాజీ ప్రధాని, ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ కన్నుమూత | ABP Desam
దేశం గర్వించదగిన ఆర్థికవేత్త, మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కన్ను మూశారు. ఆయన వయస్సు 92 సంవత్సరాలు. కొంత కాలంగా వృద్ధాప్యం కారణంగా అస్వస్థతతో బాధపడుతున్న మన్మోహన్ సింగ్ ఢిల్లీ ఎయిమ్స్ లో చికిత్స తీసుకుంటూ తుది శ్వాస విడిచారు. ఈరోజు సాయంత్రం మన్మోహన్ సింగ్ ఆయన నివాసంలో కళ్లు తిరిగి పడిపోగా కుటుంబసభ్యులు వెంటనే అప్రమత్తమై ప్రాథమిక చికిత్స అందించి 8గంటలకు ఢిల్లీ ఎయిమ్స్ కు తీసుకువచ్చారు. రాత్రి 09.51 నిమిషాలకు మన్మోహన్ తుది శ్వాస విడిచినట్లు ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రి వర్గాలు అధికారిక ప్రకటన చేశాయి.గ్రామీణ ఉపాధి హామీ పథకం, లైసెన్స్ రాజ్ ల రద్దు, విదేశీపెట్టుబడులకు స్వాగతం పలకటం, సమాచార హక్కు చట్టం, ఆహార భద్రత చట్టం ఇలా ఎన్నో మైలురాళ్లు అన దగ్గ చట్టాల రూపకల్పన మన్మోహన్ జీ హయాంలోనే జరిగాయి. విదేశాల్లో ఆర్థిక శాస్త్రంలో ఆయన ఉన్నత విద్యలను అభ్యసించారు.మన్మోహన్ మృతిపై దేశవ్యాప్తంగా ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.





















