అన్వేషించండి

Ugadi Rasi Phalalu in Telugu 2024 to 2025 : శ్రీ క్రోధి నామ సంవత్సర సింహ రాశి ఫలితాలు - ఉగాది రాశిఫలాలు 2024 to 2025

Ugadi Panchangam 2024 -2025: ఏప్రిల్ 9 మంగళవారం నుంచి క్రోధినామ సంవత్సరం ప్రారంభమవుతుంది. ఈ ఏడాది సింహ రాశివారి ఆదాయ వ్యయాలు , వార్షిక ఫలితాలు ఇక్కడ తెలుసుకోండి...

Ugadi Panchangam  Sri Krodhi Nama Samvatsaram 2024 to 2025 Leo Yearly Horoscope : శ్రీ క్రోధి నామసంవత్సరం సింహ రాశి వార్షిక ఫలితాలు

సింహ రాశి : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం 
ఆదాయం : 2 వ్యయం : 14 రాజ్యపూజ్యం:2 అవమానం : 2

సింహరాశివారికి ఈ ఏడాది మనోబలమే కానీ గ్రహాల అనుకూలత అస్సలు లేదు. ఆర్థిక పరిస్థితికి, కుటుంబంలో సంతోషానికి కారణం అయిన గురుడు పదో స్థానంలో ఉన్నాడు. రాహువు అష్టమ స్థానంలో అంటే ఎనిమిదో స్థానంలో సంచరిస్తున్నాడు... ఫలితంగా ఏడాది ఆరంభం నుంచే కష్టాలు మొదలైపోతాయి. ఏపని చేయాలి అనుకున్నా పెద్ద పోరాటమే చేయాల్సి వస్తుంది. మానసికంగా కుంగిపోతారు. ఆరోగ్యం కూడా అంత బావోదు. ఏ పని చేసినా కలసిరాదు. నిరాశ వెంటాడుతుంది. ఎంతమంచిగా ఉందాం అనుకున్నా ఏదో ఒక వివాదం చుట్టుముడుతూనే ఉంటుంది. మీ మనసులో ఆలోచన ఒకటైతే అది బయటకు వేరేలా అర్థమవుతుంది. ఆదాయం పరంగా కొంత పర్వాలేదు అనిపించినా అనుకోని సమస్యలు మిమ్మల్ని చుట్టుముడతాయి. మీ తెలివితేటలు, ఆత్మవిశ్వాసం వల్ల కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా మీకు మనశ్సాంతి లభిస్తుంది...

ఉగాది 2024 - 2025  క్రోధి నామ సంవత్సరం  మేష రాశి వార్షిక ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి)

సింహ రాశి ఉద్యోగులకు

శ్రీ క్రోధి నామ సంవత్సరంలో సింహ రాశి ఉద్యోగులకు అంత అనుకూల ఫలితాలు లేవు. రాహువు, శని ప్రభావం వల్ల కష్టానికి తగిన ప్రతిఫలం దక్కదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో పనిచేసేవారికి కొన్ని ఇబ్బందులు తప్పవు. ఉద్యోగులకు ఉన్నతాధికారుల వల్ల ఇబ్బందులుంటాయి. కాంట్రాక్టు ఉద్యోగం చేసేవారికి . నిరుద్యోగులకు ఈ ఏడాది కూడా నిరాశే మిగులుతుంది.  అయితే నూతన ఇంటిని కొనుగోలు చేయాలి , వాహనం కొనుగోలు చేయాలి అనుకున్న వారి కల నేరవేరే అవకాశం ఉంది..

సింహ రాశి వ్యాపారులకు

ఈ రాశి వ్యాపారులు ఈ ఏడాది ఆశించిన లాభాలు పొందలేరు. గృహసంబంధ వ్యాపారం చేసేవారు లాభపడతారు.  బంగారం, వెండి వ్యాపారులు నష్టపోారు. భాగస్వామ్య వ్యాపారం చేసేవారు వివాదాలకు దూరంగా ఉండాలి, ప్రతి విషయంలో అప్రమత్తంగా ఉండాలి. కాంట్రాక్టు వ్యాపారులకు కూడా అనుకూల సమయం కాదు.

 (ఉగాది 2024 - 2025  క్రోధి నామ సంవత్సరం  వృషభ రాశి వార్షిక  ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి)

సింహ రాశి కళాకారులకు

ఈ రాశి కళాకారులకు శ్రీ క్రోధి నామ సంవత్సరం అనుకూల ఫలితాలను ఇవ్వడం లేదు. టీవీ, సినిమా రంగాల్లో ఉండేవారికి నూతన అవకాశాలు లభించవు. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. అవార్డులు వస్తాయని ఆశించిన వారికి నిరాశ తప్పదు

సింహ రాశి రాజకీయ నాయకులకు

ఈ రాశి రాజకీయ నాయకులకు శ్రీ క్రోధి నామ సంవత్సరం గడ్డుకాలమే. అష్టమంలో రాహుసంచారం వల్ల మీపై నిందారోపణలు తప్పవు. అధిష్టానానికి మీపై మంచి అభిప్రాయం ఉండదు..ప్రజల్లో ఆదరణ తగ్గిపోతుంది. ఆశించిన పదవులు రాకపోవడంతో పాటూ ఉన్న పదవులు కోల్పోతారు. ఖర్చు మిగులుతుంది కానీ ఎన్నికల్లో పోటీ చేసినా విజయం సాధించలేరు. మీరు ఎవర్నైతే నమ్మారో వారి చేతిలోనే మోసపోతారు.

(ఉగాది 2024 - 2025  క్రోధి నామ సంవత్సరం  మిథున రాశి వార్షిక ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి)

సింహ రాశి విద్యార్థులకు

సింహ రాశి విద్యార్థులకు ఈ ఏడాది అనుకూల ఫలితాలే వస్తాయి. చదువుపై శ్రద్ధ పెరుగుతుంది..జ్ఞాపక శక్తి ఉంటుంది. అయితే చెడు స్నేహాల వల్ల పరీక్షలలో మార్కులు తగ్గుతాయి. ఎంట్రన్స్ పరీక్షలు రాసే విద్యార్థులు ఆశించిన ర్యాంకులు పొందినా కోరుకున్న కళాశాలలో సీట్లు పొందలేరు. 

 (ఉగాది 2024 - 2025  క్రోధి నామ సంవత్సరం  కర్కాటక రాశి వార్షిక ఫలితాల కోసం  ఈ లింక్ క్లిక్ చేయండి)

సింహ రాశి వ్యవసాయదారులు

ఈ రాశి వ్యవసాయదారులు ఓ పంట వల్ల లాభపడతారు, మరో పంట వల్ల నష్టపోతారు. కౌలుదారులకు కూడా నష్టాలు తప్పవు. అప్పులు చేస్తారు  కానీ వాటిని తీర్చలేరు...

ఓవరాల్ గా చూస్తే..శ్రీ క్రోధి నామసంవత్సరం సింహ రాశివారికి  గ్రహసంచారం అంతబాలేదు. ఆత్మవిశ్వాసంతో నెగ్గుకుని రావాలి కానీ గ్రహబలం అస్సలు కలసిరావడం లేదు. ఏడాది ఆరంభం కన్నా చివర్లో కొంత పర్వాలేదు. అందుకే ప్రతి చిన్న విషయంలోనూ ఆచి తూచి అడుగేయాలి...

Also Read: రానున్న ఎన్నికల్లో ఈ రాశుల రాజకీయ నాయకులు ధనం నష్టపోయినా గెలుపు పక్కా!

మీ నక్షత్రం, రాశి ఏంటో తెలియకపోతే...మీ పేరులో మొదటి అక్షరం ఆధారంగా మీ నక్షత్రం తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి...

Note: జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పిన వివరాలు, కొన్ని పుస్తకాల ఆధారంగా రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. మీ వ్యక్తిగత జాతకంలో ఉండే గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాలు మారుతాయి...

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
CM Chandrababu: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఒకరోజు ముందుగానే రైతుల ఖాతాల్లో డబ్బులు, సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఒకరోజు ముందుగానే రైతుల ఖాతాల్లో డబ్బులు, సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pawan Kalyan Tribal Villages Tour | పార్వతీపురం మన్యం జిల్లాలో రోడ్ల బాగు కోసం తిరిగిన డిప్యూటీ సీఎం | ABP Desamకాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
CM Chandrababu: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఒకరోజు ముందుగానే రైతుల ఖాతాల్లో డబ్బులు, సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఒకరోజు ముందుగానే రైతుల ఖాతాల్లో డబ్బులు, సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Variety Thief: ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
UGC NET Exam Schedule: యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
Yogi Adityanath: ఔరంగజేబు వారసులు ఇప్పుడు రిక్షా పుల్లర్స్-  అది దేవుడు రాసిన స్క్రిప్ట్ - యూపీ సీఎం వ్యాఖ్యలు వైరల్
ఔరంగజేబు వారసులు ఇప్పుడు రిక్షా పుల్లర్స్- అది దేవుడు రాసిన స్క్రిప్ట్ - యూపీ సీఎం వ్యాఖ్యలు వైరల్
Daaku Maharaaj: డాకు మహారాజ్ రెండో పాట రెడీ... చైల్డ్ సెంటిమెంట్ సాంగ్‌తో వస్తున్న బాలకృష్ణ
డాకు మహారాజ్ రెండో పాట రెడీ... చైల్డ్ సెంటిమెంట్ సాంగ్‌తో వస్తున్న బాలకృష్ణ
Embed widget