అన్వేషించండి

Ugadi Panchangam in Telugu (2024-2025) : శ్రీ క్రోధి నామ సంవత్సర కర్కాటక రాశి ఫలితాలు - ఉగాది పంచాంగం 2024 to 2025!

Happy Ugadi 2024 -2025: శ్రీ క్రోధినామ సంవత్సరంలో కర్కాటక రాశి ఆదాయ వ్యయాలు , వార్షిక ఫలితాలు ఇక్కడ తెలుసుకోండి...

Ugadi Panchangam  Sri Krodhi Nama Samvatsaram 2024 to 2025 Gemini Yearly Horoscope : శ్రీ క్రోధి నామసంవత్సరం కర్కాటక  రాశి ఫలితాలు

కర్కాటక రాశి : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష 
ఆదాయం : 14 వ్యయం : 2 రాజ్యపూజ్యం : 6 అవమానం : 6

శ్రీ క్రోధి నామ సంవత్సరంలో కర్కాటక రాశివారికి గురుడు శుభస్థానంలో ఉన్నందుకు ఎంత కష్టమైన పనులనైనా సక్సెస్ ఫుల్ గా పూర్తి చేయగలరు.  గౌరవ మర్యాదలు పెరుగుతాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలు సక్సెస్ ఫుల్ గా సాగుతాయి. అన్ని రంగాల వారు మంచి వృద్ధిలోకి వస్తారు. ఇంట్లో శుభకార్యాలు నిర్వహించేందుకు ప్లాన్ చేసుకుంటారు. కుటుంబంలో సంతోషం ఉంటుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వైవాహిక జీవితంలో ఉండే వివాదాలు ఈ ఏడాది సమసిపోతాయి. ధైర్యంగా ఉంటారు...అయితే అష్టమ శని ఉండడం వల్ల అనారోగ్య సమస్యలు వెంటాడుతాయి. వాహనప్రమాద సూచనలున్నాయి జాగ్ర్తతగా ఉండాలి. 

Also Read: శ్రీ క్రోధి నామ సంవత్సరంలో నక్షత్రాల వారీగా కందాయ ఫలాలు- సున్నాలుంటే మొత్తం శూన్యమే!

కర్కాటక రాశి ఉద్యోగులకు

ఈ రాశి ఉద్యోగులకు ఈ ఏడాది మంచి యోగకాలం అనే చెప్పాలి. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉండేవారు ప్రమోషన్ తో కూడిన ఆదాయం పెరుగుతుంది.
అధికారుల నుంచి గుర్తింపు పొందుతారు. కాంట్రాక్టు ఉద్యోగులకు పర్మినెంట్ అయ్యే సూచనలున్నాయి. ప్రైవేట్ సంస్థల్లో పనిచేసేవారికి ఉన్నతాధికారుల నుంచి మంచి గుర్తింపు లభిస్తుంది. ఈ రాశి నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో స్థిరపడతారు.

కర్కాటక రాశి వ్యాపారులకు

ఈ రాశి వ్యాపారులకు లాభదాయకమైన కాలం. పెట్టిన పెట్టుబడులు కలిసొస్తాయి. కొత్తగా వ్యాపారం ప్రారంభించాలి అనుకునేవారికి శుభసమయం. హోల్ సేల్, రీటైల్ రంగంలో ఉండేవారు ఊహించని లాభాలు పొందుతారు. షేర్ మార్కెట్లో పెట్టుబడులు కలిసొస్తాయి. భాగస్వామ్య వ్యాపారం చేసేవారికి కలిసొచ్చే సమయం ఇది

Also Read:  Ugadi Panchangam in Telugu (2024-2025) : క్రోధినామ సంవత్సరంలో మీ రాశి ఆదాయ - వ్యయాలు , గౌరవ అవమానాలు!

కర్కాటక రాశి రాజకీయ నాయకులకు

ఈ రాశి రాజకీయనాయకులకు మంచి సమయమే ఇది. ప్రజల్లో, అధిష్టానంలో మంచి పేరు ప్రఖ్యాతులుంటాయి. ఎన్నికల్లో విజయం సాధిస్తారు, ఆశించిన పదవులు పొందుతారు. ధనవ్యయం ఉంటుంది. చాలా నూతన కార్యక్రమాలు చేపడతారు.

కర్కాటక రాశి కళాకారులకు

ఈ రాశి కళాకారులకు కూడా గురుబలం కలిసొస్తుంది. నూతన అవకాశాలు వస్తాయి. ఆదాయం బావుంటుంది. ప్రేక్షకుల నుంచి మంచి గుర్తింపు లభిస్తుంది. మంచి అవార్డులు రివార్డులు పొందుతారు

కర్కాటక రాశి విద్యార్థులకు

ఈ రాశి విద్యార్థులకు గురుబలం ఉండడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది. పరీక్షలలో మంచి మార్కులు సంపాదిస్తారు. ఉన్నత విద్యకోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇంజినీరింగ్, మెడికల్ వంటి ఎంట్రన్స్ పరీక్షలు రాసే విద్యార్థులు మంచి ఫలితాలు పొందుతారు. కావాల్సిన కళాశాలలో సీట్లు సంపాదిస్తారు. క్రీడాకారులు తమకు కావాల్సిన జట్లలో స్థానం సంపాదించుకోగలుగుతారు

వ్యవసాయదారులకు

కర్కాటక రాశి వ్యవసాయ దారులకు రెండు పంటలు లాభిస్తాయి. ఆదాయం పెరుగుతుంది..పంట రుణాలు తీర్చగలుగుతారు. కౌలుదార్లు కూడా లాభపడతారు

ఓవరాల్ గా చెప్పాలంటే కర్కాటక రాశివారికి శ్రీ క్రోధి నామ సంవత్సరం యోగకాలం. ఊహించనంత ఉన్నతి పొందుతారు. ప్రతి ఒక్కరి దృష్టి మీపై ఉంటుంది. గత కొన్నేళ్లుగా వెంటాడుతున్న సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. మంచి పేరు ప్రఖ్యాతులు సాధిస్తారు. అయితే అష్టమ శని ప్రభావం వల్ల కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు తప్పవు...

ఉగాది 2024 - 2025  క్రోధి నామ సంవత్సరం  మేష రాశి వార్షిక ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

ఉగాది 2024 - 2025  క్రోధి నామ సంవత్సరం  వృషభ రాశి వార్షిక  ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

ఉగాది 2024 - 2025  క్రోధి నామ సంవత్సరం  మిథున రాశి వార్షిక ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

మీ నక్షత్రం, రాశి ఏంటో తెలియకపోతే...మీ పేరులో మొదటి అక్షరం ఆధారంగా మీ నక్షత్రం తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి...

Note: జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పిన వివరాలు, కొన్ని పుస్తకాల ఆధారంగా రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: 'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Special Trains: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
APSRTC: ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు రాయితీ - ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ
ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు రాయితీ - ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్ళపై ABP గ్రౌండ్ రిపోర్ట్సైబర్ క్రైమ్‌కి స్కామర్, వీడియో కాల్ పిచ్చ కామెడీ!గుడిలోకి చొరబడ్డ ఎలుగుబంట్లు, బెదిరిపోయిన భక్తులుDaaku Maharaaj Teaser | Nandamuri Balakrishna తో బాబీ ఏం ప్లాన్ చేశాడో | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: 'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Special Trains: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
APSRTC: ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు రాయితీ - ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ
ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు రాయితీ - ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ
The Rana Daggubati Show: రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
Flat Screen Vs Curved Screen: ఫ్లాట్ స్క్రీన్ వర్సెస్ కర్వ్‌డ్ స్క్రీన్ - ఈ రెండిట్లో ఏది ఉన్న స్మార్ట్ ఫోన్ తీసుకోవడం బెస్ట్!
ఫ్లాట్ స్క్రీన్ వర్సెస్ కర్వ్‌డ్ స్క్రీన్ - ఈ రెండిట్లో ఏది ఉన్న స్మార్ట్ ఫోన్ తీసుకోవడం బెస్ట్!
Ranji Trophy 2024: రంజీ ట్రోఫీ చరిత్రలో మరో అద్భుతం, ప్రత్యర్థి టీమ్ మొత్తాన్ని ఆలౌట్ చేసిన ఒకే ఒక్కడు
రంజీ చరిత్రలో మరో అద్భుతం, ప్రత్యర్థి టీమ్ మొత్తాన్ని ఆలౌట్ చేసిన ఒకే ఒక్కడు
PM Modi: ప్రధాని మోదీ ఎయిర్ క్రాఫ్ట్‌లో సాంకేతిక సమస్య
ప్రధాని మోదీ ఎయిర్ క్రాఫ్ట్‌లో సాంకేతిక సమస్య
Embed widget