Khammam Crime News: సర్వే, సోదాల పేరు చెప్పుకొని వచ్చేవాళ్లతో జాగ్రత్త- ఖమ్మంలో ఏం జరిగింది అంటే?
Khammam Crime News: ఆన్‌లైన్‌లో డిజిటల్ అరెస్టు అంటూ ఫేక్ పోలీసులు భయపెడుతున్నారు. ఇప్పుడు ఆఫ్‌లైన్‌లో కూడా సోదాలు పేరుతో చోరీ చేస్తున్నారు. ఖమ్మంలో జరిగిన ఘటన రేపు మీ ప్రాంతాల్లో కూడా జరగొచ్చు

Khammam Crime News: ఈ మధ్య కాలంలో సర్వేలు, ప్రజాభిప్రాయసేకరణ ఇలాంటి పదాలు చాలా పాపులర్ అయిపోయాయి. ఓవైపు ప్రభుత్వాలే వివిధ పథకాల కోసం సర్వేలు చేస్తున్నాయి. అదే టైంలో ప్రైవేట్ సంస్థలు కూడా ఏదో అంశంపై సర్వేలు అంటూ ప్రజల్లోకి వెళ్లున్నాయి. ఇప్పుడు దీన్న కొందరు కేటుగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు.
పోలీసుల పేరుతో మహిళ ఇంట్లో సోదాలు
ఖమ్మంలో ఓ మహిళ ఇంటికి పోలీసులు వచ్చారు. మీ అబ్బాయి గంజాయి అమ్ముతూ చిక్కాడని చెప్పారు. ఆ మాట వినడంతోనే ఆమె షాక్ అయ్యారు. దీంతో మరో షాక్ ఇచ్చారు వాళ్లు. ఇంట్లో గంజాయి ఉందేమో అనుమానంగా ఉందని అందుకే సోదాలు చేయాలని చెప్పి అన్నీ వెతికారు. అన్నీ ఎక్కడివక్కడ పడేసి వెళ్లిపోయారు.
పోలీసులు వెళ్లిపోయిన తర్వాత ఆమె అన్నింటినీ సర్దుకున్నారు. ఇంతలో బీరువా కూడా ఓపెన్ చేసి వెళ్లిపోయారు. ఆ బీరువాలో పెట్టుకున్న నగలు, క్యాష్ పోయినట్టు గుర్తించారు. వెంటనే లబోదిబోమని పోలీస్ స్టేష్‌కు వెళ్లారు. పోలీసులు వచ్చి సోదాలు చేశారు. నగదు బంగారం కనిపించడం లేదని చెప్పడంతో అక్కడ పోలీసులు కంగుతిన్నారు.
పోలీస్ స్టేషన్‌కు రావడంతో అది ఫేక్ అని తేలింది
అలాంటి సోదాలు తాము చేయలేదని గంజాయి కేసు ఈ మధ్య కాలంలో రిజిస్టర్ కాలేదని చెప్పడంతో అంతా నోరెళ్లబెట్టారు. ఏం జరిగిందని తెలుసుకుంటే వచ్చిన వాళ్లు నకిలీ పోలీసులని తేలింది. ఇలాంటి సోదాలు పేరుతో ఇప్పటికే తమిళాడు, కేరళ, కర్ణాటకలో చోరీలు జరిగినట్టు పోలీసులు గుర్తించారు. సర్వేలు, సోదాల పేరుతో వచ్చి ఇంటిని లూటీ చేయడం ఆ గ్యాంగ్ పనిగా తేల్చారు.
ఖమ్మంలో సంచలనం సృష్టించిన వైరా లీలా సుందరయ్య నగర్ కేసును పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. తమ పేరు చెప్పి చోరీ చేస్తున్న ముఠా ఆట కట్టించాలని డిసైడ్ అయ్యారు. అంతే జిల్లా వ్యాప్తంగా అన్ని స్టేషన్లకు సమాచారం ఇచ్చారు. ఎక్కడికక్కడ చెక్‌పోస్టులు పెట్టారు. అనుమానం ఉన్న వారిని విచారించారు. అనుమానం ఉన్న వాహనాలు తనిఖీ చేశారు.
నలుగురు అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు
ఇలా తనిఖీలు చేస్తున్న పోలీసులకు ఓ వాహనంలో వెళ్తున్న నలుగురు వ్యక్తులు తారసపడ్డారు. వారి వివరాలు అడుగుతుంటే పొంతనలేని సమాధానాలు చెప్పారు. వారి ప్రవర్తన వారు చెప్పే సమాధానాలు అన్నీ అనుమానంగా ఉండటంతో అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ స్టైల్‌లో ప్రశ్నించడంతో నిజాలు ఒప్పుకున్నారు.
వేర్వేరు రాష్ట్రాల్లో చోరీలు చేసినట్టు అంగీకరించారు. వారిని అరెస్టు చేసిన పోలీసులు వారి నుంచి 37 లక్షల నగదు. బంగారు ఆభరణాలు, కార్లు, మారణాయుధాలు, పోలీస్ యూనిఫామ్ స్వాధీనం చేసుకున్నారు. వీళ్లపై చాలా రాష్ట్రాల్లో కేసులు ఉన్నట్టు తెలుస్తోంది.
సర్వేలు, సోదాల పేరుతో వచ్చే వారి పూర్తిగా నమ్మొద్దని అనుమానం ఉంటే సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని పోలీసులు చెబుతున్నారు. సరైన పత్రాలు చూపించకుండా ఆధారాలు లేకుండా చేసే చర్యలను ప్రశ్నించాలని సూచిస్తున్నారు.
ఇప్పటికే ఆన్‌లైన్‌లో డిజిటల్ అరెస్టు అంటూ సైబర్ కేటుగాళ్లు రెచ్చిపోతుంటే... ఆఫ్‌లైన్‌లో కూడా ఇలాంటి మోసాలు జరుగుతుండటం ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది.





















