అన్వేషించండి

WPL MI Vs RCB Result Update: ఫైన‌ల్లో ఢిల్లీ.. ఆర్సీబీ చేతిలో ముంబై ఓట‌మి.. ఎలిమినేట‌ర్లో గుజ‌రాత్ తో ముంబై ఢీ..

ఎలిమినేట‌ర్ మ్యాచ్ లో గుజ‌రాత్ జెయింట్స్ తో ముంబై త‌ల‌ప‌డ‌నుంది. ఈ మ్యాచ్ లో గెలిచిన జ‌ట్టు శ‌నివారం జ‌రిగే టోర్నీ ఫైనల్లో ఢిల్లీతో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ రెండు మ్యాచ్ లు ముంబైలో జ‌రుగుతాయి. 

DC In WPL 2025 Final: ఊహించిన ఫ‌లిత‌మే వ‌చ్చింది. డ‌బ్ల్యూపీఎల్ లీగ్ ద‌శ‌లో రెండుసార్లు ఫైన‌లిస్టు ఢిల్లీ క్యాపిట‌ల్స్ ఆధిప‌త్యం కొనసాగుతోంది. వ‌రుస‌గా మూడో సీజన్ లోనూ  నేరుగా టోర్నీ ఫైన‌ల్లోకి ప్ర‌వేశించింది. మంగ‌ళ‌వారం రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు చేతిలో 11 ప‌రుగుల‌తో ముంబై ఇండియ‌న్స్ ఓడిపోవ‌డంతో ఢిల్లీ నేరుగా ఫైన‌ల్లోకి ప్ర‌వేశించింది. తాజా ప‌రాజ‌యంతో ఎలిమినేట‌ర్ స్థాయికి ముంబై ఇండియ‌న్స్ ప‌డిపోయింది.

గురువారం జ‌రిగే ఎలిమినేట‌ర్ మ్యాచ్ లో గుజ‌రాత్ జెయింట్స్ తో ముంబై త‌ల‌ప‌డ‌నుంది. ఈ మ్యాచ్ లో గెలిచిన జ‌ట్టు శ‌నివారం జ‌రిగే టోర్నీ ఫైనల్లో ఢిల్లీతో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ రెండు మ్యాచ్ లు ముంబైలోని బ్ర‌బౌర్న్ స్టేడియంలో జ‌రుగుతాయి. ఇక తాజాగా జ‌రిగిన ఆఖ‌రి లీగ్ మ్యాచ్ లో టాస్ ఓడి ఫ‌స్ట్ బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ.. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో మూడు వికెట్ల‌కు 199 ప‌రుగుల భారీ స్కోరు సాధించింది. డిఫెండింగ్ చాంపియ‌న్ గా బ‌రిలోకి దిగిన ఆర్సీబీ బ్యాట‌ర్లు.. బ్యాటింగ్ కు స్వ‌ర్గ‌ధామమైన ఈ పిచ్ పై ప‌రుగుల పండుగ చేసుకున్నారు. ముఖ్యంగా కెప్టెన్ స్మృతి మంధాన ఫ్యాబ్యుల‌స్ ఫిఫ్టీ (37 బంతుల్లో 53, 6 ఫోర్లు, 3 సిక్స‌ర్లు)తో ట‌చ్ లోకి వ‌చ్చి, ఫామ్ చాటుకుంది. బౌలర్ల‌లో హీలీ మ‌థ్యూస్ కు రెండు వికెట్లు ద‌క్కాయి. అనంత‌రం ఛేద‌న‌లో ముంబై.. 20 ఓవ‌ర్లు ఆడి, కేవ‌లం 9 వికెట్ల‌కు 188 ప‌రుగుల‌కు ప‌రిమిత‌మైంది. వ‌న్ డౌన్ బ్యాట‌ర్ నాట్ స్కివ‌ర్ బ్రంట్ మెరుపు ఫిఫ్టీ (35 బంతుల్లో 69, 9 ఫోర్లు, 2 సిక్సర్లు)తో స‌త్తా చాటింది. బౌల‌ర్ల‌లో స్నేహ్ రాణా మూడు వికెట్లతో రాణించింది. 

క‌సిగా ఆడిన ఆర్సీబీ..
ఈ మ్యాచ్ కు ముందే నాకౌట్ రేసు నుంచి త‌ప్పుకున్న ఆర్సీబీ.. చివ‌రి లీగ్ మ్యాచ్ లో ఫ్రీగా ఆడింది. ముఖ్యంగా ఫామ్ కోల్పోయి తీవ్ర విమ‌ర్శ‌లు ఎదుర్కొంటున్న స్మృతి త‌న బ్యాట్ కు ప‌దును పెట్టింది. ఆరంభం నుంచే బౌల‌ర్లపై ఎదురుదాడికి దిగింది. మ‌రో ఓపెన‌ర్ స‌బ్బినేని మేఘ‌న (13 బంతుల్లో 26, 4 ఫోర్లు, 1 సిక్స‌ర్) త‌గ్గేదేలే అంటూ దూకుడుగా ఆడింది. వీరిద్ద‌రూ 22 బంతుల్లోనే 41 ప‌రుగులు జోడించి తుఫాన్ ఆరంభాన్నిచ్చారు. ఆ త‌ర్వాత ఎలీస్ పెర్రీ (49 నాటౌట్) కూడా కుదురుగా ఆడ‌టంతో ఆర్సీబీ భారీ స్కోరు దిశ‌గా దూసుకెళ్లింది. స్మృతి, పెర్రీ జోడీ మెరుగ్గా స్ట్రైక్ రొటేట్ చేస్తూ, చ‌కచ‌కా ప‌రుగులు సాధించారు. ఈక్ర‌మంలో 35 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేసుకున్న స్మృతి.. ఆ త‌ర్వాత ఔట‌య్యింది. ఆ త‌ర్వాత వ‌చ్చిన రిచా ఘోష్ (36), జార్జియా వారెహ‌మ్ (31) కూడా దూకుడుగా ఆడ‌టంతో ఆర్సీబీ భారీ స్కోరు సాధించింది. మిగ‌తా బౌల‌ర్ల‌లో అమెలియా కెర్ కు ఒక వికెట్ ద‌క్కింది. 

టాపార్డ‌ర్ విఫ‌లం..
200 ప‌రుగుల ఛేజింగ్ చేస్తే, నేరుగా ఫైన‌ల్లోకి వెళ‌తామ‌ని స‌మీక‌ర‌ణం ముందున్న వేళ‌, ముంబైకి ఓపెన‌ర్లు శుభారంభాన్నివ్వ లేక‌పోయారు. హీలీ (19), అమెలియా (9) త్వ‌ర‌గా పెవిలియ‌న్ కు చేరారు. ఈ ద‌శ‌లో బ్రంట్ ప్ర‌త్య‌ర్థి బౌలర్ల‌పై ఎదురుదాడికి దిగి, ఒత్తిడిని పెంచింది. అయితే మ‌రో ఎండ్ లో త‌న‌కు స‌హ‌కారం అందించే వారు క‌రువ‌య్యారు. కెప్టెన్ హ‌ర్మ‌న్ ప్రీత్ (20)తోపాటు మిడిలార్డ‌ర్ బ్యాట‌ర్లు విఫ‌లం కావ‌డంతో ముంబైకి ఓట‌మి త‌ప్ప‌లేదు. చివ‌ర్లో స‌జీవ‌న్ సాజ‌న (23 నాటౌట్) రెండు సిక్స‌ర్లతో ఆశ‌లు రేపినా, ఆమె ఔట‌వ‌డంతో ముంబై ఆశ‌లు ఆవిర‌య్యాయి. మిగ‌తా బౌల‌ర్ల‌లో కిమ్ గార్త్, పెర్రీల‌కు రెండు, హీథ‌ర్ గ్రాహ‌మ్, జార్జియ వారెహ‌మ్ ల‌కు చెరో వికెట్ ల‌భించింది. స్నేహ్ రాణాకు ప్లేయ‌ర్ ఆఫ్ ద మ్యాచ్ ల‌భించింది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

RR Vs GT Qualifier 2 IPL 2026: ఐపీఎల్ క్వాలిఫైయర్ 2 మ్యాచ్‌లో ఈ 5 ప్లేయర్లు కీలకం.. వీరు రాణిస్తే ప్రత్యర్థికి కష్టమే
ఐపీఎల్ క్వాలిఫైయర్ 2 మ్యాచ్‌లో ఈ 5 ప్లేయర్లు కీలకం.. వీరు రాణిస్తే ప్రత్యర్థికి కష్టమే
Rajat Patidar In Team India Race:  లైమ్‌లైట్ లోకి ఆర్‌సీబీ కెప్టెన్ పాటిదార్: టీమిండియాలోకి తీసుకోవాలంటూ డిమాండ్
లైమ్‌లైట్ లోకి ఆర్‌సీబీ కెప్టెన్ పాటిదార్: టీమిండియాలోకి తీసుకోవాలంటూ డిమాండ్
GT vs RR Qualifier 2: వైభవ్ సూర్యవంశీని త్వరగా అవుట్ చేయడమే మా మెయిన్ టార్గెట్.. గుజరాత్ అసిస్టెంట్ కోచ్ పార్థివ్  కామెంట్స్
వైభవ్ సూర్యవంశీని త్వరగా అవుట్ చేయడమే మా మెయిన్ టార్గెట్.. గుజరాత్ అసిస్టెంట్ కోచ్ పార్థివ్  కామెంట్స్
IPL 2026 Qualifier-2  GT vs RR Preview: క్వాలిఫైయర్ 2 లో GT వర్సెస్ RR : ఫైనల్ టికెట్ కోసం హోరాహోరీ పోరు.. పిచ్ రిపోర్ట్, టాస్ కీలకం
క్వాలిఫైయర్ 2 లో GT వర్సెస్ RR : ఫైనల్ టికెట్ కోసం హోరాహోరీ పోరు.. పిచ్ రిపోర్ట్, టాస్ కీలకం

వీడియోలు

RR vs GT IPL 2026 Preview | RR vs GT ఐపీఎల్ మ్యాచ్ ప్రివ్యూ
Archer Comments on Vaibhav Suryavanshi | వైభవ్ సూర్యవంశీ పై జోఫ్రా ఆర్చర్ కామెంట్స్
Bhuvneshwar Kumar Comments on Virat Kohli | విరాట్ పై భువి ఫన్నీ కామెంట్స్
Ashwin Angry Comments on SRH Defeat | SRH ప్లేయర్స్‌ పై అశ్విన్ తీవ్ర ఆగ్రహం
Ambati Rayudu Comments on Yashasvi Jaiswal | యశస్వి జైస్వాల్‌ కు రాయుడు సలహా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Supreme Court Guidelines: సొంతంగా సెక్స్ వర్కర్లుగా మారడం నేరం కాదు, వారికి ఆధార్ కార్డులు జారీ చేయాలి: సుప్రీంకోర్టు
సొంతంగా సెక్స్ వర్కర్లుగా మారడం నేరం కాదు, వారికి ఆధార్ కార్డులు జారీ చేయాలి: సుప్రీంకోర్టు
రైలు టాయిలెట్‌లో వంటపాత్రల క్లీనింగ్.. IRCTCకి నోటీసులు జారీ చేసిన FSSAI
రైలు టాయిలెట్‌లో వంటపాత్రల క్లీనింగ్.. IRCTCకి నోటీసులు జారీ చేసిన FSSAI
Vaibhav Suryavanshi: చిచ్చర పిడుగు సూర్యవంశీ రికార్డు.. 25 బంతుల్లోనే సెంచరీ!
చిచ్చర పిడుగు సూర్యవంశీ రికార్డు.. 25 బంతుల్లోనే సెంచరీ!
Scrolling Social Media for Hours : గంటల తరబడి సోషల్ మీడియాలో స్క్రోల్ చేస్తున్నారా? ఈ అలవాటు ఎంత ప్రమాదమో తెలుసా?
గంటల తరబడి సోషల్ మీడియాలో స్క్రోల్ చేస్తున్నారా? ఈ అలవాటు ఎంత ప్రమాదమో తెలుసా?
Tripti Dimri Photos : స్పిరిట్ బ్యూటీ క్యూట్ లుక్ - నేచర్ విత్ గ్లామరస్ వైబ్... షూటింగ్ అప్డేట్ ఏంటంటే?
స్పిరిట్ బ్యూటీ క్యూట్ లుక్ - నేచర్ విత్ గ్లామరస్ వైబ్... షూటింగ్ అప్డేట్ ఏంటంటే?
Hypersonic Travel:6 గంటల ప్రయాణం కేవలం 15 నిమిషాల్లోనే...! హైపర్‌ సోనిక్‌ టెక్నాలజీలో జపాన్ సంచలనం!
6 గంటల ప్రయాణం కేవలం 15 నిమిషాల్లోనే...! హైపర్‌ సోనిక్‌ టెక్నాలజీలో జపాన్ సంచలనం!
DK Shivakumar Cars: కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్! ఆయన వద్ద ఏ కార్లు ఉన్నాయో తెలిస్తే షాక్
కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్! ఆయన వద్ద ఏ కార్లు ఉన్నాయో తెలిస్తే షాక్
Why Clouds Float: లక్షల కిలోల బరువు ఉండే మేఘాలు ఆకాశంలో ఎలా తేలుతాయి? వెనుక ఉన్న సైన్స్ ఇదే! 
100 ఏనుగుల బరువు, అయినా కింద పడవు! మేఘాల వెనుక ఉన్న సైన్స్ సీక్రెట్‌ మీకు తెలుసా? 
Embed widget