Pranay Murder Case Updates: అందుకే మీడియా ముందుకు రాలేకపోతున్నా- ప్రణయ్ హత్య కేసులో కోర్టు తీర్పుపై తొలిసారి స్పందించిన అమృత
Amruthaaa Varshini Pranay Murder Case Updates: ప్రణయ్ హత్య కేసులో వచ్చిన తీర్పుపై అమృత తన సోషల్ మీడియాలో స్పందించారు. వ్యక్తిగత కారణాలతో మీడియా ముందుకు రాలేకపోతున్నట్టు చెప్పుకొచ్చారు.

Amruthaaa Varshini Pranay Murder Case Updates: ఎక్కడ పరువు హత్య ఘటన జరిగినా వెంటనే గుర్తుకు వచ్చే కేసు అమృత ప్రణయ్ కేసు. అంత సంచలనంగా మారిందీ కేసు. అలాంటి సంచలనాల కేసులో తీర్పు వస్తే ప్రపంచమంతా రియాక్ట్ అయింది. కానీ పెద్దలను ఎదిరించి ప్రణయ్‌ను పెళ్లి చేసుకొని న్యాయపోరాటం చేసిన అమృత మాత్రం ఆలస్యంగా స్పందించారు. దీనిపై అనేకరకాల వాదనలు వినిపించాయి. ఒక్కొక్కరు ఒక్కోలా స్పందించారు. మీడియా కూడా అమృత ఎక్కడ అంటూ కథనాలు ప్రచురించింది.
అన్ని వైపుల నుంచి ఒత్తిడి రావడంతో కోర్టు తీర్పు వచ్చిన 24 గంటల తర్వాత అమృత స్పందించారు. నేరుగా మీడియా ముందుకు రాకుండా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు పెట్టారు. తాను ఎందుకు మీడియా ముందుకు రావడం లేదో క్లియర్‌గా చెప్పారు. ఈ కేసులో తనకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞత చెప్పారు.
ఇన్‌స్టాగ్రామ్‌లో అమృత పోస్టులో ఏం చెప్పారంటే..." ఇన్నేళ్ల నిరీక్షణ ముగిసింది. న్యాయం జరిగింది. నా హృదయం భావోద్వేగాలతో నిండిపోయింది. పరువు పేరుతో జరుగుతున్న అకృత్యాలు, హత్యలు ఈ తీర్పుతోనైనా ఆగుతాయని ఆశిస్తున్నానిు. ఈ ప్రయాణంలో నాకు అండగా నిలిచిన పోలీస్ శాఖకు, పబ్లిక్ న్యాయవాదికి, మీడియా ప్రతినిధులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. నా బిడ్డ పెరుగుతున్నాడు ఈ సమయంలో నా మానసిక ఆరోగ్యాన్ని, నా బిడ్డ భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని మీడియా ముందుకు రాలేకపోతున్నాను. ఎలాంటి ప్రెస్‌మీట్ నిర్వహించలేకపోతున్నాను. ఈ విషయాన్ని అర్థం చేసుకొని ప్రైవసీకి భంగం కలిగించొద్దని అభ్యర్థిస్తున్నాను" అని రిక్వస్ట్ చేశారు. ఇందులో తనకు అండగా నిలబడ్డ ఫ్యామిలీ మెంబర్స్‌కు ఫాలోవర్స్‌కు కూడా ఆమె కృతజ్ఞత చెప్పారు.
View this post on Instagram
ప్రణయ్ హత్యకేసుకు దారి తీసిన పరిస్థితులు ఏంటీ?
2018లో నల్గొండ జిల్లా మిర్యాలగూడలో అమృత భర్త ప్రణయ్‌ను హత్య చేశారు. ఈ పెళ్లి ఇష్టం లేని ఆమె తండ్రే మారుతీరావు సుపారీ గ్యాంగ్‌ను పురమాయించి ఈ ఘోరానికి ఒడిగట్టారు. నడిరోడ్డుపై జరిగిన హత్య అప్పట్లో సంచలనంగా మారింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు కోర్టుకు అన్ని సాక్ష్యాలు అందజేచారు. ఇన్నాళ్లు విచారణ చేసిన నల్గొండ ఎస్సీ, ఎస్టీ స్పెషల్ కోర్టు హత్య చేసిన సుభాష్‌కు ఉరిశిక్ష విధించింది. కేసులో అతనికి సహకరించిన ఆరుగురికి జీవితఖైదు విధించింది. దాదాపు ఐదేళ్లకుపైగా విచారణ సాగింది.
ఈ సెక్షన్ల ప్రకారం శిక్షలు వేశారు?
ఈ కేసులో ఏ1 మారుతీ రావు ఉన్నప్పటికీ 2020లో హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు. అందుకే ఏ2గా ఉన్న సుభాష్ శర్మకు ఉరిశిక్ష విధించింది కోర్టు. ఈకేసులో అమృత తండ్రి మారుతీ రావు ఏ1గా ఉన్నాడు. సుభాష్‌కుమార్ శర్మ ఏ2, అస్గర్ అలీ ఏ3, బారీ ఏ4, కరీం ఏ5, శ్రవణ్‌కుమార్ ఏ6, శివ ఏ7, నిజాం ఏ8గా పోలీసులు పేర్కొన్నారు. 2019లో ప్రణయ్ హత్యపై ఛార్జిషీటు దాఖలు వేశారు. ఐదేళ్లు విచారించిన కోర్టు 302, 120, 109, 1989 సెక్షన్ ipc, ఇండియన్ ఇండియన్ ఆర్మ్ యాక్ట్ 1959 ప్రకారం శిక్ష ఖరారు చేశారు.





















