search
×

SBI Loan For Women: ఎస్‌బీఐ స్పెషల్‌ లోన్‌ 'అస్మిత', మహిళలకు మాత్రమే - 'నారీశక్తి డెబిట్‌ కార్డ్‌' కూడా

SBI Asmita Loan: భారతీయ మహిళా వ్యవస్థాపకులకు సాధికారత కల్పించేందుకు, మహిళల నేతృత్వంలో నడిచే చిన్న పరిశ్రమలకు రుణం ఇచ్చేందుకు ఎస్‌బీఐ కొత్త లోన్‌ ఆఫర్‌ ప్రకటించింది.

FOLLOW US: 
Share:

SBI Asmita Loan And Nari Shakti Debit Card Details: దేశంలోని అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్‌ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), మహిళల కోసం ప్రత్యేక లోన్‌ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఆ రుణ పథకం పేరు 'అస్మిత'. నారీమణులు నడిపించే 'సూక్ష్మ, చిన్న & మధ్య తరహా పరిశ్రమల' (MSME)కు 'అస్మిత' పథకం కింద రుణాలు మంజూరు చేస్తుంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా, స్టేట్‌ బ్యాంక్‌ ఈ లోన్‌ స్కీమ్‌ను ప్రారంభించింది. దీని ద్వారా, మహిళా వ్యాపారులు, చిన్న పారిశ్రామికవేత్తలు తక్కువ వడ్డీ రేట్లకు సులభంగా ఆర్థిక సాయం పొందవచ్చు, వ్యాపారం/పరిశ్రమను విస్తరించుకోవచ్చు.

వాస్తవానికి, బ్యాంక్‌లు ఇచ్చే వ్యాపార రుణాలలో మహిళల భాగస్వామ్యం చాలా తక్కువగా ఉంటున్నాయని ట్రాన్స్‌యూనియన్ CIBIL ఇటీవలే ఓ రిపోర్ట్‌ రిలీజ్‌ చేసింది. మహిళా రుణాలలో కేవలం 3 శాతం మాత్రమే వ్యాపార ప్రయోజనాల కోసం తీసుకున్నారని, 42 శాతం వ్యక్తిగత రుణాలు & గృహ రుణాలు వంటి వ్యక్తిగత అవసరాల కోసం తీసుకున్నారని ఆ డేటా తేటతెల్లం చేసింది. అదే సమయంలో, 38 శాతం రుణాలను బంగారం కుదువబెట్టి తీసుకున్నారు. కొందరు మహిళలు బంగారం తాకట్టు పెట్టి గోల్డ్‌ లోన్‌ తీసుకుంటుంటారు. ఈ నేపథ్యంలో, స్టేట్‌ బ్యాంక్‌  'అస్మిత' పథకాన్ని తీసుకొచ్చింది.

SBI అస్మిత పథకం వివరాలు, ప్రయోజనాలు

తాకట్టు లేని రుణం - అస్మిత స్కీమ్‌ కింద లోన్‌ పొందడానికి ఆస్తులను తాకట్టు పెట్టాల్సిన అవసరం లేదు.
అవసరానికి తగ్గ రుణాలు - వివిధ వ్యాపార అవసరాలకు అనుగుణంగా రుణ మొత్తాలు జారీ.
తక్కువ వడ్డీ రేట్లు - ఆర్థిక భారాన్ని తగ్గించడానికి ఆకర్షణీయమైన వడ్డీ రేట్లు, రీపేమెంట్‌ ఆప్షన్లు.
పేపర్‌లెస్ ప్రక్రియ - పూర్తిగా డిజిటల్ & ఇబ్బంది లేని దరఖాస్తు ప్రక్రియ.
బ్యాంక్‌ నుంచి మద్దతు - వ్యాపార వృద్ధి & ఆర్థిక నిర్వహణపై బ్యాంక్‌ నుంచి మార్గదర్శకత్వం.
వ్యవస్థాపక శిక్షణ - వ్యాపార నైపుణ్యాన్ని పెంచుకోవడానికి రుణగ్రహీతలకు అవకాశం.

'నారి శక్తి' ప్లాటినం డెబిట్ కార్డ్
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా, అస్మిత పథకంతో పాటు, 'నారి శక్తి' రూపే డెబిట్ కార్డ్‌ను కూడా స్టేట్‌ బ్యాంక్‌ అందుబాటులోకి తీసుకొచ్చింది. పర్యావరణ పరిరక్షణకు పెద్ద పీట వేస్తూ, పూర్తిగా రీసైకిల్ చేసిన ప్లాస్టిక్‌తో ఈ డెబిట్‌ కార్డ్‌లను తయారు చేయడం విశేషం. 'నారి శక్తి' రూపే డెబిట్ కార్డ్‌తో కార్డ్ షాపింగ్, ప్రయాణం, వినోదం, బీమా సహా ప్రత్యేక ప్రయోజనాలు అందుతాయి. ముఖ్యంగా, మహిళల విషయంలో మారుతున్న ఆర్థిక & జీవనశైలి అవసరాలను ఈ కార్డ్‌ తీరుస్తుంది.

స్టాండ్-అప్ ఇండియా లోన్‌ స్కీమ్‌
మహిళలు నిర్వహించే వ్యాపారాలకు మద్దతుగా, స్టేట్‌ బ్యాంక్‌ గతంలోనూ చాలా ఆర్థిక పథకాలు లాంచ్‌ చేసింది. వాటిలో ఒకటి 'స్టాండ్-అప్ ఇండియా పథకం'. ఇది మహిళా వ్యవస్థాపకులకు, ముఖ్యంగా SC, ST, OBC నేపథ్యాల నుంచి వచ్చిన వారికి రుణం అందించే ప్రత్యేక కార్యక్రమం. ఈ పథకం కింద, అర్హత కలిగిన దరఖాస్తుదారులు రూ.10 లక్షల నుంచి రూ.1 కోటి వరకు రుణాలు పొందవచ్చు. రుణ కాలపరిమితి ఏడు సంవత్సరాల వరకు ఉంటుంది, గరిష్టంగా 18 నెలల మారటోరియం వ్యవధి ఉంటుంది. GSTతో పాటు రుణ మొత్తంలో 0.20 శాతం ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది.

Published at : 11 Mar 2025 02:45 PM (IST) Tags: Debit card SBI loan SBI Asmita Loan SBI Nari Shakti Debit Card SBI loans for women

ఇవి కూడా చూడండి

Best Investment Options: తల్లి పేరు మీద ఇన్వెస్ట్ చేస్తే అధిక వడ్డీ ప్రయోజనాలు.. ఆ స్కీమ్స్ చూశారా

Best Investment Options: తల్లి పేరు మీద ఇన్వెస్ట్ చేస్తే అధిక వడ్డీ ప్రయోజనాలు.. ఆ స్కీమ్స్ చూశారా

Salary Account Benefits : ఏదైనా బ్యాంకులో మీకు శాలరీ అకౌంట్‌ ఉందా? ఈ 10 అదనపు ప్రయోజనాలు గురించి తెలుసా?

Salary Account Benefits : ఏదైనా బ్యాంకులో మీకు శాలరీ అకౌంట్‌ ఉందా? ఈ 10 అదనపు ప్రయోజనాలు గురించి తెలుసా?

Big EPFO Update: ATM నుంచి PF డబ్బులు తీసుకునే వెసులుబాటు ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది? ఎంత పరిమితి ఉంటుంది?

Big EPFO Update: ATM నుంచి PF డబ్బులు తీసుకునే వెసులుబాటు ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది? ఎంత పరిమితి ఉంటుంది?

LPG Price : కొత్త సంవత్సరంలో దేశ ప్రజలకు పెద్ద షాక్! 111 రూపాయలు పెరిగిన ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర!

LPG Price : కొత్త సంవత్సరంలో దేశ ప్రజలకు పెద్ద షాక్! 111 రూపాయలు పెరిగిన ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర!

New Rules Change : ఎల్పీజీ, పీఎన్జీ నుంచి యూపీఐ వరకు ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చిన ఈ ఐదు ప్రధాన మార్పులు!

New Rules Change : ఎల్పీజీ, పీఎన్జీ నుంచి యూపీఐ వరకు ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చిన ఈ ఐదు ప్రధాన మార్పులు!

టాప్ స్టోరీస్

BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు

BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు

Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్

Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్

Telugu TV Movies Today: సోమవారం స్మాల్ స్క్రీన్‌‌పై సందడి చేసే సినిమాలివే.. టీవీ సినిమాల గైడ్!

Telugu TV Movies Today: సోమవారం స్మాల్ స్క్రీన్‌‌పై సందడి చేసే సినిమాలివే.. టీవీ సినిమాల గైడ్!

Hero Splendor లేదా TVS Star City Plus ఏ బైక్ కొనడం బెస్ట్ ? ధర, మైలేజీ తెలుసుకోండి

Hero Splendor లేదా TVS Star City Plus ఏ బైక్ కొనడం బెస్ట్ ? ధర, మైలేజీ తెలుసుకోండి