search
×

Holi Bank Holidays: కస్టమర్లకు అలెర్ట్‌ - గురువారం నుంచి బ్యాంక్‌లకు సెలవులు, వరుసగా 4 రోజులు పని చేయవు

Bank Holidays List: బ్యాంకు సెలవులు రాష్ట్రాల వారీగా మారుతూ ఉంటాయి, అన్ని రాష్ట్రాల్లో ఒకే విధంగా ఉండవు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI), చట్ట ప్రకారం ఈ సెలవులను నిర్ణయిస్తుంది.

FOLLOW US: 
Share:

Holi 2025 Bank Holidays: ఈ వారంలో మార్చి 14, శుక్రవారం నాడు హోలీ పండుగ ఉంది. కొన్ని రాష్ట్రాల్లో.. హోలికా దహన్‌, హోలీ దహన్, ధులేటి, ధులండి, ఢోల్‌ జాతర పేరిట ఈ పండుగకు ముందు, తర్వాత కూడా వేడుకలు జరుగుతాయి. ఈ కారణంగా బ్యాంక్‌లకు వరుస సెలవులు వచ్చాయి.

హోలీ పండుగ వేడుకల సందర్భంగా, వివిధ రాష్ట్రాల్లోని బ్యాంకులు మార్చి 13, గురువారం నుంచి మార్చి 16 ఆదివారం వరకు హాలిడేస్‌లో ఉంటాయి. అంటే, బ్యాంక్‌లు ఈ వారంలో వరుసగా నాలుగు రోజులు పని చేయవు. బ్యాంక్‌లో మీకు ఏదైనా అర్జంట్‌ పని ఉంటే బుధవారం నాటికి దానిని పూర్తి చేసుకోవడం బెటర్‌.      

ఇక్కడ ఓ విషయం ఏంటంటే, బ్యాంకు సెలవులు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఒకేలా ఉండవు. ఏదైనా పండుగకు ఉన్న ప్రాంతీయ ప్రాధాన్యాన్ని బట్టి, సెలవులు రాష్ట్రాల వారీగా మారుతూ ఉంటాయి. 

బ్యాంక్‌లకు వరుసగా నాలుగు రోజులు సెలవులు:       

మార్చి 13, గురువారం - హోలికా దహన్, అట్టుకల్ పొంగళ్‌:   ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్, కేరళ సహా అనేక రాష్ట్రాలలో ఈ పండుగలు జరుపుకుంటారు, ఈ రాష్ట్రాల్లో గురువారం నాడు బ్యాంక్‌లకు సెలవు. హోలీ వేడుకలకు నాందిగా హోలికా దహన్ నిర్వహిస్తారు. అట్టుకల్ పొంగళ్‌ కేరళలో జరుపుకునే ప్రసిద్ధ పండుగ.

మార్చి 14, శుక్రవారం - హోలీ (ధులేటి/ధులండి/డోల్ జాత్ర):   త్రిపుర, కర్ణాటక, ఒడిశా, తమిళనాడు, మణిపూర్, కేరళ, నాగాలాండ్ వంటి కొన్ని రాష్ట్రాలు మినహా భారతదేశంలోని చాలా ప్రాంతాలలో ఈ రోజున హోలీని జరుపుకుంటారు. తెలంగాణ సహా ఆయా రాష్ట్రాలలో శుక్రవారం నాడు బ్యాంక్‌లకు హాలిడే.

మార్చి 15, శనివారం - హోలీ/యావోసంగ్ 2వ రోజు:    భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో, ముఖ్యంగా అగర్తల, భువనేశ్వర్, ఇంఫాల్, పట్నాలో, హోలీ వేడుకల రెండో రోజును కూడా ఘనంగా నిర్వహిస్తారు. ఈ వేడుకను యావోసంగ్ అని పిలుస్తారు. యావోసంగ్ అనేది హోలీని పోలి ఉండే పండుగ. భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రాలలో ముఖ్యంగా మణిపూర్‌లో ప్రత్యేక సాంస్కృతిక ప్రాముఖ్యతను కలిగి ఉంది.

మార్చి 16, ఆదివారం - వారాంతపు సెలవు:    భారతదేశం అంతటా అన్ని రాష్ట్రాలు, ప్రాంతాలలో బ్యాంక్‌లకు సాధారణ సెలవు.

ఈ సెలవులతో పాటు, ప్రభుత్వ రంగ బ్యాంకులు ఈ నెలలో మొత్తం తొమ్మిది రోజులు పని చేయవు. వీటిలో వివిధ రాష్ట్రాల్లో అమలయ్యే నిర్దిష్ట సెలవులు, RBI ఆదేశించిన రెండో & నాలుగో శనివారాలు కలిసి ఉన్నాయి. ఆదివారం సెలవులు ఈ జాబితాకు అదనం. ఈ అన్ని రోజులను ప్రభుత్వ రంగ బ్యాంకులకు 'నాన్‌ వర్కింగ్‌ డేస్‌' ‍‌(non-working days)గా పరిగణిస్తారు.

సెలవు రోజుల్లో బ్యాంక్‌ లావాదేవీలు ఎలా?
బ్యాంక్‌లకు సెలవుల వచ్చినప్పటికీ, వినియోగదారులు ఆన్‌లైన్‌లో, మొబైల్ బ్యాంకింగ్ యాప్‌లు, ATMల ద్వారా నగదు లావాదేవీలు నిర్వహించుకోవచ్చు, వీటికి ఎలాంటి ఆటంకం ఉండదు. అయితే, తప్పనిసరిగా బ్యాంక్‌ వెళ్లాల్సిన అవసరం పడితే మాత్రం ఈ సెలవు షెడ్యూల్‌ను దృష్టిలో పెట్టుకోవాలి.

Published at : 11 Mar 2025 11:54 PM (IST) Tags: Bank holidays Bank Holidays List Bank Transactions In Holidays march 2025 Holidays in March 2025

ఇవి కూడా చూడండి

Gold Jewellery Insurance: బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తే ఉచిత బీమా లభిస్తుంది.. ఏ సందర్భాల్లో కవర్ అవుతుంది

Gold Jewellery Insurance: బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తే ఉచిత బీమా లభిస్తుంది.. ఏ సందర్భాల్లో కవర్ అవుతుంది

Best Investment Options: తల్లి పేరు మీద ఇన్వెస్ట్ చేస్తే అధిక వడ్డీ ప్రయోజనాలు.. ఆ స్కీమ్స్ చూశారా

Best Investment Options: తల్లి పేరు మీద ఇన్వెస్ట్ చేస్తే అధిక వడ్డీ ప్రయోజనాలు.. ఆ స్కీమ్స్ చూశారా

Salary Account Benefits : ఏదైనా బ్యాంకులో మీకు శాలరీ అకౌంట్‌ ఉందా? ఈ 10 అదనపు ప్రయోజనాలు గురించి తెలుసా?

Salary Account Benefits : ఏదైనా బ్యాంకులో మీకు శాలరీ అకౌంట్‌ ఉందా? ఈ 10 అదనపు ప్రయోజనాలు గురించి తెలుసా?

Big EPFO Update: ATM నుంచి PF డబ్బులు తీసుకునే వెసులుబాటు ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది? ఎంత పరిమితి ఉంటుంది?

Big EPFO Update: ATM నుంచి PF డబ్బులు తీసుకునే వెసులుబాటు ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది? ఎంత పరిమితి ఉంటుంది?

LPG Price : కొత్త సంవత్సరంలో దేశ ప్రజలకు పెద్ద షాక్! 111 రూపాయలు పెరిగిన ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర!

LPG Price : కొత్త సంవత్సరంలో దేశ ప్రజలకు పెద్ద షాక్! 111 రూపాయలు పెరిగిన ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర!

టాప్ స్టోరీస్

Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!

Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!

ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది

ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది

Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల

Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల

Nache Nache Full Song : 'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్

Nache Nache Full Song : 'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్