Puliputti Village Name History | పేరుతోనే ఫేమస్ అవుతున్న ఊరు ఇదే | ABP Desam
దట్టమైన అటవీ ప్రాంతం అంటే వన్యమృగాలకు అనువుగా ఉండే చోటు. అయితే కొన్ని గ్రామాలు ప్రకృతితో ఎంత మమేకం అయిపోతాయంటే ఆ ఊరి పరిసరాలను కూడా తమ స్థావరంగా మార్చేసుకుంటాయి. అలాంటి ఓ గ్రామమే పార్వతీపురం మన్యం జిల్లా పులిపుట్టి గ్రామం. పులిపుట్టి ఊరికి వెళ్లాలంటే పులిబొమ్మ ఉన్న బోర్డే స్వాగతం పలుకుతుంది. అసలు ఈ ఊరికి ఆ పేరు ఎందుకు వచ్చిందంటే..ఇంట్రెస్టింగ్ కథ చెబుతారు ఇక్కడి వాళ్లు. పులి వచ్చి ఇక్కడ పిల్లల్ని పెట్టి వెళ్లేదట. అవి కొంచెం పెద్దవయ్యే వరకూ ఇక్కడ కాపలా కాసేవట. పులులు పుట్టే ప్రాంతం కాబట్టి ఈ ఊరిని పులిపుట్టి అని పిలుస్తారని చెబుతున్నారు స్థానికులు. ఇక్కడ పులుల సంచారం ఎక్కువగా ఉండటంతో గతంలో పర్లాకిమిడి రాజులు ఈ ప్రాంతానికి వేటకు కూడా వచ్చి వెళ్లేవారట. మరికొంత మంది చెప్పేది ఏంటంటే ఇక్కడ నీటిని తాగేందుకు అడవిలో నుంచి పులులు వచ్చి తాగి వెళ్లేవని అలా ఈ ఊరికి పులులతో మంచి స్నేహబంధం ఉందని చెబుతారు. సోషల్ మీడియా యుగం వచ్చిన తర్వాత ఈ ఊరిపేరు ఇప్పుడప్పుడే ఫేమస్ అవుతోందని...కొంతమంది రోడ్డు మీదే పక్కఊర్లకు వెళ్లే వాళ్లు కూడా బోర్డు చూసి తమ ఊరికి వచ్చి వెళ్తున్నారని చెబుతున్నారు.