![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Ugadi Rasi Phalalu In Telugu 2024: శ్రీ క్రోధి నామ సంవత్సర మీన రాశి ఫలితాలు - ఉగాది పంచాంగం 2024 to 2025
Ugadi Panchangam 2024 -2025: క్రోధినామ సంవత్సరంలో అడుగుపెట్టాం. ఈ ఏడాది మీన రాశి వారి ఆదాయ వ్యయాలు , వార్షిక ఫలితాలు ఇక్కడ తెలుసుకోండి...
![Ugadi Rasi Phalalu In Telugu 2024: శ్రీ క్రోధి నామ సంవత్సర మీన రాశి ఫలితాలు - ఉగాది పంచాంగం 2024 to 2025 Ugadi Panchangam in Telugu 2024-2025 Krodhi Nama Samvatsara yearly meena rasi phalalu Pisces aadaya vyayam Ugadi Rasi Phalalu In Telugu 2024: శ్రీ క్రోధి నామ సంవత్సర మీన రాశి ఫలితాలు - ఉగాది పంచాంగం 2024 to 2025](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/26/be462d82dfc4f2debf41dae97d2d05ec1711433246251217_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Ugadi Panchangam Sri Krodhi Nama Samvatsaram 2024 to 2025 Aquarius Yearly Horoscope : శ్రీ క్రోధి నామసంవత్సరం మీన రాశి వార్షిక ఫలితాలు
మీన రాశి : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి
ఆదాయం : 11 వ్యయం : 5 రాజ్యపూజ్యం :2 అవమానం : 4
శ్రీ క్రోధి నామ సంవత్సరంలో మీన రాశివారికి ఎల్నాటి శని కొనసాగుతోంది, గురుడు శుభ స్థానంలో ఉన్నాడు. రాహు, కేతువులు అనుకూల స్థానాల్లో లేరు. ఫలితంగా మీ సొంత విషయాల్లో మీకు ధైర్యం తక్కువగా ఉంటుంది. భారీగా సంపాదిస్తారు కానీ అంతే త్వరగా ఖర్చు చేసేస్తారు. స్త్రీ మూలకంగా ప్రయోజనం పొందుతారు. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. అయితే ఏడాది ఆరంభంలో సమస్యలన్నా ద్వితీయార్థం బావుంటుంది. పట్టుదలతో అనుకున్న కార్యాలు సాధిస్తారు. కుటుంబంలో సంతోషం పెరుగుతుంది. శత్రువులు మిత్రులుగా మారుతాయి. గౌరవం పెరుగుతుంది..
మీన రాశి ఉద్యోగుకు
ఈ రాశి ఉద్యోగులకు ఏలినాటి శని ఉన్నప్పటికీ ఆ ప్రభావం అంతగా ఉండదు. శని వల్ల అనుకూల ఫలితాలతో పాటూ గురుబలం కలిసొస్తుంది. ఫలితంగా వృత్తి, ఉద్యోగాలలో మంచి ఫలితాలు సాధిస్తారు. మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. ఆదాయం పెరుగుతుంది. నిరుద్యోగులు సౌకర్యవంతమైన ఉద్యోగాల్లో స్థిరపడతారు. మీ తెలివితేటల వల్ల ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది.
మీన రాశి వ్యాపారులకు
శ్రీ క్రోధి నామసంవత్సరం మీన రాశి వ్యాపారులకు ఈ ఏడాది శని, గురు శుభ ఫలితాలను ఇవ్వడం వల్ల పట్టిందల్లా బంగారం అన్నట్టే ఉంటుంది. కొత్తగా ఏ వ్యాపారం ప్రారంభించినా సక్సెస్ అవుతారు. కాంట్రాక్టులు చేసేవారికి కొత్త క్రాంటాక్టులు లభిస్తాయి. బంగారం, వెండి వ్యాపారులకు భారీ లాభాలుంటాయి. షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేవారు గతంలో కోల్పోయిన మొత్తం తిరిగి సంపాదిస్తారు.
మీన రాశి విద్యార్థులకు
గురుబలం ఉండడం వల్ల మీన రాశి విద్యార్థులు పరీక్షలలో మంచి ఫలితాలు సాధిస్తారు. జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఇతర వ్యవహారాలపై దృష్టి తగ్గించి చదువుపై శ్రద్ధ పెడతారు. ఎంట్రన్స్ పరీక్షలు రాసేవారు మంచి ర్యాంకులు పొందుతారు..
మీన రాశి వ్యవసాయ దారులు
ఈ రాశి వ్యవసాయ దారులకు రెండు పంటల నుంచి లాభాలు పొందాతురు. అప్పులు తీరుస్తారు. ఇంట్లో శుభకార్యాలు నిర్వహించేందుకు ప్లాన్ చేసుకుంటారు. కౌలుదారులుకు, ఇతర వ్యవసాయాలు చేసేవారికి గతేడాది కన్నా మంచి ఫలితాలుంటాయి..
మీన రాశి కళాకారులకు
శ్రీ క్రోధి నామ సంవత్సరం మీన రాశి కళాకారులకు యోగకాలం. మీరు పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. మంచి అవకాశాలు లభిస్తాయి...ఆశించిన విజయం పొందుతారు. జీవితంలో స్థిరత్వం పొందేందుకు ఇదే మంచి సమయం. అవార్డులు,రివార్డులు అందుకుంటారు..
మీన రాశి రాజకీయ నాయకులకు
శ్రీ క్రోధి నామ సంవత్సరం మీన రాశి రాజకీయనాయకులకు గ్రహాలు అనుకూల స్థానంలోనే ఉన్నాయి. ప్రజాభిమానం పొందుతారు..పార్టీలో పై అధికారుల నుంచి మంచి గుర్తింపు లభిస్తుంది. భారీగా ఖర్చు చేసినా అందుకు తగిన ఫలితం పొందుతారు. ఎన్నికల్లో పోటీ చేస్తే విజయం సాధిస్తారు.
ఓవరాల్ గా చెప్పుకుంటే మీన రాశివారికి గతేడాదితో పోలిస్తే శ్రీ క్రోధి నామ సంవత్సరం అన్ని విధాలుగా కలిసొస్తుంది. ఏడాది ఆరంభంలో చిన్న చిన్న చికాకులున్నా ఆ తర్వాత అన్నీ సర్దుకుంటాయి. శ్రమకు తగిన గుర్తింపు, ఫలితం రెండూ ఉంటాయి. తెలివితేటల్ని సద్వినియోగం చేసుకుంటారు. ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంటారు.
Note: జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పిన వివరాలు, కొన్ని పుస్తకాల ఆధారంగా రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)