అన్వేషించండి

PM Modi Vizag Tour: దేశానికే గేమ్‌ ఛేంజర్‌ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు- నేడు వైజాగ్‌లో ప్రధాని మోదీ చేతుల మీదుగా శంకుస్థాపన

Green Hydrogen Project: ప్రధానమంత్రి శంకుస్థాపన చేసే ప్రాజెక్టు విశాఖ రూపురేఖలు మార్చడమే కాదు దేశానికే గేమ్‌ ఛేంజర్‌లా మారనుంది. ఇక్కడ ఉత్పత్తి ప్రారంభమైతే భవిష్యత్‌లో పెట్రోల్ డీజిల్ కనిపించదు.

Green Hydrogen Project: దేశం మొత్తానికి గ్రీన్ ఎనర్జీ ఇచ్చే భారీ ప్రాజెక్ట్ వైజాగ్‌లో నేడు(జనవరి 8)  శంకుస్థాపన జరగనుంది. లక్షా 81వేల కోట్ల పూడిమడక NTPC గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ NGEL,  గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భూమి పూజ చేయనున్నారు.  

పెట్రోల్, డీజిల్ థర్మల్ పవర్‌ భవిష్యత్‌లో కనిపించదు. దాని స్థానంలో గ్రీన్ ఎనర్జీ రాబోతోంది. రెన్యువల్ ఎనర్జీ వనరులైనా సోలార్, విండ్ పవర్‌కు గ్రీన్ హైడ్రోజన్ ఎనర్జీ తోడు కాబోతోంది. అలాంటి ప్రపంచాన్ని శాసించే ఎనర్జీ ఉత్పత్తికి విశాఖపట్నం కేరాఫ్ అడ్రస్ కాబోతోంది. ఇండియాలో అతిపెద్ద గ్రీన్ హైడ్రోజన్ హబ్‌ను విశాఖలోని పూడిమడకలో NTPC నిర్మిస్తోంది. లక్ష 81వేల కోట్ల వ్యయంతో ప్రారంభమయ్యే ఈ ప్రాజెక్టు దేశం మొత్తానికి గ్రీన్ హైడ్రోజన్ హబ్‌గా మారనుంది. . 

నేషనల్ గ్రీన్ ఎనర్జీ మిషన్ 
కాలుష్య కారకాలుగా ఉన్న డీజిల్, పెట్రోల్ వాహనాలు స్థానంలో ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహనాలు వస్తూ ఉన్నాయి. మరింతగా ఉద్గారాలు తగ్గించేందుకు గ్రీన్ హైడ్రోజన్ యూజ్ అవుతుంది. భవిష్యత్‌లో పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు మొత్తం హైడ్రోజన్ సెల్ ఫ్యూయల్ వాహనాలుగా మారనున్నాయి. గ్రీన్ ఎనర్జీ మిషన్‌ను ఇండియా చాలా ప్రతిష్టాత్కంగా తీసుకుంది. 2070 నాటికి దేశంలో కర్బన ఉద్గారాలు జీరో చేయాలని లక్ష్యంగా చేసుకుంది. అందుకే రాజస్థాన్, ఏపీ, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో భారీ సోలార్, విండ్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నారు. ప్రైవేటు ప్లాంట్లతోపాటు ప్రభుత్వరంగ సంస్థ అయిన ఎన్టీపీసీ కూడా ముఖ్య పాత్ర పోషిస్తోంది. NTPC అనుబంధ సంస్థ NTPC గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ NGEL పెద్ద ఎత్తున రెన్యూవల్ ఎనర్జీ ప్లాంట్లు  ఏర్పాటు చేయనుంది. రామగుండంలోని సోలార్ ప్లాంట్లు, తమిళనాడు ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్లుసహా పలు ప్రాంతాల్లో విండ్ పవర్ ప్రాజెక్టులు ఏర్పాటు చేశారు. 

గ్రీన్ హైడ్రోజన్ హబ్‌గా ఆంధ్రప్రదేశ్
వైజాగ్‌లో ఏర్పాటు చేయబోతున్న ప్లాంట్ భారత రవాణా రంగం రూపురేఖలనే మార్చేయనుంది. ప్రస్తుతం దేశంలో ఎమిషన్స్‌లో 40శాతం వాహనరంగం నుంచే వస్తున్నాయి. దీన్ని తగ్గించడానికి ఈ మిషన్ చాలా కీలకం. దీని నుంచి రోజూ 1500 మెట్రిక్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్, 1500 మెట్రిక్ టన్నుల గ్రీన్ ఇథనాల్, 1500 మెట్రిక్ టన్నుల సస్టెయినబుల్ ఏవియేషన్ ఫ్యూయల్, 4500 టన్నుల గ్రీన్ అమ్మోనియా ఉత్పత్తి చేస్తారు. 2032 నాటికి 5మిలియన్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేయాలన్నది లక్ష్యం. ఇప్పుటి వరకూ ఇండియాలో హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ తయారీ లేదు. 

ఎన్టీపీసీనే లద్దాక్‌లో గ్రీన్ ఎనర్జీ మెబిలిటీ ప్లాంట్ ఏర్పాటు చేసి కొద్దిగా ఇంధనాన్ని ఉత్పత్తి చేస్తోంది. దీంతో లేహ్ లద్దాక్‌లో, గ్రేటర్ నోయిడాలో పైలట్ పద్దతిలో హైడ్రోజన్ ఫ్యూయల్ బస్సులను ప్రారంభించారు.  హైడ్రోజన్ ఫ్యూయల్ కారును రవాణా మంత్రి నితిన్ గడ్కరీ దిగుమతి చేసుకుని ఢిల్లీలోని రీసెర్చ్ సెంటర్లో హైడ్రోజన్ ఫ్యూయల్ ఇస్తున్నారు. 

గేమ్ ఛేంజర్‌గా వైజాగ్ 
NTPCకి పరవాడ దగ్గర సింహాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ఉంది. దీనికి కాస్త దూరంలో పూడిమడక వద్ద కొత్త ప్రాజెక్టు రాబోతోంది. మొదట్లో దీన్ని థర్మల్ ప్లాంట్‌గానే అనుకున్నారు. తర్వాత ప్రయారిటీ మారి గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు వచ్చింది. దీనికి సమీపంలోనే గంగవరం, విశాఖ పోర్టులున్నాయి. ఇక్కడి మిథనాల్‌ ఎగుమతికి ఉపయోగపడతాయి. భారీగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు రానున్నాయి. 

గో గ్రీన్ అప్రోచ్ 
2032 నాటికి 60 గిగావాట్స్ రెన్యూవల్ ఎనర్జీ ఉత్పత్తి చేయాలన్నది ఎన్టీపీసీ టార్గెట్. ఇప్పటికి 5 గిగావాట్ల ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయి. మరో 22 గిగావాట్ల ప్రాజెక్టులు సిద్ధంగా ఉన్నాయి. సోలార్, విండ్, న్యూక్లియర్ వంటి ఇతర ప్రాజెక్టులు ఉన్నా.. గ్రీన్ హైడ్రోజన్ అన్నది చాలా ప్రత్యేకం. దీనికి భారీగా నీరు, ఎలక్ట్రిసిటీ అవసరం. ఉత్పత్తి ఖర్చు కూడా ఎక్కువే. ప్రస్తుతానికి కిలో హైడ్రోజన్ ఫ్యూయెల్ ఖర్చు 3 డాలర్లు. ఉత్పత్తి పెంచి దీన్ని ఒక డాలర్‌కు తీసుకురావాలన్నది లక్ష్యం.  

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana: తెలంగాణ ఎన్డీఏ ఊహాగానాలు - కాంగ్రెస్ వైపు కేసీఆర్ చూపు - చెన్నై సమావేశానికి వెళ్లింది అందుకేనా ?
తెలంగాణ ఎన్డీఏ ఊహాగానాలు - కాంగ్రెస్ వైపు కేసీఆర్ చూపు - చెన్నై సమావేశానికి వెళ్లింది అందుకేనా ?
YS Jagan:  అటు ఎన్డీఏ - ఇటు ఇండీ కూటమి - ఎటు వైపో తేల్చుకోలేకపోతున్న జగన్ !
అటు ఎన్డీఏ - ఇటు ఇండీ కూటమి - ఎటు వైపో తేల్చుకోలేకపోతున్న జగన్ !
KCR Latest News: అందుకే చంద్రబాబు గెలిచాడు, మనం అలా కాదు : కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు
అందుకే చంద్రబాబు గెలిచాడు, మనం అలా కాదు : కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు
Pawan Kalyan Latest News: పవన్ పేరు చెబితే ర్యాగింగ్ చేశారు- నంద్యాల ఎంపీ శబరి ఆసక్తికర వ్యాఖ్యలు
పవన్ పేరు చెబితే ర్యాగింగ్ చేశారు- నంద్యాల ఎంపీ శబరి ఆసక్తికర వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

డీలిమిటేషన్ పై దక్షిణాది యుద్ధంమేము రాజకీయంగా నష్టపోతాంIPL 2025 Captain's Meet | రేపటి నుంచే ఐపీఎల్ మహా సంగ్రామం ప్రారంభం | ABP DesamHyderabad to host Miss World pageant |  మే 7-31 వరకూ తెలంగాణ వేదిక మిస్ ఇండియా పోటీలు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana: తెలంగాణ ఎన్డీఏ ఊహాగానాలు - కాంగ్రెస్ వైపు కేసీఆర్ చూపు - చెన్నై సమావేశానికి వెళ్లింది అందుకేనా ?
తెలంగాణ ఎన్డీఏ ఊహాగానాలు - కాంగ్రెస్ వైపు కేసీఆర్ చూపు - చెన్నై సమావేశానికి వెళ్లింది అందుకేనా ?
YS Jagan:  అటు ఎన్డీఏ - ఇటు ఇండీ కూటమి - ఎటు వైపో తేల్చుకోలేకపోతున్న జగన్ !
అటు ఎన్డీఏ - ఇటు ఇండీ కూటమి - ఎటు వైపో తేల్చుకోలేకపోతున్న జగన్ !
KCR Latest News: అందుకే చంద్రబాబు గెలిచాడు, మనం అలా కాదు : కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు
అందుకే చంద్రబాబు గెలిచాడు, మనం అలా కాదు : కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు
Pawan Kalyan Latest News: పవన్ పేరు చెబితే ర్యాగింగ్ చేశారు- నంద్యాల ఎంపీ శబరి ఆసక్తికర వ్యాఖ్యలు
పవన్ పేరు చెబితే ర్యాగింగ్ చేశారు- నంద్యాల ఎంపీ శబరి ఆసక్తికర వ్యాఖ్యలు
Vizag:  వైజాగ్ బీచ్‌కు మళ్లీ బ్లూఫ్లాగ్ గుర్తింపు - కలెక్టర్ కఠిన చర్యలతో మళ్లీ కళకళ
వైజాగ్ బీచ్‌కు మళ్లీ బ్లూఫ్లాగ్ గుర్తింపు - కలెక్టర్ కఠిన చర్యలతో మళ్లీ కళకళ
Actor Posani Latest News : గుంటూరు జైలు నుంచి నటుడు పోసాని కృష్ణమురళి విడుదల 
గుంటూరు జైలు నుంచి నటుడు పోసాని కృష్ణమురళి విడుదల 
IPL 2025 Openinsg Ceremony Highlights: ఘ‌నంగా ఐపీఎల్ ఆరంభ వేడుక‌లు.. ఫుల్ సంద‌డి చేసిన బాలీవుడ్ బాద్ షా.. 17 ఏళ్ల త‌ర్వాత కేకేఆర్‌, ఆర్సీబీ ఫస్ట్ మ్యాచ్.. భువీకి షాక్..  
ఘ‌నంగా ఐపీఎల్ ఆరంభ వేడుక‌లు.. ఫుల్ సంద‌డి చేసిన బాలీవుడ్ బాద్ షా.. 17 ఏళ్ల త‌ర్వాత కేకేఆర్‌, ఆర్సీబీ ఫస్ట్ మ్యాచ్.. భువీకి షాక్..  
Visakha Mayor:  విశాఖ మేయర్ పై అవిశ్వాసం - పదవి కాపాడుకోవడం వైసీపీకి కష్టమేనా ?
విశాఖ మేయర్ పై అవిశ్వాసం - పదవి కాపాడుకోవడం వైసీపీకి కష్టమేనా ?
Embed widget