Allu Arjun met Sri Tej | శ్రీతేజ్ ను ఆసుపత్రిలో పరామర్శించిన అల్లు అర్జున్ | ABP Desam
పోలీసు బందోబస్తు మధ్యలో అల్లు అర్జున్ కిమ్స్ ఆసుపత్రిలో శ్రీతేజ్ ను పరామర్శించారు. పుష్ప 2 ప్రీమియర్స్ షో సందర్భంగా సంధ్యా థియేటర్ లో జరిగిన తొక్కిసలాటలో రేవతి మృతి చెందగా ఆమె కుమారుడు శ్రీతేజ్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. దీనిపై తీవ్రస్థాయిలో చర్చ జరగగా..అల్లు అర్జున్ అరెస్ట్ కావటం..బెయిల్ పై విడుదలవటం జరిగాయి. ఇప్పటికే పుష్ప2 టీమ్ తరపున అల్లు అర్జున్ తరపున 2 కోట్లు ఆర్థిక సాయం ప్రకటించగా..ఇవాళ స్వయంగా అల్లు అర్జున్ కిమ్స్ ఆసుపత్రికి వెళ్లి బాలుడు శ్రీతేజ్ ను పరామర్శించారు. వాళ్ల కుటుంబానికి సానుభూతి తెలపటంతో పాటు శ్రీతేజ్ వైద్యానికి పూర్తిగా తను బాధ్యత తీసుకుంటానని ప్రకటించారు. ముందస్తు సమాచారం లేకుండా ఆసుపత్రికి వెళ్లద్దని పోలీసులు అల్లు అర్జున్ కు నోటీసులు ఇవ్వగా..ఈ రోజు ముందుగానే పోలీసులకు చెప్పి వారి సమక్షంలోనే బాలుడిని కలిశారు అల్లు అర్జున్. బన్నీ వెంట ఫిల్మ్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఛైర్మన్ దిల్ రాజు కూడా ఉన్నారు.