KTR Supreme Court: ఏసీబీ కేసును క్వాష్ చేయండి - హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాల్ చేసిన కేటీఆర్
Formula E case: క్వాష్ పిటిషన్ కొట్టేసిన హైకోర్టు తీర్పును కేటీఆర్ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఏసీబీ కేసు రాజకీయ ప్రేరేపితం అని కొట్టి వేయాలని కోరారు.
KTR challenged the High Court verdict in the Supreme Court which dismissed the quash petition: తెలంగాణ హైకోర్టు తన క్వాష్ పిటిషన్ కొట్టివేయడంతో కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు తీర్పు తర్వాత న్యాయనిపుణులతో సుదీర్ఘంగా సంప్రదింపులు జరిపారు.హైకోర్టు డివిజన్ బెంచ్ కు వెళ్లాలా లేకపోతే సుప్రీంకోర్టుకా అన్నదానిపై చర్చించారు. చివరికి తన న్యాయవాది సిద్ధార్థ దవే సలహాలో సుప్రీంకోర్టులోనే పిటిషన్ వేశారు. హైకోర్టు తీర్పును సవాల్ చేశారు. ఈ పిటిషన్ ఎప్పుడు విచారణకు వస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.
హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసిన కేటీఆర్
తనపై తప్పుడు కేసు పెట్టారని ఎలాంటి అవినీతి లేకపోయినా ఏసీబీ కేసు పెట్టారని చెల్లదని కేటీఆర్ అంటున్నారు. తన వాదనను తెలంగాణ హైకోర్టు పరిగణనలోకి తీసుకోలేదని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు. తెలంగాణ హైకోర్టు తీర్పును ఎఫ్ఐఆర్‌ను కొట్టివేయాలని ఆయన కోరారు. తెలంగాణ హైకోర్టు తీర్పు వచ్చిన తర్వాత నెక్ట్స్ ఏం చేయాలన్నదానిపై సన్నిహితులతో విస్తృతంగా చర్చలు జరిపిన సమయంలో న్యాయపోరాటం కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. హైకోర్టులో ఆర్డర్ ఇచ్చింది సింగిల్ బెంచ్ కాబట్టి డివిజన్ బెంచ్ కు వెళ్లడం లేదా సుప్రీంకోర్టుకు వెళ్లడం అనే రెండు మార్గాలపై కసరత్తు చేసినట్లుగా తెలుస్తోంది.
అరెస్టు చేస్తే సుదీర్ఘ కాలం జైల్లో ఉంచుతారన్న అనుమానం
ఆయన లీగల్ టీం అన్ని రకాల అవకాశాలను పరిశీలించిన తర్వాత డివిజన్ బెంచ్ కన్నా నేరుగా సుప్రీంకోర్టుకు వెల్లాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు పిటిషన్ దాఖలు చేశారు. కేటీఆర్ తరపున ఢిల్లీలో న్యాయవ్యవహారాలను సీనియర్ సుప్రీంకోర్టు లాయర్ సిద్ధార్ధ దవే చూస్తున్నారు. ఆయనే కేటీఆర్ తరపున సుప్రీంకోర్టులో వాదించే అవకాశం ఉంది. న్యాయపోరాటం చేయకపోతే ఈ కేసులో సుదీర్ఘ కాలం జైల్లో ఉంచుతారన్న అనుమానం బీఆర్ఎస్ వర్గాల్లో ఉందని చెబుతున్నారు. ఓ వైపు ఏసీబీ.. మరో వైపు ఈడీ ఆయనకు వరుసగా నోటీసులు జారీ చేస్తున్నాయి.
సుప్రీంకోర్టు పిటిషన్ క్లియర్ అయ్యే వరకూ దర్యాప్తు సంస్థలు వేచి చూస్తాయా ?
అయితే అరెస్టు ముప్పు మాత్రం కేటీఆర్‌కు పొంచి ఉందని భావిస్తున్నారు. సుప్రీంకోర్టుకు వెళ్లినా అక్కడ రిలీఫ్ రాకపోతే తప్పు జరిగిందని అందరూ నిర్దారించేశారన్న అభిప్రాయానికి వస్తారు. అదే జరిగితే కేటీఆర్ ను అరెస్టు చేసినా ప్రజల నుంచి స్పందన రాదు. అనుకున్నంతగా మైలేజ్ రాదు. హైకోర్టులో క్వాష్ పిటిషన్ ను కొట్టివేయడంతోనే ... ఈ కేసులో ఏదో ఉందన్న సంకేతాలు ప్రజల్లోకి వెళ్లాయని చెబుతున్నారు. ఇప్పుడు సుప్రీంకోర్టులో విచారణకు ఆయనకు చాలా కీలకం. కనీసం అరెస్టు నుంచి రక్షణ వచ్చేలా చూసుకున్నా కాస్త రిలీఫ్ లభిస్తుందని భావిస్తున్నారు. అయితే కేటీఆర్ పిటిషన్ పై తమ వాదనలు వినకుండా ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వవొద్దని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఇప్పటికే కేవియట్ దాఖలు చేసింది.