![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Case On KTR: ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 - నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
BRS: కేటీఆర్‌పై ఏసీబీ నాలుగు నాలుగు బెయిలబుల్ సెక్షన్ల కిందకేసులు పెట్టింది. ఏ 2 ఐఏఎస్ అఫీసర్ అర్వింద్ కుమార్ ను చేర్చారు.
![Case On KTR: ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 - నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు ACB has filed four cases against KTR under four bailable sections. Case On KTR: ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 - నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/12/19/3dc01b2475e2b6a89288efea61fab8731734606101721228_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ACB has filed four cases against KTR under four bailable sections: కొంత కాలం నుంచి విస్తృతంగా ప్రచారం జరుగుతున్నట్లుగానే తెలంగాణ ఏసీబీ అధికారులు కేటీఆర్ పై కేసు నమోదు చేశారు. ఫార్ములా వన్ ఈ రేసు నిర్వహణ అంశంలో ప్రభుత్వ నిధుల్ని అక్రమంగా తరలించాలన్నదానిపై కేసు పెట్టారు. ఈ వ్యవహారంలో ఏ వన్ గా కేటీఆర్ ను చేర్చారు. ఏ టుగా సీనియర్ ఐఏఎస్ అర్వింద్ కుమార్ ఉన్నారు. ఏ త్రీగా బీఎల్ఎన్ రెడ్డి ని చేర్చారు. మొత్తం నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు పెట్టారు.మరో వైపు విదేశీ కంపెనీకి భారతీయ కరెన్సీని చెల్లించడంపై ఆర్బీఐ రూ. ఎనిమది కోట్ల పైన్ కూడా వేసినట్లుగా ఏసీబీ చెబుతోంది.
గత ప్రభుత్వ హయాంలో నిర్వహించిన ఫార్ములా ఈ రేస్‌లో చోటుచేసుకున్నఅక్రమాలపై విచారణకు ప్రభుత్వం అవినీతి నిరోధక శాఖకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ప్రాథమిక విచారణ జరిపిన ఏసీబీ అధికారులు ఈ రేస్ వ్యవహారంలో రూ.55 కోట్లు ఎలాంటి అనుమతులు లేకుండా తరలించారని గుర్తించారు. ఆర్బీఐ అనుమతి కూడా తీసుకోకుండా విదేశీ కంపెనీకి తరలించారని గుర్తించారు. ఈ వ్యవహారంలో మాజీ మంత్రి కేటీఆర్ ప్రధాన నిందితుడు కావడంతో.. సెక్షన్ 17A ప్రకారం గవర్నర్ అనుమతి తప్పని సరి. మంత్రిగా విధి నిర్వహణ సమయంలో వచ్చిన ఆరోపణలు కాబట్టి గవర్నర్ అనుమతి తీసుకోవాల్సి ఉంది. అక్టోబర్ లోనే ఏసీబీ గవర్నర్ కు అనుమతి కోసం పంపింది. న్యాయసలహా తీసుకున్న గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ ఇటీవల అనుమతి ఇచ్చారు.
Also Read: KTR Letter: అదానీ మీకు శత్రువు, రేవంత్‌కు మిత్రుడా? ఇది డబుల్ స్టాండ్ కాదా? రాహుల్‌కు కేటీఆర్ లేఖ
గవర్నర్ అనుమతి పత్రాన్ని సీఎస్.. ఏసీబీకి పంపారు. ఏసీబీ తాజాగా కేసు నమోదుచేశారు. ఇప్పుడు కేటీఆర్ ను అరెస్టు చేస్తారా లేకపోతే నోటీసులు జారీ చేసి ప్రశ్నిస్తారా ఆన్నది ఆసక్తికరంగా మారింది. ఫార్ములా ఈ రేస్‌కు సంబంధించి అప్పటి ప్రభుత్వంలోని ప్రజాప్రతినిధులు ఆదేశిస్తేనే విదేశీ సంస్థలకు నిధులు విడుదల చేశామని ఇప్పటికే అధికారులు వెల్లడించారు. మున్సిపల్ శాఖ ఉన్నతాధికారిగా పని చేసిన అర్వింద్ కుమార్ కేటీఆర్ నోటి మాట ద్వారా ఆదేశించడంతోనే నిధులు ఇచ్చామని అంటున్నారు. ఆ నివేదికల్ని కూడా ఏసీపీ పొందుపరిచినట్లుగా తెలుస్తోంది.
ఆ విదేశీ సంస్థకు చెల్లించాల్సిన అవసరమే లేదని... చెల్లించేందుకు ఆర్థికశాఖ అనుమతి.. కేబినెట్ అనుమతి లేదు. పూర్తిగా ప్రజాధనం లెక్కల్లో లేకుండా పోయిందని చెబుతున్నారు. ఇది పూర్తిగా నిధుల స్వాహా అనే అభిప్రాయం కల్పిస్తుంది. అందుకే ఏసీబీ కేసు నమోదు చేసింది. సీరియస్ నేరం కావడం పక్కాగా సాక్ష్యాలు ఉండటంతో విచారణకు పిలిచి అరెస్టులు చేసే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Sadhguru is a Yogi, mystic, visionary and author](https://cdn.abplive.com/imagebank/editor.png)