అన్వేషించండి

Tirumala News: ఆకాశ గంగ నుండి శ్రీవారి ఆలయానికి పవిత్ర జలాలు ఎందుకు తీసుకొస్తారంటే !

Tirumala News: సర్వదర్శనం భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండి పోవడంతో బయట ఎస్ఎంసీ జనరేటర్ వరకూ క్యూలైన్స్ లో వేచి ఉన్నారు.

Tirumala News: తిరుమలలో‌ భక్తుల రద్దీ కొనసాగుతుంది. ప్రతి శుక్రవారం ఆకాశ గంగ జలంతో శ్రీవేంకటేశ్వరస్వామికి అభిషేకం నిర్వహించడం ఆనవాయితీ వస్తోంది. గురువారం 16-0 9-22 రోజున 65,634 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. ఇక స్వామి వారికి 31,419 మంది తలనీలాలు సమర్పించగా, 4 కోట్ల రూపాయలు భక్తులు హుండీ ద్వారా కానుకలుగా సమర్పించారు. ఇక సర్వదర్శనం భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండి పోవడంతో బయట ఎస్ఎంసీ జనరేటర్ వరకూ క్యూలైన్స్ లో వేచి ఉన్నారు. దీంతో స్వామి వారి సర్వ దర్శనానికి 20 గంటల సమయం‌ పడుతుంది.‌ ఇక ప్రత్యేక ప్రవేశ దర్శనంకు రెండు గంటల సమయం పడుతుంది. 
సుప్రభాతంతో స్వామివారి మేలుకొలుపు
శ్రీవారి ఆలయంలో వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారం శ్రీ వేంకటేశ్వరుడికి కైంకర్యాలు నిర్వహిస్తున్నారు అర్చకులు. శుక్రవారం ప్రత్యూషకాల ఆరాధనతో ఆలయ ద్వారముకు తెరిచిన అర్చకులు. బంగారు వాకిలి వద్ద శ్రీ వేంకటేశ్వర సుప్రభాత స్త్రోతంతో స్వామి వారిని మేలు కొలిపారు. అనంతరం ఆకాశ జలాలతో శ్రీ వేంకటేశ్వరుడికి అభిషేక సేవను ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు.‌ అటుతరువాత  తోమాల, అర్చన సేవలు నిర్వహించిన అర్చకులు. ప్రాతఃకాల ఆరాధనలో‌ భాగంగా స్నపన మండపంలో శ్రీకొలువు శ్రీనివాసమూర్తిని వారి సమక్షంలో దర్భార్ నిర్వహించారు. శ్రీవారికి పంచాంగ శ్రవణం,హుండీ జనాకర్షణ విన్నవించి, బెల్లంతో  కలిపిన నువ్వుల పిండిమి స్వామి వారిని నైవేద్యంగా సమర్పించారు. నవనీత హారతి సమర్పించి అనంతరం శ్రీనివాసమూర్తిని తిరిగి సన్నిధిలో వేంచేపు చేసారు. ప్రాతఃకాల ఆరాధనలో భాగంగా మొదటి ఘంటా నివేదనలో అన్నప్రసాదం, లడ్డూ, వడలు స్వామి వారికి నైవేద్యంగా సమర్పించారు. 
సర్కారు వారి హారతి.. భక్తులకు దర్శనం
సన్నిధిలో శ్రీ వైష్ణవ సాంప్రదాయం ప్రకారం సాత్తుమొర నిర్వహించిన అనంతరం సర్కారు హారతి అందించి ప్రోటోకాల్ పరిధిలోని భక్తులకు స్వామి వారి దర్శన భాగ్యం కల్పించింది టిటిడి. అనంతరం స్వామి వారికి రెండోవ గంట నివేదన, బలి జరిపి సర్వదర్శనం భక్తులను స్వామి వారి దర్శనంకు అనుమతించారు. శ్రీవారి ఉత్సవమూర్తు అయినా శ్రీదేవి,భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారిని విమాన ప్రదక్షణగా సంపంగి ప్రాకారంలోనికి వేంచేపు చేసి మధ్యాహ్నం 12 గంటలకు నిత్య కళ్యాణోత్సవంను నేత్ర పర్వంగా నిర్వహిస్తారు అర్చకులు. అటు తరువాత ఆలయంలోని అద్దాల మండపంలో డోలోత్సవం సేవను నిర్వహించి,‌ ఉత్సవ మూర్తులను ఆలయ వెలుపల ఉన్న వైభోత్సవ మండపానికి ఊరేగింపుగా తీసుకెళ్ళి ఆర్జిత బ్రహ్మోత్సవం, ఆర్జిత వసంతోత్సవం సేవలు నిర్వహిస్తారు అర్చకులు. 
సాయంకాలం సహస్రదీపాల కొలువులో ఊంజల్ సేవ నిర్వహించిన పిదప నిత్యోత్సవం నిర్వహిస్తారు అర్చకులు. సర్వదర్శనం నిలుపుదల చేసిన అనంతరం శ్రీవారికి రాత్రి కైంకర్యాలు ప్రారంభిస్తారు అర్చకులు. ఈ కైంకర్యాల్లో‌ భాగంగా రాత్రి తోమాల, అర్చన, రాత్రి గంట, తిరువీసం ,ఘంటాబలి నిర్వహిస్తారు. తిరిగి సర్వదర్శనం భక్తులను స్వాము వారి దర్శనంకు అనుమతించి, సర్వదర్శనం పూర్తి అయిన తరువాత ఆగమోక్తంగా శ్రీవారికి చివరి సేవగా ఏకాంత సేవను నిర్వహిస్తారు అర్చకులు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh Latest News:
"అక్టోబర్‌ 2 తర్వాత హెలికాప్టర్ ఎక్కడైనా దిగొచ్చు" చంద్రబాబు వార్నింగ్ మెసేజ్ 
Telangana CM Revanth Reddy:
"రక్తమరుగుతుంది, బట్టలూడదీసికొడతారు"- జర్నలిస్టులపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు 
Telangana CM Revanth Reddy:
"కేసీఆర్ ఆరోగ్యంతో వందేళ్లు అక్కడ ఉండాలే- మేం ఇక్కడ ఉండాలే" స్టేచర్‌పై మళ్లీ రేవంత్ సంచలన వ్యాఖ్యలు
Telangana CM Revanth Reddy : కృష్ణాజలాలపై చర్చకు సిద్ధమా- కేసీఆర్‌కు సభలో రేవంత్ సవాల్‌
కృష్ణాజలాలపై చర్చకు సిద్ధమా- కేసీఆర్‌కు సభలో రేవంత్ సవాల్‌
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Naga babu Indirect Counters on Varma | టీడీపీ ఇన్ ఛార్జి వర్మపై నాగబాబు పరోక్ష కౌంటర్లు | ABP DesamPawan Kalyan on Tamil Movies | భారతదేశం ఏమన్నా కేకు ముక్క కోసుకోవటానికి.? | ABP DesamPawan Kalyan on his Ideology | పూటకో పార్టీతో ఉంటావనే వాళ్లకు ఇదే నా ఆన్సర్ | ABP DesamPawan Kalyan on Tamilnadu Language Fight | హిందీ, తమిళ్, కన్నడ, మరాఠీలో మాట్లాడి మేటర్ చెప్పిన పవన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh Latest News:
"అక్టోబర్‌ 2 తర్వాత హెలికాప్టర్ ఎక్కడైనా దిగొచ్చు" చంద్రబాబు వార్నింగ్ మెసేజ్ 
Telangana CM Revanth Reddy:
"రక్తమరుగుతుంది, బట్టలూడదీసికొడతారు"- జర్నలిస్టులపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు 
Telangana CM Revanth Reddy:
"కేసీఆర్ ఆరోగ్యంతో వందేళ్లు అక్కడ ఉండాలే- మేం ఇక్కడ ఉండాలే" స్టేచర్‌పై మళ్లీ రేవంత్ సంచలన వ్యాఖ్యలు
Telangana CM Revanth Reddy : కృష్ణాజలాలపై చర్చకు సిద్ధమా- కేసీఆర్‌కు సభలో రేవంత్ సవాల్‌
కృష్ణాజలాలపై చర్చకు సిద్ధమా- కేసీఆర్‌కు సభలో రేవంత్ సవాల్‌
Kurnool Crime News: కర్నూలులో టీడీపీ నేత దారుణ హత్య- ప్రాణం తీసిన రాజకీయ కక్షలు
కర్నూలులో టీడీపీ నేత దారుణ హత్య- ప్రాణం తీసిన రాజకీయ కక్షలు
Telangana Assembly Sessions : తెలంగాణలో సీఎం ప్రసంగాన్ని బాయ్‌కాట్ చేసిన బీఆర్‌ఎస్- అసెంబ్లీ నుంచి వాకౌట్‌ 
తెలంగాణలో సీఎం ప్రసంగాన్ని బాయ్‌కాట్ చేసిన బీఆర్‌ఎస్- అసెంబ్లీ నుంచి వాకౌట్‌ 
David Warner: నితిన్ 'రాబిన్ హుడ్'లో వార్నర్ ఎలా ఉంటారో తెలుసా? - అతను వెండితెరపై మెరిసే సమయం ఆసన్నమైందంటూ లుక్ రిలీజ్
నితిన్ 'రాబిన్ హుడ్'లో వార్నర్ ఎలా ఉంటారో తెలుసా? - అతను వెండితెరపై మెరిసే సమయం ఆసన్నమైందంటూ లుక్ రిలీజ్
Telangana Latest News: తప్పుగా మాట్లాడలేదు, జగదీశ్‌రెడ్డిపై సస్పెన్షన్‌ ఎత్తేయండి- స్పీకర్‌కు బీఆర్‌ఎస్ రిక్వస్ట్ 
తప్పుగా మాట్లాడలేదు, జగదీశ్‌రెడ్డిపై సస్పెన్షన్‌ ఎత్తేయండి- స్పీకర్‌కు బీఆర్‌ఎస్ రిక్వస్ట్ 
Embed widget