అన్వేషించండి

Tirupati Laddu Sit: నెయ్యి కల్తీపై రంగంలోకి దిగనున్న సీబీఐ సిట్ - 30 మంది ప్రత్యేక సహాయ బృందం కూడా - కల్తీ పుట్ట బద్దలవడం ఖాయమేనా ?

Tirumala; తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాద నెయ్యి కల్తీపై సుప్రీంకోర్టు సిట్ విచారణ ప్రారంభం కానుంది. ఐదుగురు సిట్ బృందానికి సహకరించేందుకు 30 మంది టీమ్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

Supreme Court SIT investigation into Tirumala Srivari Laddu Prasad ghee adulteration: తిరుమల తిరుపతి దేవస్థానానికి సరఫరా చేసిన శ్రీవారి లడ్డూ ప్రసాద నెయ్యి కల్తీ వ్యవహారంలో విచారణ ప్రారంభం కానుంది. గతంలో రాష్ట్ర ప్రభు్తవం నియమించిన సిట్ విచారణ జరుగుతున్న సమయంలో సుప్రీంకోర్టు కొత్త సిట్ ను నియమించింది. సీబీఐ చీఫ్ ఆద్వర్యంలో ఇద్దరు సీబీఐ ఆఫీసర్లు, ఇద్దరు రాష్ట్ర ఆఫీసర్లు, ఒక ఫుడ్ సేఫ్టీ విభాగం అధికారితో సిట్ నియమించారు. ఈ సిట్ నియమించి నెల దాటిపోతున్నా ఇంకా విచారణ ప్రారంభించ లేదు. తాజాగా తిరుపతిలోనే కార్యాలయం ఏర్పాటు చేసుకుని విచారణ ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. 

తిరుపతి చేరుకోనున్న సిట్ బృందం 

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ నుంచి ఇద్దరు అధికారులతో పాటు రాష్ట్రం నుంచి ఇద్దరు, ఎఫ్​ఎస్​ఎస్​ఏఐ నుంచి మరో అధికారి ప్రత్యేక బృందంలో నియమితులయ్యారు. ఇందులో ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం తరఫున గుంటూరు రేంజి ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, విశాఖ రేంజి డీఐజీ గోపీనాథ్‌ జెట్టీ ఉన్నారు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ) తరఫున హైదరాబాద్‌ జోన్‌ జాయింట్‌ డైరెక్టర్‌ వీరేశ్‌ ప్రభు, విశాఖపట్నం ఎస్పీ మురళి రాంబాతో పాటు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ సలహాదారు డాక్టర్‌ సత్యేన్‌కుమార్‌ పాండా ఉన్నారు. సీబీఐ డైరెక్టర్‌ పర్యవేక్షణలో ఈ ప్రత్యేక దర్యాప్తు బృందం పని చేస్తుంది. 

Also Read: షష్ఠి పూర్తి అయ్యాక సీఎం అవుతారా పవన్? చర్చకు దారి తీసిన లేటెస్ట్ కామెంట్స్ 

తిరుపతిలోనే కార్యాలయం ఏర్పాటు 
 
సిట్‍ బృందం సభ్యులకు వసతితో పాటు ప్రత్యేక ఆఫీసును ఏర్పాటు చేస్తున్నారు. కంప్యూటర్లతో పాటు ప్రింటర్లు, రికార్డులు భద్రపరిచేందుకు వీలుగా ప్రత్యేక గది, వీడియో కాన్ఫరెన్సులు నిర్వహించుకునేందుకు అనుగుణంగా కార్యాలయాన్ని టీటీడీనే ఏర్పాటు చేస్తోంది.   ఎంక్వైరీ పూర్తయ్యేవరకు కార్యాలయం నుంచే సిట్‍ తమ విచారణ నిర్వహించనుంది.   సిట్‍ అధికారులు  పూర్తిస్థాయిలో రంగంలోకి దిగి వాస్తవాలను  వెలుగులోకి తెచ్చేందుకు రెడీ అయ్యారని అనుకోవచ్చు. 30 మందితో ప్రత్యేక టీంను కూడా వీరికి సహాయకారిగా ఉంచేందుకు సిద్ధం చేశారు.  4 డీఎస్పీలు, 8 మంది సీఐలు, 2 ఎస్సైల సేవలను సిట్​ వినియోగించునే అవకాశాలు ఉన్నాయి.   మరికొంత మంది మినిస్టీరియల్ సిబ్బందిని కూడా కేటాయించారు. 

వీలైనంత త్వరగా లడ్డూ కల్తీ దర్యాప్తు పూర్తి చేయాలని యోచన

గతంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున నియమించిన సిట్ చాలా వరకూ విచారణ చేసింది . కొత్త సిట్ మళ్లీ మొదటి నుంచి విచారణ చేస్తుందా లేకపోతే పాత సిట్ సేకరించిన సమాచారాన్ని పరిగణనలోకి తీసుకుంటుందా అన్నది సస్పెన్స్ గా మారింది. ఏఆర్ డెయిరీ నెయ్యిలో కల్తీ జరిగిందని ఎఫ్‌ఎస్‌ఎస్ఐఏ కూడా నోటీసులు జారీ చేసింది. అతి తక్కువ ధరకు నెయ్యి ఎలా సరఫరా చేశారన్న దగ్గర నుంచి సామర్థ్యం లేకుండా ఎక్కడి నుంచి నెయ్యి సేకరించారన్నది కూడా బయటకు తీయనున్నారు. మొత్తంగా సిట్ దర్యాప్తు ప్రారంభమైన తర్వాత .. లడ్డూ కల్తీ వ్యవహారంలో కీలక నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. కల్తీ చేసిన వారికి గట్టి షాకులు ఇవ్వడం ఖాయమని అనుకోవచ్చని అంటున్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

GV Reddy Latest News: జీవీ రెడ్డి రాజీనామా ఇష్యూని వైసిపి వాడుకోవాలనుకుంటుందా?
జీవీ రెడ్డి రాజీనామా ఇష్యూని వైసిపి వాడుకోవాలనుకుంటుందా?
Revanth Reddy : ఢిల్లీకి రేవంత్ రెడ్డి - ప్రధానితో అపాయింట్‌మెంట్ ఖరారు
ఢిల్లీకి రేవంత్ రెడ్డి - ప్రధానితో అపాయింట్‌మెంట్ ఖరారు
AP Fibernet: ఏపీ ఫైబర్ నెట్ ఎండీగా ప్రవీణ్ ఆదిత్య - చైర్మన్,ఎండీ వివాదం తర్వాత కీలక నియామకం
ఏపీ ఫైబర్ నెట్ ఎండీగా ప్రవీణ్ ఆదిత్య - చైర్మన్,ఎండీ వివాదం తర్వాత కీలక నియామకం
Pawan Kalyan in Assembly: పదిహేనేళ్లు ఏపీలో ఎన్డీఏ  పాలన - వైసీపీ తీరు వివేకా హత్యను గుర్తు చేస్తోంది - అసెంబ్లీలో పవన్
పదిహేనేళ్లు ఏపీలో ఎన్డీఏ పాలన - వైసీపీ తీరు వివేకా హత్యను గుర్తు చేస్తోంది - అసెంబ్లీలో పవన్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

GV Reddy Resign Controversy | GV రెడ్డి రాజీనామాతోనైనా చంద్రబాబులో మార్పు వస్తుందా.? | ABP DesamAP Deputy CM Pawan Kalyan Speech | మొఘలులు ఓడించారనేది మన చరిత్ర అయిపోయింది | ABP DesamPastor Ajay Babu Sensational Interview | యేసును తిడుతున్నారు..అందుకే హిందువులపై మాట్లాడుతున్నాం |ABPAdani Speech Advantage Assam 2.0 | అడ్వాంటేజ్ అసోం 2.0 సమ్మిట్ లో అదానీ సంచలన ప్రకటన | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
GV Reddy Latest News: జీవీ రెడ్డి రాజీనామా ఇష్యూని వైసిపి వాడుకోవాలనుకుంటుందా?
జీవీ రెడ్డి రాజీనామా ఇష్యూని వైసిపి వాడుకోవాలనుకుంటుందా?
Revanth Reddy : ఢిల్లీకి రేవంత్ రెడ్డి - ప్రధానితో అపాయింట్‌మెంట్ ఖరారు
ఢిల్లీకి రేవంత్ రెడ్డి - ప్రధానితో అపాయింట్‌మెంట్ ఖరారు
AP Fibernet: ఏపీ ఫైబర్ నెట్ ఎండీగా ప్రవీణ్ ఆదిత్య - చైర్మన్,ఎండీ వివాదం తర్వాత కీలక నియామకం
ఏపీ ఫైబర్ నెట్ ఎండీగా ప్రవీణ్ ఆదిత్య - చైర్మన్,ఎండీ వివాదం తర్వాత కీలక నియామకం
Pawan Kalyan in Assembly: పదిహేనేళ్లు ఏపీలో ఎన్డీఏ  పాలన - వైసీపీ తీరు వివేకా హత్యను గుర్తు చేస్తోంది - అసెంబ్లీలో పవన్
పదిహేనేళ్లు ఏపీలో ఎన్డీఏ పాలన - వైసీపీ తీరు వివేకా హత్యను గుర్తు చేస్తోంది - అసెంబ్లీలో పవన్
SLBC Tunnel: SLBC టన్నెల్ రెస్య్కూ ఆపరేషన్‌లో ఆ 50 మీటర్లే కీలకం- ఆ గండం దాటితేనే 8 ప్రాణాలు దక్కేది..!
SLBC టన్నెల్ రెస్య్కూ ఆపరేషన్‌లో ఆ 50 మీటర్లే కీలకం- ఆ గండం దాటితేనే 8 ప్రాణాలు దక్కేది..!
Hyderabad to Isha Foundation : మహా శివరాత్రికి ఈషా వెళ్లాలనుకుంటే ఇది ఫాలో అయిపోండి.. సెలబ్రేషన్స్, జాగరణ అంటే అసలైన అర్థమిదే
మహా శివరాత్రికి ఈషా వెళ్లాలనుకుంటే ఇది ఫాలో అయిపోండి.. సెలబ్రేషన్స్, జాగరణ అంటే అసలైన అర్థమిదే
Nara Lokesh Fires on YSRCP: మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానని ఎమ్మెల్యే జగన్ అన్నారు, 5 ఏళ్లు ఏం చేశారంటూ నారా లోకేష్ గరం గరం
మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానని ఎమ్మెల్యే జగన్ అన్నారు, 5 ఏళ్లు ఏం చేశారంటూ నారా లోకేష్ గరం గరం
Telangana Latest News: రేవంత్ సర్కార్‌ని టార్గెట్‌ చేసిన కాంగ్రెస్ నేత- బీఆర్‌ఎస్‌కు కొత్త అస్త్రం దొరికినట్టే?
రేవంత్ సర్కార్‌ని టార్గెట్‌ చేసిన కాంగ్రెస్ నేత- బీఆర్‌ఎస్‌కు కొత్త అస్త్రం దొరికినట్టే?
Embed widget