![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Pawan Kalyan Latest News : షష్ఠి పూర్తి అయ్యాక సీఎం అవుతారా పవన్? చర్చకు దారి తీసిన లేటెస్ట్ కామెంట్స్
Pawan Kalyan Latest Political News : పదేళ్లు సీఎంగా చంద్రబాబే ఉండాలి అంటూ పవన్ చేసిన కామెంట్స్ తీవ్ర చర్చకు దారి తీశాయి. అప్పటి వరకు ఎదిగి సీఎం అవ్వాలనే ఆలోచన లేదా అని జనసైనికులు ప్రశ్నిస్తున్నారు.
![Pawan Kalyan Latest News : షష్ఠి పూర్తి అయ్యాక సీఎం అవుతారా పవన్? చర్చకు దారి తీసిన లేటెస్ట్ కామెంట్స్ deputy cm pawan kalyan statements confuses Janasena cadre and kapu community In Telugu Pawan Kalyan Latest News : షష్ఠి పూర్తి అయ్యాక సీఎం అవుతారా పవన్? చర్చకు దారి తీసిన లేటెస్ట్ కామెంట్స్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/11/22/aed95710e06fbece007143ded0dc6c8f1732253479808215_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Pawan Kalyan Latest Comments On Chandra Babu: ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు ఆశయాలు లక్ష్యాలు నెరవేరాలని దానికి మరో 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండాలని అసెంబ్లీలో డిప్యూటీ సీఎం పవన్ చేసిన ప్రసంగం టిడిపి నేతల్లో జోష్ నింపితే జనసైనికుల్లో అయోమయాన్ని క్రియేట్ చేసింది. చంద్రబాబు ఏపీ కోసం అమరావతి కోసం కంటున్న కలలు నెరవేరాలని అభివృద్ధిపరంగా ఆయన తీసుకుంటున్న నిర్ణయాల అడుగుజాడల్లో తామంతా నడుస్తామని పవన్ అన్నారు. ఇది రాజకీయంగా ప్రస్తుత పరిస్థితుల్లో అభివృద్ధి అనే యాంగిల్ మాట్లాడిన మాటలు కావొచ్చు. కానీ జనసైనికులు మాత్రం దీన్ని మరోలా భావించే ప్రమాదం ఉందని కామెంట్స్ వినపడుతున్నాయి.
పవన్ వయస్సు 52.. మరో పదేళ్లు అంటే 62
పవన్‌ను ఎప్పటికైనా ముఖ్యమంత్రిగా చూడాలనేదే జన సైనికుల కల. ఆయన్ని అభిమానించేవారూ అదే కోరుకుంటారు. 20 ఏళ్ల పాటు రాజకీయాల్లో ఉండడానికి తాను వచ్చినట్టు పవన్ జనసేన ఆవిర్భావ సభలోనే స్పష్టం చేశారు. అనేక ఎదురు దెబ్బలు తిని 2024 ఎన్నికల్లో దిగ్విజయం సాధించి ఏపీకి ఉపముఖ్యమంత్రి అయ్యారు. దీనికోసం పదేళ్లు పట్టింది. ఇక నెక్స్ట్ ఆయన స్టెప్ ముఖ్యమంత్రే అంటూ జన సైనికులు చాలా ఆశతో ఉన్నారు.
జగన్‌ను ఓడించడం కోసం ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండడం కోసం పవన్ టిడిపి బిజెపితో కలిసి కూటమి ఏర్పాటుకు కృషి చేశారు. అంతే కానీ పవన్ గురి సీఎం సీటుపైనే అంటూ జనసేన నేతలు సైతం స్థిరమైన అభిప్రాయంతో ఉన్నారు. అయితే పవన్ సడన్‌గా మరొక 10 ఏళ్లపాటు చంద్రబాబు సీఎంగా ఉండాలి అనడంతో అయోమయానికి గురవుతున్నారు. పవన్ ప్రస్తుత వయసు 52.. మరో పదేళ్లు అంటే 62 పై మాటే. అంటే షష్ఠి పూర్తి అయ్యాక సీఎం అవుతారా అంటూ పవన్ వైపు చూస్తున్నారు వారు.
కాపు సామాజిక వర్గంలోనూ అదే డౌట్
ఏపీలో బీసీల తర్వాత ఆ స్థాయిలో జనాభా ఉన్నా ముఖ్యమంత్రి సీటు మాత్రం దక్కడం లేదన్న అభిప్రాయంతో కాపు సామాజిక వర్గం ఉంది. వంగవీటి రంగా మొదలుకొని దాసరి, ముద్రగడ, చిరంజీవి (కొంత వరకు బొత్స) ఇలా చాలాసార్లు వ్యక్తులపై వాళ్లు నమ్మకం పెట్టుకోవడం చివరకు ఆశాభంగం పాలవడం ఆనవాయితీగా మారిపోయింది. అనే ఫీలింగ్ కాపు సామాజిక వర్గంలో బలంగా ఉంది. వాళ్లకి కనబడుతున్న ఏకైక వ్యక్తి ప్రస్తుతానికి పవన్ మాత్రమే. ఎప్పటికైనా కాపు సామాజిక వర్గానికి సీఎం సీటును అందించేది పవన్ మాత్రమేనని నమ్ముతున్నారు. అందుకోసమే 2024 ఎన్నికల్లో ముద్రగడ, చేగొండి హరే రామ జోగయ్య లాంటి వాళ్ళు ఎంత డిస్కరేజ్ చేసినా కాపులు మాత్రం పవన్ వెనకాలే నిలబడ్డారు. అలాంటిది పవన్ పదేళ్లపాటు చంద్రబాబు సీఎంగా ఉండాలని అనడం కాపు సామాజిక వర్గంలో చర్చను లేపింది.
పవన్ ఉద్దేశం వేరు
కూటమి ప్రభుత్వంపై ప్రస్తుతానికి ప్రజల్లో మంచి అభిప్రాయమే ఉంది. ఆర్థికస్థితి కూడా నెమ్మదిగా గాడిలో పడుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కూటమితో ఉండడమే పవన్ ఉద్దేశం. రాజకీయాల కోసం కూటమిలో చికాకులు సృష్టించే ఆలోచన లేదు. కూటమిలో ఉంటూనే చిన్నచిన్న అవకతవకలపై మాత్రం సీరియస్‌గానే స్పందించే ప్రతిపక్షం ఆయన. కాబట్టి మరీ వ్యతిరేక నిర్ణయాలు తీసుకోనంతవరకు టిడిపితోనే కలిసి కొనసాగాలని భావిస్తున్నారు. అలా జరగనప్పుడు ఆయన తనదారి తాను చూసుకుంటారు. ఈలోపు జనసేన పార్టీని పూర్తిగా విస్తరించాల్సిన బాధ్యత కూడా ఆయనపై ఉంది. కాబట్టి అవన్నీ పూర్తయ్యే వరకు కూటమితోనే కలిసి ఉంటారు.
వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకునే పవన్ ఆ ప్రసంగం చేశారు. అంతే కానీ ఎప్పటికీ ఉపముఖ్యమంత్రిగానే ఉండిపోవాలనే ఉద్దేశం ఆయనకు లేదని సన్నిహితులు చెబుతున్నారు. ఇవన్నీ ఎలా ఉన్నా పవన్ ప్రసంగం మాత్రం రాజకీయంగా ఏపీలో పెద్ద చర్చకు దారి తీసిందని చెప్పక తప్పదు.
Also Read: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Sadhguru is a Yogi, mystic, visionary and author](https://cdn.abplive.com/imagebank/editor.png)