ఇల్లు కొనుగోలు చేసేటప్పుడు చెక్ లిస్ట్‌లో మొదటగా ఉండాల్సింది కొనుగోలు చేసే ఇల్లు పూర్తి చిరునామా నిర్దిష్ట ఫ్లాట్ నంబర్‌తో సహా ఫ్లాట్ ప్రాజెక్ట్ యొక్క వివరాలు స్పష్టంగా ఉండేలా చూసుకోవాలి.



ముందస్తు, వాయిదాల చెల్లింపు గడువు తేదీలతో సహా చెల్లింపు ప్రణాళిక స్పష్టంగా ఉండేలా చూసుకోండి.



ఒప్పందంపై సంతకం చేసిన తర్వాత ధరను పెంచడానికి బిల్డర్‌ను అనుమతించే నిబంధనల ఉంటే తిరస్కరించాలి.



భూమికి బిల్డర్ టైటిల్‌ను అదేవిధంగా చట్టపరమైన వివాదాలు లేదా భారాలు లేవని నిర్ధారించుకోవాలి.



స్థానిక అధికారులు, RERA రిజిస్ట్రేషన్, పర్యావరణ క్లియరెన్స్‌తో సహా అవసరమైన అన్ని ఆమోదాలను బిల్డర్ తీసుకున్నట్లుగా ధృవీకరించుకోవాలి.



ఫ్లాట్ స్వాధీనానికి సిద్ధమైన తర్వాత సేల్ డీడ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను అగ్రిమెంట్ చేయించాలి.



ఒరిజినల్ డిజైన్, స్ట్రక్చర్ లేదా లేఅవుట్‌లో మార్పులు ఏమైనా ఉంటే వెంటనే గుర్తించాలి. మార్పులుంటే బిల్డర్ ను సంప్రదించాలి.



ఫ్లాట్‌ను స్వాధీనం చేసుకునేటప్పుడు ఒప్పందం ప్రకారం ఉందో లే్దో చెక్ చేసుకోవాలి. బిల్డర్ నిర్వహణా కాలాన్ని కూడా సరి చూసుకోవాలి !



ఇల్లు కొనడంలో ఏ మాత్రం తేడా వచ్చినా జీవితాంతం కష్టపడిన సొమ్ము పోతుంది. అందుకే చిన్న విషయాలనూ జాగ్రత్తగా పరిశీలించాలి.