వివేక్ రామస్వామికి డిపార్టుమెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియన్సీ బాధ్యతలు ఇచ్చిన ట్రంప్. ఎలాన్ మస్క్‌తో పాటు రామస్వామికీ బాధ్యతలు



తమిళనాడు మూలాలు ఉన్న రామస్వామి కుటుంబం కేరళలోని పాలక్కాడ్‌ నుంచి అమెరికాకు వలస



వివేక్ రామస్వామి తండ్రి జనరల్ ఎలక్ట్రిక్‌లో ఇంజనీర్‌గా ఉద్యోగం కోసం అమెరికా వెళ్లారు. తల్లి ప్రముఖ వైద్యురాలు.



వివేక్ రామస్వామి సంపద 95 కోట్ల అమెరికన్‌ డాలర్లకు పైమాటే. బయోటెక్‌, ఇతర వ్యాపారాలను నిర్వహిస్తున్నారు.



రిపబ్లికన్ పార్టీ అభ్యర్దిత్వం కోసం చివరి వరకూ పోరాడిన వివేకా రామస్వామి. చివరికి ట్రంప్‌కే మద్దతు ప్రకటించి రేసు నుంచి వైదొలిగిన వివేక్ రామస్వామి



విద్యార్థులకు ఆర్థిక సదుపాయం కోసం స్టుడెంట్‌ బిజినెస్‌.కామ్‌ అనే స్టార్టప్‌ను స్థాపించిన వివేక్ రామస్వామి



వివేక్‌ భార్య అపూర్వ తమ ఇద్దరు కుమారులు, అందరూ హిందూ మతాన్నే ఆచరిస్తారు.



రిపబ్లికన్ పార్టీలో మంచి పలుకుబడి ఉన్న వివేక్ రామస్వామి. విదేశాంగ శాఖ పదవిని ట్రంప్ ఇస్తారని అనుకున్నా కొత్త పదవితో సరి పెట్టారు.



నాలుగేళ్ల తర్వాత అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలబడే అవకాశం . మరో సారి పోటీ చేయడానికి ట్రంప్ కు చాన్స్ లేదు.