By: ABP Desam | Updated at : 21 Feb 2022 07:06 PM (IST)
Edited By: Satyaprasad Bandaru
కరోనా కేసులు(ప్రతీకాత్మక చిత్రం)
ఏపీలో కరోనా కేసులు(Corona Cases) భారీగా తగ్గాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల వ్యవధిలో 14,249 కోవిడ్ నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. వీటిల్లో 182 మందికి కోవిడ్ పాజిటివ్(Covid Positive) నిర్ధారణ అయింది. గడిచిన 24 గంటల్లో కోవిడ్ తో ఒకరు మరణించారు. రాష్ట్రంలో కోవిడ్ బారినపడి చనిపోయిన వారి సంఖ్య 14,714కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో రాష్ట్రంలో 950 మంది కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు 22,95,768 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. ఏపీ(AP)లో 5,985 యాక్టివ్ కేసులున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 23,16,467కి చేరింది. రాష్ట్రంలో ఇప్పటి వరకూ మొత్తం 3,29,91,889 నిర్థారణ పరీక్షలు చేశారు.
#COVIDUpdates: 21/02/2022, 10:00 AM
— ArogyaAndhra (@ArogyaAndhra) February 21, 2022
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 23,16,467పాజిటివ్ కేసు లకు గాను
*22,95,768 మంది డిశ్చార్జ్ కాగా
*14,714 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 5,985#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/EfABRhoc0r
12-18 ఏళ్ల పిల్లలకు కరోనా టీకా
12-18 ఏళ్ల పిల్లలకు మరో టీకా అందుబాటులోకి వచ్చింది. బయోలాజికల్-ఇ సంస్థకు చెందిన కార్బెవాక్స్ వ్యాక్సిన్ అత్యవసర అనుమతికి డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) తుది అనుమతులు ఇచ్చింది. రెండు డోసుల కింద పంపిణీ చేసే ఈ వ్యాక్సిన్ త్వరలోనే మార్కెట్లోకి రానుంది. 12-18 ఏళ్ల పిల్లల వ్యాక్సినేషన్‌కు అందుబాటులోకి వచ్చిన రెండో టీకాగా కార్బెవాక్స్ రికార్డులకెక్కింది. బయోలాజికల్-ఇ అభివృద్ధి చేసిన కార్బెవాక్స్ టీకా 5 కోట్ల డోసుల కోసం ఆ సంస్థకు ఇటీవల కేంద్రం ఆర్డర్ పెట్టింది. ఒక్కో డోసును రూ. 145(జీఎస్‌టీ అదనం) చొప్పున వీటిని కొనుగోలు చేయనుంది. ఈ డోసులను ఫిబ్రవరి చివరి నాటికి సంస్థ సరఫరా చేయనున్నట్లు తెలుస్తోంది.
Kadapa News : అక్రమ నిర్మాణాల తొలగింపులో ఉద్రిక్తత, సచివాలయ సిబ్బందిపై దాడి
Tea Shop Attack : సిగరెట్ దగ్గరకు తెచ్చివ్వలేదని టీ షాపు యజమానిపై దాడి
Tirumala Tickets : శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్, ఈ నెల 22న సెప్టెంబర్ కోటా టికెట్లు విడుదల
CJI : సీజేఐ చేతుల మీదుగా ఈ నెల 20న కోర్టు కాంప్లెక్స్ ప్రారంభోత్సవం
Nellore Police : నెల్లూరు పోలీసులపై చర్యలకు ఎస్సీ కమిషన్ ఆదేశాలు
AP News: టీచర్లకే కాదు ఉద్యోగులందరికీ ఫేస్ అటెండెన్స్ - మంత్రి బొత్స కీలక ప్రకటన !
Harish Rao : అప్పట్లో పొగడ్తలు ఇప్పుడు విమర్శలా ? - షెకావత్‌కు హరీష్ కౌంటర్ !
Dil Raju: ఓటీటీలో 8 వారాల తరువాతే సినిమాలు - టికెట్ రేట్లు కూడా తగ్గిస్తాం : దిల్ రాజు
iPhone 14: ఐఫోన్ 14 సిరీస్ లాంచ్ తేదీ లీక్ - నెల కూడా లేదుగా!