Arjuna Awards Update: గోల్డ్ మెడల్ గెలిచిన 52 ఏళ్లకు అర్జున అవార్డు.. స్ఫూర్తి దాయకం మురళీకాంత్ పెట్కార్ జీవితం
భారత్ తరపున ఒలింపిక్స్/పారాలింపిక్స్ లో బంగారు పతకం గెలిచిన తొలి ప్లేయర్ గా మురళీకాంత్ రాజారం పెట్కార్ నిలిచారు. తాజాగా ఆయనను అర్జున అవార్డు వరించింది.
Paralympics Winner Murlikant Petkar: భారత పారా అథ్లట్ మరళికాంత్ రాజారాం పెట్కార్ కు ఎట్టకేలకు తన ప్రతిభకు తగిని గుర్తింపు లభించింది. 1972 జర్మనీలోని హైడల్ బర్గ్ పారాలింపిక్స్ లో బంగారు పతకం గెలుపొందాక దాదాపు 52 సంవత్సరాల తర్వాత అర్జున అవార్డు (లైఫ్ టైం ఎచీవ్మెంట్) వరించడం విశేషం. నిజానికి మురళికాంత్ జీవితం ఎన్నో సాహసలతో కూడి ఉంది. ఇండియన్ ఆర్మీలో పని చేసిన మురళీ కాంత్..1965 పాకిస్థాన్ యుద్ధంలో తీవ్రంగా గాయపడి, ఆర్మీ నుంచి రిటైర్ అయ్యారు. అనంతరం స్విమ్మింగ్ సాధన చేసి ఒలింపిక్స్/పారాలింపికస్్ లో వ్యక్తిగత బంగారు పతకం సాధించిన తొలి ప్లేయర్ గా నిలిచారు. ఆయన 1972 పారాలింపిక్స్ లో ఈ ఘనత సాధించారు. పురుషుల 50 మీ ఫ్రీ స్టైల్ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించారు.
The FIRST Post of the year could not have been better than this!!
— Mrittika Dey (@Koki_s_mrittika) January 2, 2025
Congratulations Murlikant Petkar Sir!!
Nd thank you to @TheAaryanKartik nd the whole team of Chandu Champion for showing us such an inspirational story #KartikAaryan you were just exceptional in #ChanduChampion https://t.co/LGKXy5qFMJ
బాక్సర్ కావాలనుకుని..
నిజానికి ఆర్మీలో పని చేస్తున్నప్పటి నుంచే ఇండియన్ టాప్ బాక్సర్ కావాలని మురళీకాంత్ కలలు కన్నారు. జపాన్ లో జరిగిన ఆర్మీ పోటీల్లో పాల్గొని బాక్సింగ్ విభాగంలో పతకాన్ని సైతం పొందారు. అయితే యుద్ధ గాయాలు ఆయన కలను చిదిమేశాయి. యుద్ధం సందర్భంగా జమ్మూ కశ్మీర్ లోని శ్రీనగర్లో ఆయన గాయపడ్డారు. ఆ తర్వాత కొంతకాలానికే ఇంటికి పరిమితం అయ్యారు. అయినా ఏమాత్రం పట్టు విడువకుండా తన శరీరానికి అనుకూలంగా ఉన్న ఆటలను ఎంపిక చేసుకుని సత్తా చాటారు.
1968, 1972 రెండు పారాలింపిక్స్ లో మురళీ కాంత్ పాల్గొన్నారు. అయితే 1972లో మూడు ప్రపంచ రికార్డులు నమోదు చేసి బంగారు పతకాన్ని కొల్లగొట్టారు. ఈ టోర్నీలో ఆయన పలు విభాగాల్లో కూడా పాల్గొన్నారు. టేబుల్ టెన్నిస్, జావెలిన్ త్రోలాంటి పోటీల్లో లక్కును పరీక్షించుకున్నా, ఫైనల్ వరకు చేరి ఆకట్టుకున్నారు. అయితే ఇంతటి ప్రతిష్టాత్మక పతకం సాధించినా, ఆయన ప్రతిభ వెలుగులోకి వచ్చేందుకు ఇన్నేళ్లు పట్టింది. దాదాపు 52 ఏళ్ల తర్వాత ఆయనను ప్రతిష్టాత్మక అర్జున అవార్డుతో ప్రభుత్వం సత్కరించింది. అంతకుముందు 2018లో పద్మశ్రీ కూడా ఆయనను వరించింది. అటు అర్జున, ఇటు పద్మశ్రీ రెండూ ఎన్డీఏ హయాంలోనే మురళీకాంత్ కు అవార్డులు దక్కడం విశేషం.
కుమారుడు కూడా ఆర్మీలోనే..
తను ఆర్మీలో పని చేసి గాయాలు పాలైనప్పటికీ, ఆయన కుమారుడు అర్జున్ మురళీకాంత్ ని కూడా ఆర్మీలోనే చేర్పించి దేశభక్తిని చాటుకున్నారు మురళీకాంత్. ఆర్మీ నుంచి రిటైర్ అయిన తర్వాత కొంతకాలం టెల్కోలో పనిచేసి ఆ తర్వాత రిటైర్ అయ్యి, ప్రస్తుతం పుణేలో శేష జీవితం గడుపుతున్నారు. తాజా అర్జున ప్రకటనతో ఈనెల 17 నుంచి జరిగే అవార్డుల ప్రదాన కార్యక్రమంలో పాల్గొని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతి నుంచి అవార్డు తీసుకునే అవకాశముంది.