అన్వేషించండి

Nagababu As MLC: ఎమ్మెల్సీ అభ్యర్థిగా కొణిదెల నాగబాబు పేరు ఖరారు చేసిన పవన్ కళ్యాణ్

Andhra Pradesh News | ఏపీలో త్వరగా జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా జనసేన నేత నాగబాబు పేరును పవన్ కళ్యాణ్ ఖరారు చేశారు. ఈ మేరకు పార్టీ ఓ ప్రకటన చేసింది.

AP MLC Elections | అమరావతి: శాసన సభ్యుల కోటాలో నిర్వహించే ఎమ్మెల్సీ ఎన్నికల వ్యవహారంలో ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది. నిన్నటి వరకూ ఎమ్మెల్సీ అభ్యర్థి నాగబాబు పేరు ప్రచారం కాగా, బుధవారం ఉదయం ఆయన రాజ్యసభ స్థానం కోసం చూస్తున్నారని ప్రచారం జరిగింది. ఈ ప్రచారం ఊపందుకున్న సమయంలో జనసేన పార్టీ వదంతులకు చెక్ పెట్టింది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమిలో భాగంగా జనసేన అభ్యర్థిగా కొణిదెల నాగబాబు పేరును పార్టీ అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఖరారు చేశారు. నాగబాబు ప్రస్తుతం జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా సేవలందిస్తున్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయాలని నాగబాబుకి పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నుంచి సమాచారం వచ్చింది. దాంతో నాగబాబు నామినేషన్ కు అవసరమైన పత్రాలు సిద్ధం చేయాలని పార్టీ కార్యాలయాన్ని పవన్ కళ్యాణ్ ఆదేశించారని పి.హరిప్రసాద్ ఓ ప్రకటనలో తెలిపారు.

తెలుగు రాష్ట్రాల్లో మోగిన ఎన్నికల నగారా..

తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల 6 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఏపీలో రెండు గ్రాడ్యుయేట్, ఒక టీచర్ ఎమ్మెల్సీ, తెలంగాణలో రెండు గ్రాడ్యుయేట్ స్థానాలు, ఒక టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు ఫిబ్రవరి 27న జరిగాయి. అంతలోనే ఏపీ, తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చింది. ఏపీలో 5 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు, తెలంగాణలో 5 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఎలక్షన్ కమిషన్ (EC) ఇటీవల షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెలాఖరులో మొత్తం 10 స్థానాలు ఖాళీ కానున్నాయి. మార్చి 3న ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాగా, మార్చి 20న పోలింగ్ నిర్వహించి, అదే రోజు ఫలితాలు ప్రకటించనుంది ఈసీ. మార్చి 29న ఏపీలో 5 మంది ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలు, తెలంగాణలో 5 మంది ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల పదవీకాలం ముగియనుంది. 

ఎమ్మెల్సీ ఎన్నికలు ఈసీ షెడ్యూల్ విడుదల, తేదీల వివరాలు

ఎన్నికల నోటిఫికేషన్ విడుదల - మార్చి 3, 2025
- నామినేషన్లకు చివరి తేదీ - మార్చి 10, 2025 సోమవారం
- నామినేషన్ల పరిశీలన - మార్చి 11, 2025
- నామినేషన్ల ఉపసంహరణ తుది గడువు - మార్చి 13, 2025
- ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణ - మార్చి 20, 2025 ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు
- ఓట్ల లెక్కింపు - మార్చి 20న సాయంత్రం 5 గంటలకు

ఏపీలో కూటమి క్లీన్ స్వీప్ చేస్తుందా..
ఏపీలో ఎమ్మెల్సీలు యనమల రామకృష్ణుడు, పి.అశోక్‌బాబు, జంగా కృష్ణమూర్తి , దువ్వారపు రామారావు,  తిరుమలనాయుడు పదవీకాలం మార్చి 29న ముగియనుంది. వీరిలో జంగా కృష్ణమూర్తి మినహా మిగతా ఎమ్మెల్సీలు టీడీపీ నుంచి ఎన్నికైన వారే. ఎన్నికలకు ముందు జంగా కృష్ణమూర్తి సైతం టీడీపీలో చేరడం తెలిసిందే. రాష్ట్రంలో ఐదుగురు ఎమ్మెల్సీల పదవి కాలం ముగియనుండగా.. ఎమ్మెల్యేల సంఖ్యా బలం ఉన్న కూటమి పార్టీలైన టీడీపీ, జనసేన, బీజేపీలు ఈ 5 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలను దక్కించుకోనున్నాయి. జనసేన నుంచి నాగబాబును ఎమ్మెల్సీ అభ్యర్థిగా పార్టీ ఖరారు చేసింది. ఆయన త్వరలో ఏపీ కేబినెట్ లో మంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. 

Also Read: AP Assembly Sessions: ఏపీ అసెంబ్లీలో కీలక పరిణామం- జగన్ ను క్షమించి వదిలేస్తున్న: స్పీకర్ అయ్యన్న పాత్రుడు

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Breaking News: డీఎస్సీ తరహాలోనే యూనివర్సిటీల్లో నియామకాలు చేపడతాం: మంత్రి నారా లోకేష్
డీఎస్సీ తరహాలోనే యూనివర్సిటీల్లో నియామకాలు చేపడతాం: మంత్రి నారా లోకేష్
AP Legislative Council : ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
Kakinada AE Nookaraju Family Suicide Case: కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
Vijaya Sai Reddy New Political Party: కొత్త పార్టీ పెడుతున్నా! తిరుమలలో విజయసాయి రెడ్డి కీలక ప్రకటన! 
కొత్త పార్టీ పెడుతున్నా! తిరుమలలో విజయసాయి రెడ్డి కీలక ప్రకటన! 

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Legislative Council : ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Adilabad Spiny Gourd:ఆదిలాబాద్ జిల్లాలో బోడకాకరకి భలే గిరాకీ! ఈ సీజన్‌లో అందరి నోట వినిపించే వంటకం ఇదే!
ఆదిలాబాద్ జిల్లాలో బోడకాకరకి భలే గిరాకీ! ఈ సీజన్‌లో అందరి నోట వినిపించే వంటకం ఇదే!
Kakinada AE Nookaraju Family Suicide Case: కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
Kolkata Hotel Fire Accident: కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
LPG to PNG Shift: LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
Embed widget