Singer Kalpana Daughter: మా అమ్మ సూసైడ్ అటెంప్ట్ చేయలేదు... సింగర్ కల్పన కేసులో క్లారిటీ ఇచ్చిన కుమార్తె
Singer Kalpana Latest News: తన తల్లి సూసైడ్ అటెండ్ చేయలేదని సింగర్ కల్పన కుమార్తె దయ మీడియా ముందుకు వచ్చారు. తప్పుడు కథనాలు సృష్టించవద్దని ఆవిడ రిక్వెస్ట్ చేశారు.

సింగర్ కల్పనా రాఘవేందర్ కుమార్తె దయ (Singer Kalpana Daughter Name) మీడియా ముందుకు వచ్చారు. తన తల్లి సూసైడ్ అటెంప్ట్ (Kalpana Sucide Attempt News) చేయలేదని స్పష్టం చేశారు. కల్పన ఆరోగ్యం గురించి తప్పుడు కథనాలు సృష్టించవద్దని కుమార్తె దయ మీడియాకు విజ్ఞప్తి చేశారు. ఆ వివరాల్లోకి వెళితే...
మందుల మోతాదు ఎక్కువ కావడం వల్లే...
సింగర్ కల్పన కొన్ని రోజులుగా ఇన్సోమ్నియా (స్లీపింగ్ డిజార్డర్ - నిద్రలేమి సమస్యలతో) ఇబ్బంది పడుతున్నారని ఆవిడ కుమార్తె దయ తెలిపారు. వైద్యుల సూచన మేరకు మందులు తీసుకుంటూ ఉన్నారని, ఆ ముందల మోతాదు ఎక్కువ కావడం వల్ల అపస్మారక స్థితిలోకి వెళ్లారని, అంతే తప్ప తన తల్లి ఆత్మహత్యాయత్నం చేయలేదని దయా వివరించారు.
Also Read: సింగర్ కల్పన సూసైడ్ అటెంప్ట్, హాస్పటల్ ఫోటోలు వైరల్... దయచేసి చూపించకండి - అనసూయ రిక్వెస్ట్
తన తల్లిదండ్రుల మధ్య ఎటువంటి సమస్యలు లేవని కూడా కల్పన కుమార్తె దయ స్పష్టం చేశారు. తన తల్లి ఆరోగ్యంగా ఉన్నారని, త్వరలో ఇంటికి తిరిగి వస్తారని, అప్పటి వరకు సంయమనం పాటించాలని, ఎటువంటి తప్పుడు కథనాలు సృష్టించవద్దని దయ విజ్ఞప్తి చేశారు.
భర్తకు ఫోన్ చేసిన కల్పన... అసలు విషయం!
గాయని కల్పనా రాఘవేందర్ కుటుంబం కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డులోని ఒక గేటెడ్ కమ్యూనిటీలో నివాసం ఉంటున్నారు. ఆమె భర్త ప్రసాద్ రెండు రోజుల క్రితం చెన్నై వెళ్లారు. ఆయనకు కల్పన ఫోన్ చేసి తాను అపస్మారక స్థితిలోకి వెళుతున్నట్లు చెప్పారట. ఆ వెంటనే గేటెడ్ కమ్యూనిటీ ప్రతినిధులకు ప్రసాద్ సమాచారం ఇచ్చారు. వెంటనే స్పందించిన కమ్యూనిటీ అసోసియేషన్ ప్రతినిధులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో, పెట్రోలింగ్ పోలీసులు అటు వచ్చి తలుపులు బద్దలు కొట్టి కల్పనను ఆసుపత్రికి తీసుకు వెళ్లారు.
ఊపిరితిత్తుల్లో నీరు... ఇన్ఫెక్షన్ కూడా!
Singer Kalpana Health Bulletin: సింగర్ కల్పన ఆరోగ్యం గురించి వైద్యులు సైతం ఒక హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. నిద్రమాత్రలు మోతాదుకు మించి తీసుకోవడంతో ఆవిడ ఊపిరితిత్తుల్లోకి నీరు చేరిందని తెలిపారు. అదే విధంగా ఆమె శరీరంలో ఇన్ఫెక్షన్ కూడా గుర్తించామని అన్నారు. ప్రస్తుతం వెంటిలేటర్ ద్వారా చికిత్స అందిస్తున్నారు. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ ఉండడం వల్ల ఆక్సిజన్ సాయం కూడా అందిస్తున్నారు.
కల్పన ఆరోగ్యం నిలకడగా ఉందని ఆమె కుమార్తె దయ తెలిపారు. గడచిన 24 గంటలుగా ఆవిడ గురించి టాలీవుడ్ అంతా టెన్షన్ పడుతోంది. అసలు ఆత్మహత్యాయత్నం చేయాల్సిన అవసరం కల్పనకు ఏం వచ్చిందని చాలామంది ఆలోచించారు. ఇప్పుడు కల్పన విషయంలో ఆందోళన అవసరం లేదని ఆవిడ కుటుంబ చెబుతోంది.




















