అన్వేషించండి

Telangana BJP: బీజేపీ వరుస విజయాల సీక్రెట్ కిషన్ రెడ్డి - తెర ముందు, తెర వెనుక వ్యూహాల్లో మాస్టర్ !

Telangana BJP: తెలంగాణలో వరుస బీజేపీ విజయాల వెనుక కిషన్ రెడ్డి మార్క్ కనిపిస్తోంది. అటు కేంద్ర మంత్రిగా ఇటు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఆయన మంచి విజయాలు అందుకుంటున్నారు.

Kishan Reddy: " ఎవరైనా గట్టిగా కొడతారు.. లేకపోతే గురి చూసి కొడతారు.. ఈయనేంట్రా పద్దతిగా అంటు కట్టినట్లుగా కొట్టాడు" అని ఓ సినిమాలో డైలాగ్ ఉంటుంది. ఇది ప్రస్తుత తెలంగాణ రాజకీయాలలో  తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సరిగ్గా సరిపోతుంది. తెలంగాణలో జరిగిన మూడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు బీజేపీ గెల్చుకుంది. అభ్యర్థుల ఎంపిక నుంచి.. పోలింగ్ లో ఓట్లు వేయించుకునే వ్యూహం వరకూ తనదైన వ్యూహాలతో నడిపించిన కిషన్ రెడ్డి సైలెంట్ గా కాంగ్రెస్ పార్టీని చావు దెబ్బకొట్టారు. అధికారంలో ఉన్న  పార్టీ నుంచి పట్టభద్రుల ఎమ్మెల్సీని గెలుచుకోవడం అంటే చిన్న విషయం కాదు. కానీ ఉత్తర తెలంగాణలోని నాలుగు జిల్లాల్లో బీజేపీని బలోపేతం చేయడమే కాదు... సానుభూతి పరుల్ని ఓటర్లుగా మార్చే వ్యూహంలో కిషన్ రెడ్డి తనదైన నాయకత్వాన్ని చూపించారు. 

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఫలించిన కిషన్ రెడ్డి వ్యూహం  

తెలంగాణలో బీజేపీకి ప్రజల మద్దతు పూర్తి స్థాయిలో లభిస్తోందని దాన్ని ఓట్లుగా మార్చుకునే మెకానిజాన్ని కిషన్ రెడ్డి ఓ ప్లాన్ ప్రకారం ఏర్పాటు చేసుకుంటూ పోయారు. ఎమ్మెల్సీ ఎన్నికలు వస్తాయని తెలిసిన వెంటనే.. కార్యాచరణ ప్రారంభించారు. పట్టభద్రుల నియోజకవర్గం నాలుగు ఉత్తర తెలంగాణ ఉమ్మడి జిల్లాల్లో ఉంటుంది. అంటే టీచర్స్ నియోజవర్గాలు రెండింటిని కలుపుకుంటే 13 జిల్లా, 42 అసెంబ్లీ స్థానాలు, 270 మండలాలు, ఆరు లోక్ సభ నియోజకవర్గాల పరిధిలో ఈ ఎన్నికలు జరిగాయి. అన్ని చోట్లా ప్రతి గ్రాడ్యూయేట్, టీచర్ ఓటర్‌ను చేరేలా పకడ్బందీ ప్రచార ప్రణాళికను .. ప్రతి ఒక్క ఓటర్‌ను మూడు, నాలుగు సార్లు కలిసేలా ఓ వ్యవస్థను ఏర్పాటు చేసి కిషన్ రెడ్డి ప్రచారం చేశారు. ఈ వ్యూహాన్ని కాంగ్రెస్ అర్థం చేసుకోలేకపోయింది.. చేధించలేకపోయిందని.. ఫలితాలను బట్టి అర్థమవుతోంది. టీచర్స్ నియోజకవర్గంలో తొలి ప్రాధాన్యత ఓట్లతోనే కొమురయ్య గెలిచారు.  పట్టబద్రుల నియోజకవర్గంలో అత్యంత హోరాహోరీగా జరిగినా ఓట్లు చీల్చే వ్యూహాలను కాంగ్రెస్ పార్టీ పాటించినా బీజేపీ విజయాన్ని ఆపలేకపోయారు. 

కిషన్ రెడ్డి నాయకత్వం పుష్ప వికాసం  

అసెంబ్లీ ఎన్నికలకు ముందు మరోసారి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన కిషన్ రెడ్డికి .. ఆ ఎన్నికలను ఎదుర్కొనే విషయంలో సమయం సరిపోలేదు. ఓ వైపు కేంద్ర మంత్రిగా ఈశాన్య రాష్ట్రాల గురించి పట్టించుకుంటూనే తెలంగాణలో ఎన్నికలు ఎదుర్కోవాల్సి వచ్చింది. అయిపప్పటికీ.. పార్టీ ఒక్క అసెంబ్లీ స్థానం నుంచి ఎనిమిది అసెంబ్లీ స్థానాలకు చేరింది. ఓటు బ్యాంక్ 14 శాతానికి చేరింది. అంతకు ముందు ఈ ఓటు బ్యాంక్ ఆరు శాతం వరకే ఉండేది. ఈ ఉత్సాహంతో కిషన్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికలపై గురి పెట్టారు. ఐదు నెలల్లోనే పార్టీని ఆయన బలోపేతం చేశారు. మోదీ చరిష్మాను ఉపయోగించుకుని .. లోక్ సభ ఎన్నికల్లో గరిష్టంగా సీట్లు తీసుకురావడంలో సక్సెస్ అయ్యారు. ఎనిమిది పార్లమెంట్ సీట్లలో బీజేపీ తిరుగులేని విజయం సాధించింది. రెండు, మూడు చోట్ల మినహా అన్ని చోట్ల రెండో స్థానంలో నిలిచింది. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఓటు బ్యాంక్ 35 శాతానికి పెరిగింది. అంటే అధికార కాంగ్రెస్ పార్టీతో సమానంగా ఉంది. లోక్ సభ ఎన్నికల్లో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా వచ్చిన మెజార్టీలు చూస్తే.. 40 స్థానాల్లో బీజేపీ ఆధిక్యం లభించింది. ఆ తర్వాత ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. 

పద్దతైన రాజకీయంతోనే  పదునైన విజయాలు

భారతీయ జనతా పార్టీలో కింది స్థాయి నుంచి ఎదిగిన నేత కిషన్ రెడ్డి. ఆయనకు పార్టీ భావజాలంపై, విధానాలపై పూర్తి స్థాయిలో అవగాహన ఉంటుంది. ఏ మాత్రం పార్టీ లైన్ దాటరు. ఇప్పటి వరకూ ఆయన వివాదాస్పదంగా చేసిన ఒక్క ప్రకటన ఉండదు. అలాగని పార్టీ విధానాలను బలంగా చెప్పలేదన్న అభిప్రాయం కూడా ఉండదు. బీజేపీ ఐడియాలజీని ఎంత బలంగా చెబుతారంటే..ఆయన మాటల్ని ఎవరూ వివాదాస్పదం చేయలేరు. అలాంటి రాజకీయంతోనే బీజేపీని బలోపేతం చేస్తూ వస్తున్నారు. ఇతర నేతలపై పరుషంగా మాట్లాడితేనో.. తిట్లందుకుంటేనో వార్తల్లో ఉంటామని.. దాని వల్ల పార్టీకి నష్టం జరుగుతుంది. అందుకే ఎప్పుడు అలాంటి రాజకీయం చేయరు. కానీ రాజకీయంగా ఎప్పుడూ పార్టీ విధానాలు, భావజాలం విషయంలో రాజీపడరు. తెలంగాణ బీజేపీకి అలాంటి పునాదులు వేసిన కిషన్ రెడ్డి .. ఇప్పుడు విజయాల పరంపరంలోనూ కీలక పాత్ర పోషిస్తున్నారు. 

కిషన్ రెడ్డిపై జాతీయ నాయకత్వం నమ్మకం

తెలంగాణలో పార్టీని బలోపేతం చేయడంలో కిషన్ రెడ్డి స్టైల్ ను జాతీయ నాయకత్వాన్ని కూడా  ఆకర్షించింది. అందుకే పార్టీ పరంగా అయినా పాలన పరంగా అయినా కీలకమైన బాధ్యతల్ని అప్పగిస్తూ వస్తున్నారు. మొదటగా కేంద్ర సహాయ మంత్రిగా ప్రమాణ చేశారు కానీ కొద్ది కాలానికే ఆయనకు కేబినెట్ మంత్రిగా ప్రమోషన్ లభించింది. ఐదుగురు సహాయ మంత్రులు కిషన్ రెడ్డి శాఖలను చూసేందుకు ఉండేవారు. వెంటనే మరోసారి మోదీ కేబినెట్ లో చోటు దక్కించుకున్నారు. కిషన్ రెడ్డి పనితీరుపై నమ్మకంతోనే కేంద్రమంత్రిగా ఉంటూనే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కూడా కొనసాగించారు. మామూలుగా అయితే కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే.. పార్టీ పరమైన బాధ్యతల నుంచి విముక్తి చేస్తారు. రెండింటికి న్యాయం చేయలేరని అనుకుంటారు. కానీ కిషన్ రెడ్డి పనితీరుపై కేంద్ర పెద్దలకు ఉన్న నమ్మకం వల్ల ఆయనను కొనసాగించారు. గతంలో అమిత్ షా మాత్రమే జాతీయ అధ్యక్షుడిగా, కేంద్ర మంత్రిగా కొనసాగారు. ప్రధాని మోదీతో కలిసి కింది స్థాయి నుంచి కలిసి పని చేశారు కిషన్ రెడ్డి. ఆయన నిజాయితీ, కష్టపడే తర్వాత మోదీకి బాగా తెలుసు. జాతీయ నాయకత్వం మద్దతుతో కిషన్ రెడ్డి తెలంగాణలో బీజేపీని బలోపేతం చేస్తున్నారు. 

పదవులు కాదు పార్టీ బలోపేతమే కిషన్ రెడ్డి టార్గెట్

కిషన్ రెడ్డి దశాబ్దాల రాజకీయంలో అధికారంలో పదవులు చేపట్టింది చాలా తక్కువ. పార్టీ కార్యకర్త, పార్టీ నేతగానే ఎక్కువగా పని చేస్తూ వచ్చారు. తెలంగాణలో పార్టీ బలోపేతం వెనుక కిషన్ రెడ్డి వేసిన పునాదులే కీలకం. ఇప్పుడు ఆయనే తెలంగాణలో బీజేపీని అజేయశక్తిగా మారుస్తున్నారు. ఇప్పటికిప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే.. బీజేపీదే విజయం అన్నంతగా తెచ్చారు. ఇప్పుడు బీజేపీ ఎదురుచూస్తోంది.. పోరాడుతోంది.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం కోసమే. ఈ విజయం వెనుక కిషన్ రెడ్డి ముద్ర చాలా బలంగా కనిపిస్తుంది. అందులో సందేహం ఉండదు. 

టాప్ హెడ్ లైన్స్

Vijayasai Reddy New Party: విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Telangana Congress Rift: కాంగ్రెస్ మార్క్ అంతర్గత ప్రజాస్వామ్యం - రేవంత్ ఉక్కిరిబిక్కిరి - దారిలో పెట్టలేకపోతున్నారా?
కాంగ్రెస్ మార్క్ అంతర్గత ప్రజాస్వామ్యం - రేవంత్ ఉక్కిరిబిక్కిరి - దారిలో పెట్టలేకపోతున్నారా?
Ponguleti Srinivas Reddy: రేవంత్ సర్కార్‌కు మంత్రి పొంగులేటి సమస్యగా మారారా? కాంగ్రెస్ ల్యాండ్ మార్క్ గ్రాఫ్‌కు గండి కొడుతున్నాయా?
రేవంత్ సర్కార్‌కు మంత్రి పొంగులేటి సమస్యగా మారారా? కాంగ్రెస్ ల్యాండ్ మార్క్ గ్రాఫ్‌కు గండి కొడుతున్నాయా?

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Southern Zonal Council Meeting: మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
Konda Surekha: కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
PV Sindhu Says World Badminton Drama.!: సింధు నిష్క్రమణ.. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! 
పోరాడి ఓడిన సింధు .. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! వరల్డ్ చాంపియన్షిప్ టోర్నీ
Vizag Crime News: విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
Nara Lokesh vs YS Jagan: వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
Vijayasai Reddy New Party: విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
బైక్ కాదు, కారు కాదు.. హైడ్రోజన్‌తో నడిచే రోబోటిక్ గుర్రం - కవాసకి ప్రయోగం
హైడ్రోజన్‌తో పరుగులు తీసే కీలుగుర్రం.. తయారు చేస్తున్న కవాసకి
Lucknow Crime News: లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
Embed widget