IPL Highest Scores: రికార్డులతో దుమ్మురేపుతున్న సన్‌రైజర్స్, ఐపీఎల్ చరిత్రలో టాప్ 10 రికార్డు స్కోర్లు చూశారా
IPL Top 10 Highest Scores: ఐపీఎల్ చరిత్రలో సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) రికార్డులు తిరగరాస్తోంది. లీగ్ చరిత్రలో జట్ల టాప్ 5 స్కోర్లలో నాలుగు సన్ రైజర్స్ పేరిటే ఉన్నాయి.

IPL 2025 RR vs SRH Highlights | హైదరాబాద్: ఐపీఎల్ లో హయ్యెస్ట్ స్కోర్ అంటే సన్ రైజర్స్ హైదరాబాద్, SRH అంటే రికార్డుల జోరు, పరుగుల ప్రవాహం అనేలా మార్చేశారు ఆ టీమ్ ఆటగాళ్లు. ఐపీఎల్ 2025లో భాగంగా రాజస్థాన్ రాయల్స్‌తో ఆదివారం జరిగిన తమ తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ మరో రికార్డు తన ఖాతాలో వేసుకుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో రెండవ అత్యధిక స్కోరును సన్‌రైజర్స్ నమోదు చేసింది. రాజస్తాన్ తో జరుగుతున్న మ్యాచ్‌లో SRH టీం 6 వికెట్ల నష్టానికి 286/6 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ అద్భుతమైన సెంచరీకి ఓపెనర్ ట్రావిస్ హెడ్ (31 బంతుల్లో 67) హాఫ్ సెంచరీ తోడవడంతో ఈ రికార్డు నమోదైంది.
లీగ్ చరిత్రలో నెంబర్ వన్ సన్‌రైజర్స్
లీగ్ చరిత్రలో అత్యధిక పరుగులతో తొలి స్థానంలో ఎవరు అంటారా.. ఆ రికార్డు సైతం సన్‌రైజర్స్ ఖాతాలోనే ఉంది. IPL 2024లో ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో లీగ్ చరిత్రలోనే సన్ రైజర్స్ అత్యధిక స్కోరు నమోదు చేసింది. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం (Uppal Stadium)లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై SRH 3 వికెట్లు నష్టపోయి 287 పరుగులు చేసింది. లీగ్ చరిత్రలో ఇప్పటివరకూ ఇదే ఓ జట్టు చేసిన అత్యధిక స్కోరు.
టాప్ 5లో 4 సన్ రైజర్స్ రికార్డులు ఖాతాలోనే..
ఐపీఎల్ 2024లో ముంబైపై 287/3, ఐపీఎల్ 2025లో రాజస్తాన్ పై 286/3తో జట్టు స్కోర్లలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన సన్ రైజర్స్ పేరిటే మూడో స్థానం నమోదైంది. 2024లో ముంబై ఇండియన్స్ పై సన్ రైజర్స్ 3 వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసింది. నాలుగో స్థానంలో కోల్‌కతా నైట్ రైడర్స్ ఉంది. 2024లో డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా (KKR) టీం ఢిల్లీ క్యాపిటల్స్ పై 7 వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసింది. SRH 266/7 vs DC in 2024 5వ స్థానం సైతం సన్‌రైజర్స్ పేరిటే లిఖించుకుంది. ఐపీఎల్ 2024లో ఢిల్లీ క్యాపిటల్స్ మీద చేసిన 266 పరుగులే ఐపీఎల్ చరిత్రలో ఓ టీమ్ 5వ అత్యధిక స్కోరు. అయితే 2013లో బెంగళూరు చేసిన 263/5 దాదాపు 11 ఏళ్ల పాటు ఐపీఎల్ లో అత్యధిక స్కోరుగా ఉండేది. కానీ గత సీజన్ నుంచి SRH లీగ్ చరిత్రలో రికార్డులు తిరగరాస్తూ పరుగుల వేట కొనసాగిస్తోంది.
ఐపీఎల్ చరిత్రలో టాప్ 10 రికార్డు స్కోర్లు ఇవే
1) SRH 287/3 vs RCB in 2024
2) SRH 286/6 vs RR in 2025
3) SRH 277/3 vs MI in 2024
4) KKR 272/7 vs DC in 2024
5) SRH 266/7 vs DC in 2024
6) RCB 263/5 vs PWI in 2013
7) PBKS 262/2 vs KKR in 2024
8) RCB 262/7 vs SRH in 2024
9) KKR 261/6 vs PBKS in 2024
10) DC 257/4 vs MI in 2025 , LSG 257/5 vs PBKS in 2023
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

