అన్వేషించండి

SA vs AUS: ఆస్ట్రేలియాతో సఫారీల సెమీస్‌, టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా

ODI World Cup 2023: భారత్ వేదికగా జరుగుతున్న ప్రపంచ కప్‌ రెండవ సెమీ ఫైనల్ మ్యాచ్ దక్షిణాఫ్రికా , ఆస్ట్రేలియా మ్యాచ్ లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా  కెప్టెన్ టెంబా బావుమా బ్యాటింగ్ ఎంచుకున్నాడు.

South Africa vs Australia:  భారత్ వేదికగా జరుగుతున్న ప్రపంచ కప్‌ రెండవ సెమీ ఫైనల్ మ్యాచ్ దక్షిణాఫ్రికా , ఆస్ట్రేలియా మ్యాచ్ లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా  కెప్టెన్ టెంబా బావుమా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. నిజానికి కలకత్తా ఈడెన్ గార్డెన్స్(Eden Gardens)  లో వర్షం పడే ఛాయలు ఉండటం తో ఏ టీం టాస్ గెలిచినా బ్యాటింగ్ నే ఎంచుకోవటం మంచిదని నిపుణుల సలహా.  ప్రపంచకప్‌లో బ్యాడ్‌ లక్‌ టీమ్‌గా పేరుపడిన దక్షిణాఫ్రికా మరోసారి కీలక మ్యాచ్‌కు సిద్ధమైంది. అద్భుతమైన ఆటతీరుతో సెమీస్‌ చేరిన సఫారీ జట్టు.... ఆస్ట్రేలియాతో రెండు సెమీస్‌లో తాడోపేడో తేల్చుకోనుంది. 

ఇప్పటివరకు వన్డే ప్రపంచకప్‌ 12 సార్లు జరగగా అందులో అయిదు టైటిళ్లు ఆస్ట్రేలియా దగ్గరే ఉన్నాయి. కాబట్టి మరోసారి కప్పును సాధించే అవకాశాన్ని కంగారులు అంత తేలిగ్గా వదిలిపెట్టరు. గత ఆరు ప్రపంచకప్‌లలోనే నాలుగుసార్లు ఆసిస్‌ గెలిచింది. గత తొమ్మిది ప్రపంచకప్‌లలో నాలుగు సార్లు సెమీస్‌ చేరిన దక్షిణాఫ్రికా నాలుగుసార్లు పరాజయం పాలైంది. కానీ ఈసారి కచ్చితంగా గెలవాలని బవుమా సేన భావిస్తోంది. 1992లో ఇంగ్లండ్‌తో జరిగిన సెమీఫైనల్‌లో వర్షం కారణంగా డక్‌ వర్త్‌ లూయిస్ పద్ధతి, 1999లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌ టైగా ముగియడం ఇలా మహా సంగ్రామంలో దక్షిణాఫ్రికాను దురదృష్టం వెంటాడింది. గత చరిత్రను ఈ ప్రపంచకప్‌లో అధిగమిస్తామని దక్షిణాఫ్రికా కెప్టెన్ బావుమా ధీమాగా చెప్పాడు. ఈసారి సెమీఫైనల్‌ అడ్డంకిని అధిగమించేందుకు సిద్ధంగా ఉన్నామని బవూమా తెలిపాడు. దక్షిణాఫ్రికా బ్యాటింగ్ విభాగం బలంగా ఉంది. డికాక్‌ సూపర్‌ ఫామ్‌లో ఉన్నాడు. డికాక్‌  ఈ టోర్నీలో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు. ప్రొటీస్‌ టాప్ సిక్స్ బ్యాటర్లలో నలుగురు సెంచరీలు సాధించారు. డస్సెన్, హెన్రిచ్ క్లాసెన్, మార్‌క్రమ్‌, అత్యుత్తమ ఆటతీరు ప్రదర్శిస్తున్నారు. డేవిడ్ మిల్లర్ కూడా రాణిస్తే ఆస్ట్రేలియాపై మరోసారి ప్రొటీస్‌ భారీ స్కోరు సాధించే అవకాశం ఉంది.
 
కీలకమైన మ్యాచ్‌లో సారధి బవుమా ఫామ్‌ మాత్రమే దక్షిణాఫ్రికాను వేధిస్తోంది. బవుమా ఏడు ఇన్నింగ్స్‌లలో 145 పరుగులు చేశాడు. ఈ టోర్నమెంట్‌లో రెండు మ్యాచ్‌లు ఆడిన హెండ్రిక్స్  ఇంగ్లాండ్‌పై 85 పరుగులు చేశాడు. మార్కో జాన్సన్‌, ఎంగిడి, స్పిన్నర్ కేశవ్, తబ్రైజ్ షంసీతో దక్షిణాఫ్రికా బౌలింగ్‌ కూడా ఈడెన్ గార్డెన్స్‌లో అద్భుతాలు చేయగలదు. 
 
ఇటు ఆస్ట్రేలియా కూడా ఫైనల్‌ చేరాలని గట్టి పట్టుదలతో ఉంది. ఆఫ్ఘనిస్తాన్‌పై 91/7 నుంచి కోలుకుని గ్లెన్ మాక్స్‌వెల్ 201 పరుగులతో చేసిన విధ్వంసంతో ఘన విజయం సాధించింది. ఆసిస్‌ పూర్తి ఆత్మ విశ్వాసంతో ఉంది. పాకిస్తాన్, నెదర్లాండ్స్‌పై వరుసగా సెంచరీలు కొట్టి డేవిడ్ వార్నర్ ఫామ్‌లో ఉన్నాడు. ట్రావిస్ హెడ్... న్యూజిలాండ్‌పై 109 పరుగులు చేసి మంచి టచ్‌లో ఉన్నాడు. మిచెల్ మార్ష్, మాక్స్‌వెల్ విధ్వంసకరంగా బ్యాటింగ్‌ చేయగలరు. స్టీవ్ స్మిత్ మళ్లీ ఫామ్‌లోకి వస్తాడని ఆస్ట్రేలియా ఆశిస్తోంది. వన్డే ప్రపంచ కప్ నాకౌట్‌లలో నాలుగు ఇన్నింగ్స్‌లలో 311 పరుగులు చేసిన ఘన రికార్డు స్మిత్‌ పేరిట ఉంది. కాబట్టి స్మిత్‌ ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. 
 
దక్షిణాఫ్రికా జట్టు:
టెంబా బావుమా (కెప్టెన్‌), గెరాల్డ్ కోయెట్జీ, క్వింటన్ డి కాక్,  మార్కో జాన్సెన్, హెన్రిచ్ క్లాసెన్ , కేశవ్ మహరాజ్, ఐడెన్ మర్క్రామ్, డేవిడ్ మిల్లర్, కగిసో రబడా, తబ్రైజ్ షంసీ, డస్సెన్
 
ఆస్ట్రేలియా జట్టు: పాట్ కమిన్స్ (కెప్టెన్‌), స్టీవ్ స్మిత్,  జోష్ ఇంగ్లిస్, అష్టన్ అగర్, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, మిచ్ మార్ష్, గ్లెన్ మాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, డేవిడ్ వార్నర్ ఆడమ్ జంపా, 
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Shyam Benegal: భారత చిత్రసీమలో విషాదం - ప్రముఖ దర్శకుడు శ్యామ్ బెనెగళ్ మృతి!
భారత చిత్రసీమలో విషాదం - ప్రముఖ దర్శకుడు శ్యామ్ బెనెగళ్ మృతి!
Sandhya Theater: సంధ్య థియేటర్ ఘటన - బాధిత కుటుంబానికి మైత్రీ మూవీ మేకర్స్ రూ.50 లక్షల సాయం
సంధ్య థియేటర్ ఘటన - బాధిత కుటుంబానికి మైత్రీ మూవీ మేకర్స్ రూ.50 లక్షల సాయం
Vizag news: వైజాగ్ ప్రజలకు బిగ్ అలర్ట్ -  జనవరి ఒకటి నుంచి భూముల విలువ పెంపు - ఎక్కడెక్కడ ఎంత పెరగనున్నాయంటే ?
వైజాగ్ ప్రజలకు బిగ్ అలర్ట్ - జనవరి ఒకటి నుంచి భూముల విలువ పెంపు - ఎక్కడెక్కడ ఎంత పెరగనున్నాయంటే ?
TVS Sport: టీవీఎస్ స్పోర్ట్ బైక్‌ను ఈఎంఐలో ఎలా కొనాలి? - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
టీవీఎస్ స్పోర్ట్ బైక్‌ను ఈఎంఐలో ఎలా కొనాలి? - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ట్రాన్స్ జెండర్స్ ఆన్ డ్యూటీ, నేటి నుంచే హైదరాబాద్ రోడ్లపై..సహనం కోల్పోయిన సీపీ, తిట్టేసి క్షమాపణలు!Police Released CCTV Footage of Allu Arjun | అల్లు అర్జున్ సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ చేసిన పోలీసులు | ABP DesamNara Devaansh Chess World Record | వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటుసాధించిన దేవాన్ష్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shyam Benegal: భారత చిత్రసీమలో విషాదం - ప్రముఖ దర్శకుడు శ్యామ్ బెనెగళ్ మృతి!
భారత చిత్రసీమలో విషాదం - ప్రముఖ దర్శకుడు శ్యామ్ బెనెగళ్ మృతి!
Sandhya Theater: సంధ్య థియేటర్ ఘటన - బాధిత కుటుంబానికి మైత్రీ మూవీ మేకర్స్ రూ.50 లక్షల సాయం
సంధ్య థియేటర్ ఘటన - బాధిత కుటుంబానికి మైత్రీ మూవీ మేకర్స్ రూ.50 లక్షల సాయం
Vizag news: వైజాగ్ ప్రజలకు బిగ్ అలర్ట్ -  జనవరి ఒకటి నుంచి భూముల విలువ పెంపు - ఎక్కడెక్కడ ఎంత పెరగనున్నాయంటే ?
వైజాగ్ ప్రజలకు బిగ్ అలర్ట్ - జనవరి ఒకటి నుంచి భూముల విలువ పెంపు - ఎక్కడెక్కడ ఎంత పెరగనున్నాయంటే ?
TVS Sport: టీవీఎస్ స్పోర్ట్ బైక్‌ను ఈఎంఐలో ఎలా కొనాలి? - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
టీవీఎస్ స్పోర్ట్ బైక్‌ను ఈఎంఐలో ఎలా కొనాలి? - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
Mohan Babu Bail Petition: హైకోర్టులో మోహన్ బాబుకు చుక్కెదురు, ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత
హైకోర్టులో మోహన్ బాబుకు చుక్కెదురు, ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత
Instagram Reach Tips: ఇన్‌స్టాగ్రామ్‌లో ఏ టైమ్‌లో పోస్ట్ చేస్తే ఎక్కువ రీచ్ వస్తుంది? - ఇలా చేస్తే సూపర్!
ఇన్‌స్టాగ్రామ్‌లో ఏ టైమ్‌లో పోస్ట్ చేస్తే ఎక్కువ రీచ్ వస్తుంది? - ఇలా చేస్తే సూపర్!
Anantapur Crime News: స్టాక్ మార్కెట్ పేరుతో ఫ్రెండ్స్ మోసం - కన్నీరు పెట్టిస్తున్న అనంతపురం హెడ్మాస్టర్ సూసైడ్ నోట్
స్టాక్ మార్కెట్ పేరుతో ఫ్రెండ్స్ మోసం - కన్నీరు పెట్టిస్తున్న అనంతపురం హెడ్మాస్టర్ సూసైడ్ నోట్
Non Detention Policy: 5, 8 తరగతుల విద్యార్థులు పాస్ కావాల్సిందే - 'నాన్ డిటెన్షన్ విధానం' రద్దు చేస్తూ కేంద్రం సంచలన నిర్ణయం
5, 8 తరగతుల విద్యార్థులు పాస్ కావాల్సిందే - 'నాన్ డిటెన్షన్ విధానం' రద్దు చేస్తూ కేంద్రం సంచలన నిర్ణయం
Embed widget