By: ABP Desam | Updated at : 05 Nov 2021 09:31 AM (IST)
Edited By: RamaLakshmibai
Karthika Masam
కార్తీక మాసం శివుడికి, మహా విష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది. కార్తీక పురాణంలో కార్తీక సోమవారం, జ్వాలాతోరణం మహాశివుడి ప్రాముఖ్యతను తెలియజేస్తే బలి పాడ్యమి, ఏకాదశి, క్షీరాబ్ది ద్వాదశి శ్రీ మహావిష్ణువు ప్రాముఖ్యతను స్పష్టంగా తెలియజేస్తాయి. కార్తీక పురణాంలో కూడా మొదటి 15 అధ్యాయాలు ఈశ్వరుడి ప్రాముఖ్యతను, ఆఖరి 15 అధ్యాయాలు శ్రీహరి ప్రాధాన్యతను తెలియజేస్తాయి.
కార్తిక మాసంలో ముఖ్యంగా పాటించాల్సినవి
స్నానం..
కార్తీక మాసంలో రవి తులా రాశిలో ఉండటం వల్ల నదిలో నదీ ప్రవాహానికి ఎదురుగా నిలబడి స్నానం ఆచరించడం వల్ల శరీరానికి శక్తి కలిగి ఆరోగ్యంగా ఉంటారు. పురాణాల పరంగా కార్తీక నెలరోజులూ సూర్యోదయానికి ముందు నదీస్నానం చేస్తే సకల పాపాలు నశిస్తాయని అంటారు.
దీపం..
‘దీపం జ్యోతి పరబ్రహ్మం.. దీప జ్యోతి జనార్దన.. దీపో మేహరతు పాపం.. సంధ్యాదీపం నమోస్తుతే!’.దీపమే పరబ్రహ్మం. దీపంలో లక్ష్మీ దేవి ఉందనీ.. దీపం నుంచి వచ్చే తేజస్సులో బ్రహ్మ, విష్ణు,మహేశ్వరులు ఉన్నారనీ పురాణాలు చెబుతున్నాయి. అజ్ఞానం అనే అందకారాన్ని తొలగించి జ్ఞానాన్నిస్తుంది అనేందుకు దీపం చిహ్నమని చెబుతారు. నిత్యం దీపారాధన చేసే ఇంట్లో ఎలాంటి దోషాలు ఉండవని చెబుతారు. అయితే ఏడాదంతా దీపారాధన చేయనివారు కనీసం కార్తీకమాసంలో అయినా దీపం వెలిగించాలి, ఇదికూడా కుదరకపోతే కార్తీకసోమవారం, ఏకాదశి, ద్వాదశి, పౌర్ణమి, అమావాస్య రోజుల్లో అయినా వెలిగించాలని చెబుతారు. ముఖ్యంగా కార్తీకమాసంలో సంధ్యాదీపం ప్రధానం. సాయంత్రం పూట ఆలయంలో గానీ, తులసికోట, రావిచెట్టు వద్దగానీ, మేడపైన, ఏదైనా నదివద్ద దీపారాధన చేస్తే శివానుగ్రహం లభిస్తుందని కార్తీకపురాణంలో ఉంది.
Also Read: కార్తీక స్నానాలు ఎందుకు చేయాలి… అంత చలిలో అవసరమా…!
ఉపవాసం..
వాస్తవంగా చెప్పాలంటే ఉపవాసం దేవుడికోసం కాదు మన ఆరోగ్యం కోసం చేయాలి. వారంలో ఓ రోజు ఉపవాసం ఉండడం జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. మనసు నిర్మలంగా మారి దైవం వైపు మళ్లుతుంది. కార్తీక సోమవారాల్లో ఉపవాసం ఉండటం కేవలం ఆహారాన్ని మానేయడం కాదు.. కోరికలు పక్కనపెట్టి ధ్యాసను భగవంతుడిపై లగ్నం చేయడం. ఉపవాసం ఉన్న ప్రతిక్షణం మనసు భగవంతుడిపై లగ్నం చేసి భగవతారాధనలో గడిపిన వారికి ఉపవాస ఫలం సిద్ధిస్తుంది. కార్తీక ఏకాదశి మొత్తం ఉపవాసం ఉండి ద్వాదశి రోజు ఉదయాన్నే స్నానమాచరించి శివకేశవలకు పూజ చేసి బ్రాహ్మణులకు లేదా అతిథులకు భోజనం పెట్టాక తినాలి. ఇలా చేస్తే శ్రీమహావిష్ణువు అనుగ్రహం కలిగి విష్ణులోక ప్రాప్తి కలుగుతుందని కార్తిక పురాణంలో ప్రస్తావించారు.
దానం..
సనాతన ధర్మంలో గృహస్థులు చేయాల్సిన ముఖ్యమైన పనుల్లో స్నానం, దానం, జపం, తర్పణం. అన్ని నెలల్లో కన్నా కార్తీక మాసంలో చేసే స్నాన, దాన, జప, తర్పణాలకు అధిక పుణ్యఫలం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. అందుకే కార్తిక మాసంలో ఎవరైతే నవధాన్యాలు, అన్నం, దీపదానం, ఉసిరి దానం, వస్త్రదానం, సువర్ణ దానం, గోదానం, కన్యాదానం చేస్తారో వారికి కోటి రెట్ల పుణ్యఫలం లభిస్తుందని మార్కండేయ, శివ పురాణాలు చెబుతున్నాయి.
Also Read: తెరుచుకోనున్న అయ్యప్ప ఆలయం… భక్తులు ఈ నిబంధనలు పాటించాల్సిందే..
కార్తీకమాసంలో చేయకూడనివి
Also Read: యక్ష ప్రశ్నలంటే ఏంటి.. వాటికి సమాధానం ఎవరు ఎవరికి ఏ సందర్భంలో చెప్పారు..
Also Read: మడి వంట అంటే ఏంటి... ఇది పాటించకపోతే ఏమవుతుంది..!
Also Read: కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడు పూరించిన పాంచజన్యం ఎక్కడుందంటే...
Also Read: అగ్గిపుల్లతో నేరుగా దీపం వెలిగిస్తున్నారా… దీపం ఏ దిశగా ఉంటే ఎలాంటి ఫలితం ఉంటుందంటే..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Spirituality: భోజనం చేస్తున్నప్పుడు అన్నంలో వెంట్రుకలు వచ్చాయా, విమర్శిస్తూ భోజనం చేస్తున్నారా, ఈ విషయాలు తెలుసుకోండి
Today Panchang 23 May 2022: తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, అష్టకష్టాలు తీర్చే కాలభైరవాష్టకం
Horoscope Today 23 May 2022: ఈ రాశివారు గంగాజలంతో శివునికి అభిషేకం చేస్తే కష్టాలు తొలగిపోతాయి, ఈ రోజు మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి
Horoscope Today 23 May 2022: ఈ రాశివారు ఎవ్వరి నుంచీ ఏమీ ఆశించకపోవడమే మంచిది, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి
Today Panchang 22 May 2022: తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, భానుసప్తమి ప్రత్యేక శ్లోకం
Monkeypox Virus Advisory: మంకీపాక్స్ వైరస్ ముప్పుపై కేంద్రం అప్రమత్తం- కేరళ, మహారాష్ట్ర, దిల్లీకి కీలక ఆదేశాలు
Major Movie: 'మేజర్' లేటెస్ట్ అప్డేట్ - మే 24 నుంచే స్క్రీనింగ్
MLA Food: దళిత వ్యక్తి నోట్లోని అన్నం తీయించి ఎంగిలి తిన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే - వీడియో వైరల్
Vizag Bride Death: పెళ్లి పీటలపై వధువు మృతి కేసులో వీడిన చిక్కుముడి - అసలు నిజం కనిపెట్టేసిన పోలీసులు