Thala Ajith in CSK vs SRH IPL 2025 | నిన్న చెన్నై అభిమానులకు ఒకే టికెట్ పై రెండు షోలు
నిన్న సీఎస్కే సన్ రైజర్స్ మీద మ్యాచ్ ఓడిపోయినా..దాదాపుగా ఇక ఈ సీజన్ నుంచి ఎలిమినేట్ అయిపోయినా కూడా నిన్న మ్యాచ్ కొంత మంది సీఎస్కే అభిమానులకు చాలా స్పెషల్. ఎందుకంటే నిన్న చెన్నై చెపాక్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ చూడటానికి చాలా మంది అభిమానులతో పాటు ఓ సూపర్ స్టార్ కూడా వచ్చారు. ఆయనే తలా అజిత్. తన భార్య షాలినీ, ఇంకా పిల్లలతో కలిసి స్టేడియానికి వచ్చిన తలా అజిత్ ను చూసి ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అయిపోయారు. ఒక తలా ను చూద్దామని టికెట్ కొనుక్కుని వస్తే మరో తలా దర్శనం కూడా జరగటంతో చాలా అంటే చాలా హ్యాపీగా ఫీలైపోయారు. ధోని ని పిలుచుకున్నట్లే తమిళ ప్రజలు అజిత్ ను కూడా తలా అనే పిలుచుకుంటారు. అలా రెండు తలాలను చూసే అవకాశం చెన్నై ఫ్యాన్స్ కి దక్కింది. ధోనీ ఎంట్రీ అప్పుడు అయితే ధోనితో పాటు అజిత్ ను కూడా భారీ స్క్రీన్స్ మీద చూపించే సరికి బాహుబలి బాహుబలి అని బాహుబలి సినిమాలో అరిచినట్లే తలా నినాదాలతో చెపాక్ స్టేడియం అయితే హోరెత్తింది. అజిత్ తో పాటు శివకార్తికేయన్, హీరోయిన్ శ్రుతి హాసన్ కూడా చెపాక్ స్టేడియంలో సందడి చేశారు. మ్యాచ్ చెన్నై ఓడిపోయినా నిన్న తమ అభిమాన హీరో అభిమాన క్రికెటర్ ఇద్దరినీ చూసిన ఫ్యాన్స్ అయితే ఫుల్ ఖుష్ అయ్యారు.





















