Annapurna Studios : అన్నపూర్ణ, రామానాయుడు స్టూడియోలకు బిగ్ షాక్ - GHMC నోటీసులు... అసలు రీజన్ ఏంటంటే?
GHMC Notices : హైదరాబాద్ రామానాయుడు, అన్నపూర్ణ స్టూడియోలకు GHMC అధికారులు నోటీసులు జారీ చేశారు. కావాలనే విస్తీర్ణాన్ని తక్కువగా చూపించి ఫీజులు ఎగ్గొడుతున్నట్లు గుర్తించారు.

GHMC Notices To Ramanaidu Annapurna Studios : హైదరాబాద్‌లో ఫేమస్ స్టూడియోస్ అయిన అన్నపూర్ణ, రామానాయుడు స్టూడియోలకు GHMC షాక్ ఇచ్చింది. ట్రేడ్ లైసెన్స్ ఫీజు పేరుతో భారీగా పన్ను ఎగవేతలకు పాల్పడినట్లు గుర్తించిన అధికారులు రెండు స్టూడియోలకు కూడా నోటీసులు ఇచ్చారు. స్టూడియోలు చూపించిన విస్తీర్ణం కంటే నిజానికి చాలా పెద్దవిగా ఉన్నట్లు గుర్తించారు. వ్యాపార విస్తీర్ణాన్ని కావాలనే తక్కువగా చూపిస్తూ ఏళ్లుగా తక్కువ ఫీజులు చెల్లిస్తున్నట్లు తెలిపారు.
ఎంత చెల్లిస్తున్నారంటే?
స్టూడియోలు ఉన్న విస్తీర్ణం కంటే తక్కువగా చూపిస్తూ ట్రేడ్ లైసెన్స్ ఫీజు తక్కువగా చెల్లిస్తున్నారంటూ బల్దియా అధికారులు నోటీసులు జారీ చేశారు. వాస్తవానికి అన్నపూర్ణ స్టూడియోస్ రూ.11.52 లక్షలు చెల్లించాల్సి ఉండగా కేవలం రూ.49 వేలు మాత్రమే చెల్లిస్తోంది. లక్షా 92 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో బిజినెస్ చేస్తూ కేవలం 8,100 చదరపు అడుగులే చూపిస్తున్నారు.
అలాగే, రామానాయుడు స్టూడియో రూ.2.73 లక్షలు చెల్లించాల్సి ఉండగా... కేవలం రూ.7,600 మాత్రమే చెల్లించినట్లు అధికారులు గుర్తించారు. 68,000 చదరపు అడుగుల్లో వ్యాపారం చేస్తూ కేవలం 1900 చదరపు అడుగులకు మాత్రమే ట్యాక్స్ ప్లే చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అయితే, స్టూడియోస్ చాలా పెద్దవిగా ఉండడంతో పే చేయాల్సిన ట్రేడ్ లైసెన్స్ ఫీజులో భారీ తేడా ఉన్నట్లు స్పష్టంగా కనిపించింది. దీనిపై సీరియస్ అయిన GHMC సర్కిల్ - 18 అధికారులు పూర్తి ట్రేడ్ లైసెన్స్ ఫీజ్ చెల్లించాలని నోటీసులు ఇచ్చారు. అలాగే, పూర్తి వివరణతో పాటు అసలైన విస్తీర్ణం ఆధారంగా ట్రేడ్ లైసెన్స్ రెన్యూవల్ చేయించుకోవాలని సూచించారు.
Also Read : iBOMMA రవి అరెస్ట్ - ఫ్రీగా వాదించేందుకు ముందుకొచ్చిన లాయర్... తండ్రి షాకింగ్ డెసిషన్






















