iBOMMA Ravi Father : iBOMMA రవి అరెస్ట్ - ఫ్రీగా వాదించేందుకు ముందుకొచ్చిన లాయర్... తండ్రి షాకింగ్ డెసిషన్
iBOMMA Ravi : iBOMMA రవి కేసును కోడికత్తి, గులకరాయి కేసులు వాదించిన లాయర్ సలీం వాదించనున్న సంగతి తెలిసిందే. అయితే, రవి తండ్రి సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

iBOMMA Ravi Father Key Decision About His Son Piracy Case : iBOMMA రవి... ఇప్పుడు ఈ పేరే ఓ సంచలనం. ఎన్నో రోజులుగా కొత్త సినిమాల పైరసీతో అటు ఇండస్ట్రీని ఇటు పోలీసులను ముప్పు తిప్పలు పెట్టాడు. చివరకు పోలీసులకే సవాల్ విసరగా ఛాలెంజింగ్‌గా తీసుకున్న పోలీసులు అతన్ని కటాకటాల్లోకి నెట్టారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. రవి కేసును ఫేమస్ లాయర్ సలీం వాదించనున్నారు. అంతకు ముందు కోడికత్తి, గులకరాయి కేసులను ఈయనే వాదించారు.
రవి తండ్రి షాకింగ్ డెసిషన్
iBOMMA రవిని సోషల్ మీడియాలో రాబిన్ హుడ్‌తో కొంతమంది పోలుస్తున్నారు. చట్ట పరంగా అతని హక్కుల కోసం తన వృత్తి ధర్మంగా పోరాడతానని అన్నారు. ఈ క్రమంలోనే రవి తండ్రి అప్పారావును లాయర్ సలీం తాజాగా కలిశారు. విశాఖ జిల్లాలోని పెదగత్తిలి సాలిపేటలో ఉంటున్న ఆయన్ను కలిసి కేసుకు సంబంధించి కొన్ని పేపర్లపై సంతకాలు పెట్టాలని కోరారు.
అయితే, అందుకు అప్పారావు నిరాకరించినట్లు తెలుస్తోంది. తనకు ఇప్పటికే ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉందని... భవిష్యత్తులో కోర్టుల చుట్టూ తిరగలేనని అన్నట్లు సమాచారం. న్యాయస్థానాల చుట్టూ తిరిగే ఓపిక, సహనం లేవని తనను వదిలేయాలని లాయర్‌తో చెప్పినట్లు తెలుస్తోంది. మరి దీనిపై లాయర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలియాల్సి ఉంది.
పోలీసుల ఎంక్వైరీ... కీలక విషయాలు
నిందితుడు రవిని పోలీసులు కోర్టులో హాజరు పరచగా రిమాండ్ విధించింది. చంచల్ గూడ జైలులో ఉన్న రవిని అధికారులు కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. ఫస్ట్ డే విచారణలో పలు కీలక విషయాలు వెల్లడించాడు. ఎలాంటి భయం, బెరుకు లేకుండా పోలీసుల ప్రశ్నలకు సమాధానం చెప్పినట్లు తెలుస్తోంది. తాను ఒంటరినని... ఇష్టం వచ్చింది చేసుకోవాలంటూ పోలీసులకు చెప్పాడు. అతన్ని కలిసేందుకు వెళ్లిన లాయర్లను సైతం కలవలేదు. తన ఫ్రెండ్ వచ్చి కలుస్తాడని చెప్పినట్లు తెలుస్తోంది.
కొత్త మూవీని ఎలా పైరసీ చేస్తాడు? దాన్ని ఇంటర్నెట్‌లో ఎలా అప్లోడ్ చేస్తాడు? ఎక్కడ రికార్డు చేస్తారు? ఫుల్ క్వాలిటీతో ఐబొమ్మలోకి ఎలా అప్లోడ్ అవుతుంది? ఏదైనా టెక్నికల్ ఇష్యూ వస్తే ఎలా సాల్వ్ చేస్తాడు? iBOMMAకు iBOMMA one కు లింక్ ఏమైనా ఉందా? అది క్లిక్ చేస్తే 'మూవీ రూల్జ్'కు ఎలా రీడైరెక్ట్ అయ్యింది? అనే ప్రశ్నలకు రవి క్లియర్‌గా సమాధానం చెప్పినట్లు తెలుస్తోంది. తన కోసం పని చేసే ఏజెంట్లు కూడా ఉన్నారని రవి పోలీస్ విచారణలో ఒప్పుకొన్నాడట.
బెయిల్ వస్తుందా?
మరోవైపు, రవికి సోషల్ మీడియా వేదికగా కొందరు మూవీ లవర్స్ సపోర్ట్ చేస్తుంటే మరికొందరు అతనికి శిక్ష పడడం సరైనదేనని అంటున్నారు. ఇప్పటికే రవి బెయిల్ పిటిషన్‌ను అతని తరఫు లాయర్ సలీం దాఖలు చేశారు. 'ఈ కేసు చాలా సింపుల్. సైబర్ క్రైమ్ కేసులో రవికి చాలా ఈజీగా బెయిల్ వస్తుంది. కానీ ఈడీ ఇన్వాల్వ్ అయితే మాత్రం బెయిల్ వచ్చేందుకు టైం పట్టొచ్చు.' అని చెప్పారు.





















