Vivah Panchami 2025: సీత జననం వెనుక రహస్యం! భూమి నుంచి పుట్టి మిథిలలో కరువు తీర్చిన అద్భుతం!
Vivah Panchami 2025 Date: మార్గశిర శుక్ల పంచమి నాడు సీతాదేవి శ్రీరాముడిని వివాహం చేసుకుంది. ఆమె మిథిల రాజు జనకుని కుమార్తె. ఆమె జననం వెనుక జరిగిన అద్భుతం...

Vivah Panchami 2025: సీతాదేవి వివాహం శ్రీరాముడితో మార్గశిర శుక్ల పక్షం పంచమి తిథి నాడు వివాహం జరిగింది. 2025 సంవత్సరం నవంబర్ 25న వస్తుంది.
సీతాదేవి జననం
సీతాదేవిని లక్ష్మీదేవి అవతారంగా భావిస్తారు. రామాయణం ప్రకారం సీతాదేవి జనక మహారాజు కుమార్తె. కానీ ఆమె సాధారణ బాలికలా జన్మించలేదు. సీతాదేవి జననం సాధారణ మానవ జననం లాగా తల్లి గర్భం నుంచి కాదు. ఆమె “అయోనిజ” (గర్భం ద్వారా కాకుండా జన్మించినది), భూమిదేవి కుమార్తె అని రామాయణంలో ఉంది. జనకమహారాజు కుమార్తెగా స్వీకరించి.. ఆమెకు సీతగా పేరు పెట్టాడు. అందుకే సీతను జనక నందిని , భూమిజ అని కూడా పిలుస్తారు. సీత పుట్టుకకు సంబంధించిన కథ హిందూ మతంలో దైవిక జననానికి గొప్ప ఉదాహరణ.
సీత జననం కథ (Goddess Sita Birth Story)
సీత జననానికి సంబంధించిన పురాణ, మతపరమైన కథ ప్రకారం చాలా సంవత్సరాలుగా వర్షాలు లేకపోవడంతో మిథిలావాసులు తీవ్రమైన కరువుతో బాధపడుతున్నారు. ప్రజల జీవితాలను చూసి రాజు జనకుడు కూడా ఆందోళన చెందాడు. పరిష్కారం కోసం రుషులు, మునులు , పండితులను సంప్రదించాడు. జనక మహారాజు యజ్ఞంలో భాగంగా స్వయంగా పొలంలో నాగలితో భూమి దున్ని యజ్ఞం చేయాలని సూచించారు. జనక మహారాజు యజ్ఞం పూర్తి చేసి బంగారు నాగలితో ఎండిపోయిన భూమిని దున్నడం ప్రారంభించాడు. అప్పుడు నాగలి మొన ఏదో గట్టి వస్తువును తాకింది. రాజు గ్రామస్థులందరూ ఆశ్చర్యపోయారు. అప్పుడు రాజు ఆ స్థలాన్ని తవ్వాలని ఆదేశించాడు. మట్టిని బాగా తీసినప్పుడు, లోపల మెరుస్తున్న పెట్టె కనిపించింది. పెట్టెను తెరిచినప్పుడు అందులో ప్రశాంతమైన, తేజస్సుతో కూడిన అందమైన నవజాత శిశువు ఉంది. బాలికను చూసిన వెంటనే జనక మహారాజు..ఆమె సాధారణ బాలిక కాదని, దేవుని అనుగ్రహమని గ్రహించాడు. రాజు జనకుడు బాలికను ఎత్తుకోగానే ఆకాశంలో మేఘాలు కమ్ముకున్నాయి భారీ వర్షం కురిసింది. ఈ విధంగా మిథిలలో సంవత్సరాలుగా వెంటాడుతున్న కరవు ముగిసింది. సంతానం లేని రాజు జనకుడు రాణి సునయనలకు సీత రూపంలో కుమార్తె లభించింది.
రావణ వధ జరగాలంటే ..వేదవతి అనే తపస్విని శాపం ప్రకారం ఒక స్త్రీ కారణం కావాలి..అందుకే ఆమెనే సీతగా జన్మించారని కొన్ని కథనాలు ఉన్నాయి. కానీ వాల్మీకి రామాయణంలో మాత్రం సీత భూమిలోంచి లభించిన బాలికగానే స్పష్టంగా ఉంది. అందుకే సీతను “భూమి తన్య” (భూమి కుమార్తె) అని పిలుస్తారు. శ్రీరాముడు శివ ధనుర్భంగం చేసి సీతను పరిణయమాడాడు.
గమనిక: పండితులు చెప్పినవి, పుస్తకాల నుంచి సేకరించి రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.
వారణాసి నుంచి శివుడి ప్రపంచ సంచారం, SSMB29 లో మహేష్ క్యారెక్టర్ పై క్లారిటీ! 'సంచారి' పాటలో శివతత్వం!
'వారణాసి' ఈ పేరెలా వచ్చింది? అక్కడ ప్రత్యేకతలు , వింతలు ఏంటి? రాజమౌళి - మహేష్ సినిమాకు ఈ టైటిల్ ఎందుకు?
'వారణాసి' సినిమా టీజర్లో కనిపించిన 'చినమస్తా దేవి' ఎవరు? రాజమౌళి ఆమె గురించి ఏం చెప్పబోతున్నారు?






















