Varanasi : 'వారణాసి' సినిమా టీజర్లో కనిపించిన '"చిన్న మస్త దేవి" ఎవరు? రాజమౌళి ఆమె గురించి ఏం చెప్పబోతున్నారు?
వారణాసి సినిమా టీజర్ లో కనిపించిన "చిన్న మస్త దేవి "ఎవరు? తన తలను తానే నరుక్కుని మరీ రక్తం ఎందుకు తాగుతుంది.. బౌద్ధ, తాంత్రిక, ప్రాచీన వేద గ్రంధాల్లో ఆమె గురించి ఏముంది? రాజమౌళి ఏం చెప్పబోతున్నారు?

Varanasi Movie: దర్శక ధీరుడు రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబు కలయిక లో వస్తున్న వారణాసి సినిమా ఫై అంచనాలు స్కై లెవెల్ లో ఉన్నాయి. ఇటీవల ఆ సినిమా టైటిల్ అనౌన్స్ మెంట్ సందర్బంగా చూపించిన విజువల్ లో ఒక దేవత విగ్రహం ఇప్పుడు వైరల్ అవుతోంది. చాలామంది ఆ దేవతను కాళీ మాత అనుకుంటున్నారు కానీ అది నిజం కాదు. ఆమె పేరు 'చినమస్తాదేవి'. చాలా ప్రాచీన గ్రంధాల్లో నిక్షిప్తమై ఉన్న ఆ దేవత తనలో చాలా రహస్యాలు దాచుకుంది. ఇంతకూ ఆమె ఎవరో ఇప్పుడు చూద్దాం.
భయంకరమైన యోగీనీ రూపం.. 'చినమస్తాదేవి '
'చిన మస్త' అనే మాటకు అర్ధం 'శిరస్సు తెగిన స్త్రీ 'అని అర్ధం. ఆమెను రకరకాల గ్రంథాల్లో రకరకాల పేర్లతో పిలిచారు. చిన మస్త, చిన్న మస్తా, ప్రచండ చండిక, జోగని మా లాంటి పేర్లు ఆమెకు ఉన్నాయి. సాధారణంగా నగ్నంగా ఉన్న స్త్రీ మూర్తి తన తలను తానే నరుక్కుని ఆ తలను ఒక చేత్తో పట్టుకుని ఉన్నట్టు ఆమె రూపం ఉంటుంది. మరో చేతిలో రక్తం ఓడుతున్న కత్తి ఉండగా ఆమె మెడలో పుర్రెలతో వేలాడుతున్న దండ, నాగుపాము ఉంటాయి. ఆమె కంఠం నుంచి మూడు రక్తపు ధారలు పైకి చిమ్ముతూ ఉండగా రెండు ధారలను నగ్నం గా ఉన్న ఇద్దరు స్త్రీలు తాగుతుండగా మూడో రక్తపు ధారను ఆ స్త్రీ దేవత తెగిన శిరస్సు స్వయంగా తాగుతుంటుంది. ఆమె కాళ్ల దగ్గర ఒక స్త్రీ పురుషుడు సృష్టి కార్యం లో మునిగిఉంటారు. చూడగానే గగ్గుర్పాటు కలిగించే అ దేవత నే 'చిన మస్త దేవి.'
ఎవరీ 'చిన మస్తా '.. వైదిక, తాంత్రిక, బౌద్ధ మతాల్లో ఆమె ప్రాముఖ్యత ఏమిటి?
టిబెటెన్ తాంత్రిక ఆరాధనల్లో చిన్న మస్త దేవి పూజ ఉంటుంది ఆమెనుఅక్కడ త్రికాయ యోగిని అని పిలుస్తారు..అలాగే పురాతన వైదిక గ్రంధాల్లో ఆమెను జీవాన్ని ఇచ్చే దేవతగా అలాగే జీవాన్ని తీసేసే దేవతగా వర్ణించారు. వైదిక గ్రంధాల్లో ఆమెను కుండలినే శక్తి ని ఉత్తేజ పరిచే దేవత అని చెప్పారు. విధ్వంసం, శృంగారం, త్యాగం లాంటి గుణాలకు ఆమె ప్రతీక అని చెప్పారు. యోగ ప్రక్రియల్లో ఆమెను కుండలినీ శక్తి ఉత్తేజ పరిచడం కోసం ధ్యానిస్తారని చెప్పబడింది. కొన్ని గ్రంధాల్లో శైవమతం లో ఆమె గురించిన ప్రస్తావన ఉంది. హిందూ పురాణాల్లో చిన్న మస్త ప్రస్తావన తొలిసారిగా 9వ శతాబ్దం నాటి" శక్త మహా భాగవత పురాణ ", 9వ శతాబ్దం నాటి దేవి భ గవత పురాణాల్లో ఉంది.తాంత్రిక బౌద్ధ గ్రంధాల్లో కనిపించే చిన్న ముండిక, హిందూ పురాణాల్లో కనిపించే చిన్న మస్త దేవి ఇద్దరూ ఒకరేనని 20వ శతాబ్దపు ప్రముఖ రీసెర్చర్ ఓరియంటల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బరోడా డైరెక్టర్ బినయ్ తోష్ బట్టాచార్య తెలిపారు.
తాంత్రిక "మహా విద్య "ల్లో ఒకరే ఈ చినమస్త
హిందూ ఆరాధన విధానాల్లో ఒకటైన తాంత్రిక పూజల్లో ఆరాధించే రౌద్ర రూప దేవతలను 'మహా విద్య' లు అంటారు. ఆ దేవతల్లో చిన మస్తా కూడా ఉంది.
చిన మస్తా దేవి కి మందాకిని కీ సంబంధం ఏమిటి?
19 వ శతాబ్దం నాటి 'ప్రాణ తోషిణి తంత్ర" ప్రకారం ఒకసారి పార్వతి దేవి మరో అవతారం చిన మస్తా దేవి మందాకిని నదిలో స్నానం చేసి వస్తుండగా ఆమె చెలికత్తె లైన డాకిని,వామిని (వీరినే జయ, విజయ అని కూడా అంటారు) ఆకలి అంటూ అరవడం తో వారికోసం చినమస్తాదేవి తన తలను తానే నరుక్కొని తన రక్తాన్ని వారికి ఆహారంగా ఇచ్చి ఆకలి తీర్చింది. మరో రక్తపు ధార నేలపై పడితే అది సృష్టి నే నాశనం చేసే ప్రమాదం ఉందని మూడో ధారను తన తెగిన తలతో తాగేసింది. ఆమె తల తిరిగి అతుక్కున్నాక వాళ్ళు తిరిగి హిమాలయాలకు వెళ్ళారు. చిన మస్తా దేవి గురించి ఇంకా చాలా వెర్షన్స్, కథలు ఉన్నాయి. మరో వెర్షన్ లో క్షీర సాగర మథనం సమయం లో రాక్షసులకు అమృతం దక్క కూడదని చిన మస్తా దేవి దానవుల వంతు అమృత్తాన్ని రాక్షస రూపం లో తాగేసి తన గొంతు దిగే లోపులోనే తల నరికేసుకుందని ఒక కథనం ఉంది.
రాజమౌళి మహేష్ ఏం చెప్పబోతున్నారు?
ఎలా చూసినా చిన మస్త దేవి చరిత్ర అమృతం, శృంగారం, బలి, త్యాగం, అద్భుత శక్తులు, విధ్వంసం, మందాకిని,తాంత్రిక శక్తులతో నిండి ఉంది. మరి "వారణాసి" టైటిల్ టీజర్ లో రాజమౌళి ఉగ్రబట్టి గుహలో చిన మస్త దేవి విగ్రహాన్ని పై నుంచి పడుతున్న ప్రియాంక చోప్రా లాంటి అమ్మాయిని ఆమెను కాపాడడానికి ప్రయత్నిస్తున్న మహేష్ బాబు లాంటి వ్యక్తినీ చూపించారు. మరి ఇంతటి అద్భుతం వీరోచిత కథాంశంతో రాజమౌళి ఎలాంటి గ్రేట్ మూవీని మన ముందు ఉంచుతారో చూడాలి.





















