అన్వేషించండి

Varanasi: రాజమౌళి 'వారణాసి'లో చిన్న మస్తా దేవినే చూపించారు కానీ.. తాంత్రిక దేవతలు మొత్తం 10మంది.. వాళ్ళు ఎవరంటే?

Dasa Mahavidyas : దశ మహావిద్యల గురించి ఎప్పుడైనా విన్నారా? ఇందులో ఒక్కో విద్యకు ఒక్కో దేవత అధిపతి అని మీకు తెలుసా? ఈ పది మందిలో ఒకరైన చిన మస్త దేవిని వారణాసి టీజర్లో చూపించారు...మిగిలిన వారెవరు?

Chinnamasta Devi : మహేశ్ బాబు - రాజమౌళి కాంబినేషన్లో రూపొందుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం వారణాసి. ప్రపంచ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించేలా ప్రమోషన్ ప్రారంభించిన జక్కన్న.. ఈ మూవీ టైటిల్ తో పాటూ టీజర్ కూడా రిలీజ్ చేశారు. ప్రతి ఫ్రేమ్ అద్భుతమే.. సిల్వర్ స్క్రీన్ పై ప్రేక్షకులు చూసే క్షణం పెద్ద పండుగే.. అయితే చిన్న గ్లింప్స్ తోనే తన సినిమా ఎలా ఉండబోతోందో చెప్పడమే కాదు.. ఏ ఏ విషయాలు కవర్ చేయబోతున్నారో హింట్ ఇచ్చి వదిలారు. చిన్న టీజల్లో అందర్నీ ఆకర్షించిన విగ్రహం ఓ గుహలో తల చేత్తో పట్టుకుని రక్తం తాగే మొండెం ఉన్న అమ్మవారి విగ్రహం. కాళీ మాత అనుకున్నారంతా.. కానీ ఆ దేవతా రూపం పేరు చిన మస్త దేవి.  దశ మహావిద్యల్లో ఓ విద్యకు ఈమె అధినేత్రి. 

దశ మహావిద్యల్లో చిన మస్త ఒకరైతే..మిగిలిన తొమ్మిది మంది ఎవరు? ఎవరు దేనికి సంకేతం? 
 
తాంత్రిక సాధనలో అత్యంత శక్తివంతమైన పాత్ర పోషిస్తాయ్ దశమహావిద్యలు. జ్ఞానస్వరూపిణి అయిన ఆదిపరాశక్తి పార్వతీదేవి పది రూపాలే దశ మహావిద్యలకు అధిపతి. ఇవి శక్తి ఉపాసనలో అత్యంత గోప్యమైనవి.

దశ మహావిద్యలు - అధిదేవత పేరు

కాళీ మహావిద్య  

ఈ విద్యకు అధిదేవత శ్రీ మహాకాళి - కాలం, మరణం, వినాశనం, మోక్షం, అజ్ఞాన నాశనానికి ప్రతీక

తారా మహావిద్య

శ్రీ తారా దేవి - మోక్షప్రదాయిని, దుఃఖ తారణం, బౌద్ధ తాంత్రికులకూ పవిత్ర రూపం ఇది

త్రిపురసుందరీ (షోడశీ)

శ్రీ లలితాంబిక / శ్రీవిద్య - సౌందర్యం, శృంగారం, జ్ఞానం, ఐశ్వర్యం, షోడశ కళల స్వరూపిణి

భువనేశ్వరీ

శ్రీ భువనేశ్వరి - సమస్త విశ్వానికి అధిపతి, ఆకాశ తత్త్వం, సృష్టి పాలన

భైరవీ (త్రిపురభైరవీ)

శ్రీ త్రిపురభైరవి - తేజస్సు, యోగసాధన, కఠిన తపస్సు, శివుని శక్తికి రూపం

చిన మస్త ( వారణాసి సినిమా టీజర్లో కనిపించిన ఈ రూపం గురించి పూర్తి వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి)

శ్రీ చిన మస్త దేవి - తన కంఠాన్ని తానే ఛేదించుకుని రక్తం తాగే స్వరూపిణి – ఆహారం (ప్రాణం) మీద అధికారం, కుండలినీ జాగృతి, అహంకార నాశనానికి ప్రతీక

ధూమావతీ

శ్రీ ధూమావతీ - దుఃఖం, దారిద్ర్యం, ఒంటరితనం, తామస గుణం, అతీత జ్ఞానానికి ప్రతీక

బగళాముఖీ

శ్రీ బగళాముఖీ - శత్రు నాశనం, వాక్స్తంభన, విజయం, రాజస శక్తికి ప్రతీక

మాతంగీ

శ్రీ మాతంగి (రాజశ్యామల) - వాక్కు, కళలు, సంగీతం, జ్ఞానం, మంత్రసిద్ధి రూపం

కమలాత్మికా (కమలా)

శ్రీ మహాలక్ష్మీ - ఐశ్వర్యం, సంపద, సౌభాగ్యం, సౌందర్యం, సత్వగుణ స్వరూపిణి

ఈ పది రూపాలను దశమహావిద్యలు అంటారు. ఈ 10 రూపాలు కలిపి సమస్త సృష్టి-స్థితి-లయలను... మూడు గుణాలను (సత్వ-రజస్-తమస్), మూడు కాలాలను ( భూత - భవిష్యత్-వర్తమాన), అన్ని విధాలైన శక్తులను ప్రతినిధీకరిస్తాయి.

దశ మహావిద్యల్లో ఒక్కొక్కటీ ఒక్కో తాంత్రిక మార్గాన్ని సూచిస్తాయి. వీటి సాధన అత్యంత గుప్తం, అత్యంత కఠినం... గురుముఖంగా మాత్రమే సాధన సాధ్యం అవుతుంది

గమనిక:   పండితులు చెప్పినవి,  పుస్తకాల నుంచి సేకరించి రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. 

వారణాసి నుంచి శివుడి ప్రపంచ సంచారం, SSMB29 లో మహేష్ క్యారెక్టర్ పై క్లారిటీ! 'సంచారి' పాటలో శివతత్వం!

 'వారణాసి' ఈ పేరెలా వచ్చింది? అక్కడ ప్రత్యేకతలు , వింతలు ఏంటి? రాజమౌళి - మహేష్ సినిమాకు ఈ టైటిల్ ఎందుకు?

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More

టాప్ హెడ్ లైన్స్

10-08-2026 సోమవారం మీ రాశిఫలాలు!
10-08-2026 సోమవారం మీ రాశిఫలాలు!
మీన రాశి వారఫలాలు ఆగస్టు 9-15: మీ సంబంధాలలో మూడవ వ్యక్తి జోక్యం ఉద్రిక్తతను పెంచుతుంది జాగ్రత్త!
మీన రాశి వారఫలాలు ఆగస్టు 9-15: మీ సంబంధాలలో మూడవ వ్యక్తి జోక్యం ఉద్రిక్తతను పెంచుతుంది జాగ్రత్త!
కుంభ రాశి వారఫలాలు ఆగస్టు 9-15: భావోద్వేగాలకు లోనవకండి , ఈ వారం ఎలాంటి పెద్ద నిర్ణయాలు తీసుకోకండి!
కుంభ రాశి వారఫలాలు ఆగస్టు 9-15: భావోద్వేగాలకు లోనవకండి , ఈ వారం ఎలాంటి పెద్ద నిర్ణయాలు తీసుకోకండి!
మకర రాశి వారఫలాలు ఆగస్టు 9-15: చిన్న నిర్లక్ష్యం తీవ్ర పరిణామాలకు దారితీయవచ్చు, ఈ వారం అప్రమత్తంగా ఉండండి!
మకర రాశి వారఫలాలు ఆగస్టు 9-15: చిన్న నిర్లక్ష్యం తీవ్ర పరిణామాలకు దారితీయవచ్చు, ఈ వారం అప్రమత్తంగా ఉండండి!

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KCR: దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
AP CM Chandrababu: ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
Rukmini Vasanth : అందాల రుక్మిణి వసంతమ్ - టాక్సిక్ బ్యూటీ స్టైలిష్ మెస్మరైజ్ లుక్
అందాల రుక్మిణి వసంతమ్ - టాక్సిక్ బ్యూటీ స్టైలిష్ మెస్మరైజ్ లుక్
ఈ నెలలో Kia కారు కొంటే రూ.లక్షల్లో ఆదా.. ఏ కారుపై ఎంత డిస్కౌంట్‌ ఉందంటే?
కియా కారు కొనేవాళ్లకు సర్‌ప్రైజ్‌ - రూ.లక్షన్నర మిగిలినట్లే!, ఈ డబ్బుతో మంచి బైక్‌ కొనొచ్చు
Mouneesha Chowdary: బిగ్ బాస్ 10 తెలుగులోకి స్నో అక్క.. జోరుగా ప్రచారం.. మౌనీషా చౌదరి రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
బిగ్ బాస్ 10 తెలుగులోకి స్నో అక్క.. మౌనీషా చౌదరి రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు!
Embed widget