Youtuber Died: పాతికేళ్లు నిండకుండానే ఇన్‌ఫ్లూయన్సర్ మిషా అగర్వాల్ కన్ను మూత - కారణమేంటో వెల్లడించని కుటుంబసభ్యులు
Misha Agarwal: సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయన్సర్‌గా గుర్తింపు తెచ్చుకున్న మిషా అగర్వాల్ చనిపోయారు. ఎలా చనిపోయారన్నది కుటుంబసభ్యులు ప్రకటించలేదు.

Social media influencer Misha Agarwal: యూట్యూబర్ , సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ మిషా అగర్వాల్ తన 25వ పుట్టినరోజుకు రెండు రోజుల ముందు హఠాత్తుగా మరణించారు. ఈ వార్త ఆమె అభిమానులు, సహచర కంటెంట్ క్రియేటర్లు మరియు డిజిటల్ కమ్యూనిటీని షాక్‌కు గురి చేసిది. మిషా తన సరదా, వ్యంగ్యాస్తమైన రీల్స్ , కంటెంట్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో 3.5 లక్షల మంది ఫాలోవర్లను సంపాదించింది ఇన్‌స్టాగ్రామ్‌లో 3.5 లక్షల ఫాలోవర్లు, యూట్యూబ్ ఛానెల్ “ది మిషా అగర్వాల్ షో”తో పాటు, ఆమె ఫ్యాషన్, లైఫ్‌స్టైల్, వినోద కంటెంట్‌లతో వైరల్ అయ్యారు.
Digital creator Misha Agarwal passed away. Known for her relatable humour and candid take on daily life, Misha had built a strong presence on social media. Family issues an official statement on Instagram. Sending love and strength to her family during this difficult time🙏
— India Forums (@indiaforums) April 26, 2025
.
.
.… pic.twitter.com/OD3KVrGFW0
మిషా మరణ వార్తను ఆమె కుటుంబం 2025 ఏప్రిల్ 25న ఆమె అధికారిక ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా తెలియజేసింది. “మిషా అగర్వాల్ మరణ వార్తను మీతో పంచుకోవడం మా హృదయాన్ని బరువెక్కిస్తోంది. ఆమె పట్ల మీరు చూపించిన ప్రేమ , మద్దతుకు ధన్యవాదాలు" అని కుటుంబం పోస్టు చేసింది. మిషా మరణానికి ఖచ్చితమైన కారణం ఆమె కుటుంబం వెల్లడించబడలేదు. కొంత మంది ఆమె ఆత్మహత్య చేసుకున్నారనిచెబుతున్నారు. కానీ ఎవరూ ధృవీకరించలేదు.
మిషా తన విలక్షణమైన డెడ్‌పాన్ డెలివరీ, వ్యంగ్యాస్తమైన రాంట్స్, సామాజిక వ్యాఖ్యానంతో నెటిజన్లను ఆకట్టుకున్నారు. ఆమె వీడియోలు డేటింగ్, స్నేహం, కుటుంబం, లైఫ్‌స్టైల్‌పై ఉండేవి, తరచూ మిలియన్ల వ్యూస్ సాధించేవి. “Get Ready With Me” (GRWM) వీడియోలు కూడా బాగా పాపులర్ అయ్యాయి. ఆమె హెయిర్ బ్రాండ్ CEOగా కూడా వ్యవహరించింది మిషా తన నిజాయితీ, హాస్యం తో అభిమానులను ఆకర్షించింది. ఆమె హేట్ కామెంట్స్‌ను ఎదుర్కొన్నప్పటికీ, తన కెరీర్‌లో పరిణతి సాధించి, దాన్ని ధైర్యంగా ఎదుర్కొనేది.
This is so heartbreaking! 💔 Misha was so talented and hardworking. She spread so many smiles through her content. I can't imagine the pain of her family must be going through. May her soul RIP, @misha_agrawal! 🕊️🥺💔 You will be missed beyond words 🙏🏽#MishaAgrawal pic.twitter.com/zQT0FWtSzB
— Aarav Gautam (@IAmAarav8) April 26, 2025
మిషా మరణ వార్త అభిమానులను షాక్‌కు గురి చేసింది. మిషా కుటుంబం గోప్యత కోరడం వల్ల సమాచారం పూర్తిగా బయటకు తెలియలేదు.



















