Spirituality: కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడు పూరించిన పాంచజన్యం ఎక్కడుందంటే...

ఆ శంఖారావం శత్రువులను గడగడలాడిస్తుంది.ఆ శంఖాన్ని పూరించేవాడు ఈ సృష్టినే శాసించగలడు. అదే పాంచజన్యం. అర్థమయ్యేలా చెప్పాలంటే మహాభారత సంగ్రామంలో శ్రీకృష్ణుడు పూరించిన శంఖం. ఇది ఇప్పటికీ ఉంది తెలుసా

FOLLOW US: 

పాంచజన్యం విశిష్టత:
ఓ శంఖంలో మరో నాలుగు శంఖాలుంటాయి. సాధారణంగా వేయి శంఖాల్లో ఒకటి మాత్రమే దక్షిణావర్త శంఖం ఉద్భవిస్తుంది. అలాంటి వాటిలో గోమడి శంఖం ఒకటి ఉంటుంది. నూరు లక్షల గోమడి శంఖాల్లో ఒకటి పాంచజన్య శంఖంగా ఆవిర్భవిస్తుంది. అలాంటి పవిత్రమైన శంఖాన్నే మహాభారత కురుక్షేత్ర సంగ్రామంలో శ్రీకృష్ణుడు పూరించాడు.   
పాంచజన్యం ఆవిర్భావం: 
ద్వాపర యుగంలో అన్నదమ్ములైన బలరామ శ్రీకృష్ణులు సాందీప ముని వద్ద విద్యాభ్యాసం చేశారు. ఆ సమయంలో ఒకసారి సాందీప ముని కుమారుడు సముద్రంలో స్నానం చేస్తుండగా కెరటాల ఉధృతికి కొట్టుకుపోగా 'పంచజనుడు' అనే రాక్షసుడు మింగేశాడు.  ఆ రాక్షసుడి శరీరంలో ఉన్న శంఖంలోకి ప్రవేశించాడు గురుపుత్రుడు. విద్యాభ్యాసం ముగించుకున్న బలరామకృష్ణులు గురుదక్షిణగా ఏంకావాలో సెలవీయమని ప్రార్థించారు. తనను కోరుకోమన్నది శ్రీ మహావిష్ణువే అని తెలుసుకున్న సాందీపుడు తన కుమారుడిని ఇవ్వమని కోరాడు. అప్పుడు సముద్ర తీరానికి వెళ్లి  గురుపుత్రుడేడని ప్రశ్నించడంతో..అసలు విషయం చెప్పిన సముద్రుడు తన గర్భంలోకి దారిచూపాడు. పంచజనుడిని సంహరించి శరీరాన్ని చీల్చగా  గురుపుత్రునికి బదులు శంఖం దొరికుతుంది. ఆ శంఖాన్ని యముడి వద్దకు తీసుకెళ్లి పూరించగా అక్కడంతా హడలిపోతారు. అప్పుడు తరలివచ్చి యముడు...వాసుదేవుడు వచ్చిన కారణాన్ని ఆరాతీసి సాందీపుడి కుమారుడిని అప్పగించాడు. శ్రీ కృష్ణుడు తన గురుదక్షిణను భద్రంగా సాందీపునికి అప్పగించాడు. అప్పటి నుంచి పంచజనుడి శరీరంలో దొరికిన శంఖాన్ని ధరించాడు వాసుదేవుడు. 

Also Read: పడమర-దక్షిణం వైపు తిరిగి భోజనం చేస్తే ఏం జరుగుతుంది... తినడానికి కూడా రూల్స్ ఉన్నాయా..!
పాంచజన్యం ఇప్పుడు ఎక్కడుంది:
శ్రీకృష్ణుడి ఆనవాలుగా మిగిలిన ఈ పాంచజన్యం ద్వారకానగరంలో లేదు. మరి ఎక్కడుందంటే శ్రీలంకలో అని కొందరు చెబుతున్నారు. ప్రస్తుతం శ్రీలంకలో కొలంబో నేషనల్ మ్యూజియంలో ఉందంటున్నారు. అదా-కాదా అన్నది క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ మహిమాన్వితమైన దక్షిణావృత శంఖం మైసూరు చాముండేశ్వరి దేవి ఆలయంలో ఒకటుంది. ఈ శంఖాన్ని మైసూరు సంస్ధానాధీశులు చాముండేశ్వరీదేవికి కానుకగా సమర్పించారు. అమ్మవారి ఆరాధనోత్సవాలలో ఈ విశేష శంఖాన్ని ఉపయోగిస్తారు. 
Also Read: ఏడు వారాల నగలు వేసుకోవడం వెనుక ఆంతర్యం ఏంటి... ఏ రోజు ఏ రాళ్లు ధరిస్తారు..!  
Also Read: ఏ దేవుడికి ఏం నివేదించాలి… అసలు నైవేద్యం ఎందుకు సమర్పించాలంటే.!
Also Read: పూజకు పనికిరాని పూలు ఏవి...ఎందుకు?
Also Read: ఈ శివాలయం నిర్మాణం ముందు తాజ్ మహల్ కూడా తక్కువే అంటారు..
Also Read:  ఈ చోటి కర్మ ఈ చోటే...ఈనాటి కర్మ మరునాడే అంటాం....మరి కర్మల నుంచి తప్పించుకోవాలంటే గీతలో కృష్ణుడు ఏం చెప్పాడు
Also Read: ఉప్పు, ఎముకలు, పిండి,వెంట్రుకలు, బస్మంతో తయారు చేసిన ఈ శివలింగాల గురించి మీకు తెలుసా?
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 28 Oct 2021 10:25 AM (IST) Tags: Lord Krishna Panchjanya kurukshetra Maha Bharat

సంబంధిత కథనాలు

Horoscope 1st July  2022: ఈ రాశివారు స్థిరాస్తులు కొనుగోలు చేయాలనుకుంటే ఇదే శుభసమయం, మీ రాశిఫలితం తెలుసుకోండి

Horoscope 1st July 2022: ఈ రాశివారు స్థిరాస్తులు కొనుగోలు చేయాలనుకుంటే ఇదే శుభసమయం, మీ రాశిఫలితం తెలుసుకోండి

Panchang 1st July 2022: తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, అన్నపూర్ణ స్తోత్రం

Panchang  1st July 2022:  తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం,  అన్నపూర్ణ స్తోత్రం

Golconda Bonalu 2022 : బోనమెత్తిన గోల్కొండ, జగదాంబిక అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రులు

Golconda Bonalu 2022 : బోనమెత్తిన గోల్కొండ, జగదాంబిక అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రులు

Horoscope 30th June 2022: ఈ రాశివారి చేతిలో డబ్బు నిలవదు, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి

Horoscope 30th June  2022: ఈ రాశివారి చేతిలో డబ్బు నిలవదు, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి

Panchang 30 June 2022: తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, గురువారం పఠించాల్సిన మంత్రం

Panchang 30 June 2022:  తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం,  గురువారం పఠించాల్సిన మంత్రం

టాప్ స్టోరీస్

Landslide Strikes Manipur: ఆర్మీ క్యాంప్‌పై విరిగిపడిన కొండచరియలు- ఏడుగురు మృతి, 45 మంది మిస్సింగ్!

Landslide Strikes Manipur: ఆర్మీ క్యాంప్‌పై విరిగిపడిన కొండచరియలు- ఏడుగురు మృతి, 45 మంది మిస్సింగ్!

Shruthi Haasan: ఆ ఆరోగ్యసమస్యతో బాధపడుతున్న శ్రుతి హాసన్, అయినా ధైర్యంగా ఉన్నానంటున్న నటి

Shruthi Haasan: ఆ ఆరోగ్యసమస్యతో బాధపడుతున్న శ్రుతి హాసన్, అయినా ధైర్యంగా ఉన్నానంటున్న నటి

Rohit Sharma: ఎడ్జ్‌బాస్టన్‌కు రోహిత్‌ రెడీనా? రాహుల్‌ ద్రవిడ్‌ కామెంట్స్‌!!

Rohit Sharma: ఎడ్జ్‌బాస్టన్‌కు రోహిత్‌ రెడీనా? రాహుల్‌ ద్రవిడ్‌ కామెంట్స్‌!!

Kishan Invites TDP : అల్లూరి విగ్రహావిష్కరణకు ఆహ్వానం - మోదీ కార్యక్రమానికి టీడీపీ అధ్యక్షుడు !

Kishan Invites TDP : అల్లూరి విగ్రహావిష్కరణకు ఆహ్వానం - మోదీ కార్యక్రమానికి టీడీపీ అధ్యక్షుడు !