By: ABP Desam | Updated at : 26 Oct 2021 01:53 PM (IST)
Edited By: RamaLakshmibai
Devotional
పూజకు పనికిరాని పూలతో ముఖ్యమైనది మొగలిపువ్వు. దీని వెనుక ప్రచారంలో ఉన్న పురాణ కథ ఏంటంటే..
ఒకప్పుడు బ్రహ్ణ-విష్ణు మధ్య నేను గొప్ప అంటే నేను గొప్ప అనే వాదన తలెత్తింది. వారికి పరీక్ష పెట్టిన శివుడు ఎవరు గెలిస్తే వాళ్లు గొప్ప అని చెప్పాడు. అపుడు శివుడు శివలింగానికి ఆద్యంతాలు చూసి రమ్మని పంపిస్తాడు. ఇద్దరూ ఎంత దూరం వెళ్లినా మొదలు, చివర కనుక్కోలేకపోతారు. బ్రహ్మ దేవుడికి మార్గ మధ్యలో దేవలోకపు గోవు , మొగలి చెట్టు కనిపించాయి. ఇక శివలింగం మొదలు చూడలేనని అర్థమైన బ్రహ్మ.. గోవుని, మొగలి పువ్వుని తాను శివలింగ మొదలు చూసానని సాక్ష్యం చెప్పమంటాడు. ఇంతలో వెనక్కు తిరిగి వచ్చిన విష్ణుమూర్తి తాను శివలింగం చివర కనుక్కోలేకపోయానని చెప్పడంతో బ్రహ్మనే విజేతగా ప్రకటిస్తాడు శివుడు. ఇంతలో గోవు, మొగలి పువ్వు అబద్దం చెప్పాయని ఆకాశవాణి పలుకుతుంది. దీంతో అబద్ధం చెప్పిన బ్రహ్మకు భూలోకంలో ఆలయాలు ఉండవని, మొగలి పువ్వు ఏ పూజకు పనికి రాదని, గోవు ముఖం చూస్తే దోషమని శాపం ఇచ్చాడట. అందుకే గోవు వెనుక భాగానికే పూజ చేస్తుంటాం.
Also Read: ఈ శివాలయం నిర్మాణం ముందు తాజ్ మహల్ కూడా తక్కువే అంటారు..
మొగలిపువ్వు మామూలు పూలలా సున్నితంగా ఉండదు. అతి ఎక్కువ వాసన వెగటుగా ఉంటుంది కానీ ఆహ్లాదాన్ని, అనుకూల శక్తిని ఇవ్వదు. ముఖ్యంగా ఈ పూలు ఉన్నచోట పాములు తిరుగుతుంటాయి. వాటికి ఉండే కోర్కెలు, కోపం, పగ ..ఇలాంటివన్నీ మానువుల్లో కలుగుతాయని అందుకే మొగలిపూలు పూజకు పనికిరావని చెబుతారు. ఎక్కువ వాసన వచ్చే పూలు సంపంగి, సన్నజాజి, మల్లెపూలు కూడా పూజల్లో పెద్దగా వినియోగించరు.
బంతిపూలు కూడా పూజకు ఉపయోగించరు. వీటికి ఎలాంటి శాపం లేదుకానీ సాధారణంగా శుభకార్యాల సందర్భంగా బంతిపూలు గుమ్మానికి కడతారు. వీటికి క్రిమి కీటకాలను ఆకర్షించి, నాశనం చేసే శక్తి ఉంది. వీటిని గుళ్ళో విగ్రహాలకు వేస్తే చుట్టుప్రక్కల క్రిమి కీటకాలు అక్కడ చేరతాయి. పైగా దేవుని దగ్గర వుపయోగించే పూలు, అగరుబత్తి, ధూపం, హారతి, గంట అన్నీ క్రిమి కీటకాలని పారద్రోలేవిగా వుంటాయి. ఇక క్రిమి కీటకాలను ఆకర్షించే బంతిపూలను దేవుడికి వేస్తే వాటి వల్ల దైవ దర్శనానికి వచ్చే భక్తులకు ఇబ్బందిపడతారు. అందుకే బంతి పూలతో పూజ వద్దంటారు.
Also Read: ఏ దేవుడికి ఏం నివేదించాలి… అసలు నైవేద్యం ఎందుకు సమర్పించాలంటే.!
ఈ పూలు కూడా పూజకు పనికిరావు:
-పురిటివారు, మైలవున్నవారు, బహిష్టులైనవారు పువ్వులను తాకరాదు
-క్రింద పడిన పూలు, వాసన చూసిన పూలు, కడిగిన పూలు, ఎడమచేత్తో కోసిన పూలు, వాడిన పూలు పూజకు వినియోగించరాదు
-పూజ చేసేటప్పుడు మధ్యవేలు ఉంగరపు వేలుతో పువ్వులను సమర్పించాలి. పువ్వులు క్రింది ముఖంగా ఉండకుండా చూసుకోవాలి.
-బిల్వ దళాలు, తులసీ దళాలకు ఈ నియమాలు వర్తించవు
పురాణాలు, పండితులు ఇలా చేయకూడదని చెప్పారు కానీ ఇలా చేసినంత మాత్రాన ఏదో జరిగిపోతుందనే భయం అవసరం లేదంటారు. ఎందుకంటే ఏం చేసినా, ఎలా చేసినా భక్తిముఖ్యం అన్నది గుర్తుంచుకోవాల్సిన విషయం.
Also Read: తెల్లవారుజాము వచ్చే కలలు నిజమవుతాయా? దీనిపై పురాణాలు.. సైన్స్ ఏం చెబుతున్నాయి?
Also Read: నిద్రలేవగానే ఎవర్ని చూడాలంటే…!
Also Read: కాశీకి ఎందుకెళతారు….అక్కడ ఏం వదిలేయాలి?
Also Read: నదిలో నాణేలు ఎందుకు వేస్తారో తెలుసా?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Astrology: ఈ రాశులవారికి చలికాలం అంటే చాలా ఇష్టం!
Daily Horoscope Today Dec 9, 2023: ఈ రాశివారు ముఖ్యమైన విషయాలు వాయిదా వేసుకోవడం మంచిది, డిసెంబరు 09 రాశిఫలాలు
Margashira Masam 2023: డిసెంబరు 13 నుంచి మార్గశిర మాసం, ఈ నెలలో గురువారాలు చాలా ప్రత్యేకం!
Christmas Santa Claus: అసలు మీకు క్రిస్మస్ తాత కథ తెలుసా!
Vastu Tips In Telugu: ఇంటికి పేరు పెట్టేటప్పుడు ఈ సూచనలు పాటించండి, మీ జీవితం సంతోషంగా ఉంటుంది
Sonia Gandhi Birthday Celebrations: 'తెలంగాణ తల్లి అంటే సోనియా గాంధీ' - ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన ఉంటుందన్న సీఎం రేవంత్ రెడ్డి
KTR Comments O Praja Darbar: ప్రజా దర్బార్ పై కేటీఆర్ వ్యాఖ్యలు వైరల్
Telangana Assembly meeting: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు బహిష్కరించిన బీజేపీ - అక్బరుద్దీన్ ఎదుట ప్రమాణం చేయమని స్పష్టీకరణ
KCR Surgery Success: మాజీ సీఎం కేసీఆర్ తుంటి మార్పిడి సర్జరీ సక్సెస్, బీఆర్ఎస్ శ్రేణులు హర్షం
/body>