Seven Week Jewellery: ఏడు వారాల నగలు వేసుకోవడం వెనుక ఆంతర్యం ఏంటి... ఏ రోజు ఏ రాళ్లు ధరిస్తారు..!
Yedu Varala Nagalu: ఎంత బంగారం ఉన్నా ఏడువారాల నగలు అనే మాట వినడానికే ఎంతో నిండుగా ఉంటుంది. ఇంతకీ ఏంటా ఏడువారాల నగలు...ఏ రోజు ఏం ధరిస్తారు..వాటి ప్రత్యేకత ఏంటి...!

7 Weeks Jewellery: బంగారానికి మగువలకు విడదీయలేని బంధం ఉంటుంది. తరాలు మారుతున్నా ఆభరణాల డిజైన్లు, మోడల్స్ మారుతుంటాయే కానీ బంగారానికి ఉన్న ఆదరణ మాత్రం అస్సలు తగ్గదు. గత జనరేషన్ సమయంలో తులం బంగారం నాలుగు వేలు, ఐదు వేలు ఉండగా ఇప్పుడు 50వేలకు చేరువలో ఉంది. అయితే ట్రెండ్ మారినా, కొత్త కొత్త డిజైన్లు మార్కెట్లో సందడి చేసినా ఏడువారాల నగలపై ఉండే ఆసక్తే వేరు.
ఇప్పుడు రంగురాళ్లు..అప్పుడు ఏడువారాల నగలు
గ్రహాల అనుగ్రహం కోసం రంగు రాళ్లను ధరించేవారి సంఖ్య ఎక్కువే. ముత్యం, పగడం, వజ్రం, వైఢూర్యం, గోమేధికం, పుష్యరాగం, మరకతం, నీలం, కెంపు ఇలా ఏ నక్షత్రానికి సరిపడా స్టోన్ వారు వాడుతుంటారు. వీటిలో మళ్లీ లైఫ్ స్టోన్, రన్నింగ్ స్టోన్ రెండూ వేర్వేరుగా ఉంటాయి. ఓవరాల్ జాతకానికి సంబంధించి లైఫ్ స్టోన్... ప్రస్తుత గ్రహస్థితిని అనుసరించి రన్నింగ్ స్టోన్ ఉంటుంది. కొందరైతే ఏకంగా నవరత్నాల ఉంగరాలు ధరిస్తున్నారు. అయితే ఇప్పుడంటే స్టోన్స్ ని ఉంగరాల రూపంలో ధరిస్తున్నారు కానీ అప్పట్లో వీటినే ఏడువారాల నగలుగా ధరించేవారు.
Also Read: ఏ దేవుడికి ఏం నివేదించాలి… అసలు నైవేద్యం ఎందుకు సమర్పించాలంటే.!
ఏడువారాల నగలు:
ఒక్కో రోజు ఒక్కో గ్రహం అనుగ్రహం కోసం ఏడు రోజులు ధరించే నగలనే ఏడువారాల నగలు అంటారు. వీటిని అప్పట్లో స్త్రీలు, పురుషులు కూడా ధరించేవారు. గ్రహస్థితి మెరుగుపడేందుకు మాత్రమే కాదు ఆరోగ్యం కోసం కూడా వీటిని ధరించేవారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ వీటికున్న క్రేజే వేరు. అందుకే బంగారు ఆభరణాలు ఎన్ని ఉన్నా ఏడువారాల నగలు అనేసరికి కళ్లు జిగేల్మంటాయ్. ఇంతకీ ఏడువారాల నగలంటే ఏంటి... ఏ రోజు ఓ స్టోన్స్ ఉన్నవాటికి ప్రాధాన్యతనిస్తారు.
Also Read: తెల్లవారుజాము వచ్చే కలలు నిజమవుతాయా? దీనిపై పురాణాలు.. సైన్స్ ఏం చెబుతున్నాయి?
ఆదివారం- సూర్యుడు: కెంపులు పొదిగిన కమ్మలు, హారం
సోమవారం - చంద్రుడు: ముత్యాల హారాలు, గాజులు
మంగళవారం- కుజుడు: పగడాల దండలు, ఉంగరాలు
బుధవారం - బుధుడు: పచ్చల పతకాలు, గాజులు
గురువారం - బృహస్పతి: పుష్యరాగం కమ్మలు, ఉంగరాలు
శుక్రవారం - శుక్రుడు: వజ్రాల హారాలు, ముక్కుపుడక
శనివారము - శని: నీలమణి హారాలు
Also Read: కాశీకి ఎందుకెళతారు….అక్కడ ఏం వదిలేయాలి?
ఏడు వారాల నగలు ఏడు రోజులు వేసుకుంటే సంపూర్ణ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు గ్రహాల అనుకూలత సిద్ధిస్తుందని మహిళల విశ్వాసం. అందుకే ఇప్పటికీ ఈ పేరు వినగానే మగువల మొహం వెలిగిపోతుంది.
Also Read: పూజకు పనికిరాని పూలు ఏవి...ఎందుకు?
Also Read: ఈ శివాలయం నిర్మాణం ముందు తాజ్ మహల్ కూడా తక్కువే అంటారు..
Also Read: నిద్రలేవగానే ఎవర్ని చూడాలంటే…!
Also Read: నదిలో నాణేలు ఎందుకు వేస్తారో తెలుసా?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

