Lord Shiva: ఉప్పు, ఎముకలు, పిండి,వెంట్రుకలు, బస్మంతో తయారు చేసిన ఈ శివలింగాల గురించి మీకు తెలుసా?
పరమశివుని ఆరాధ్య రూపం లింగం. సాధారణంగా మనకు తెలిసినవి శిలా నిర్మితమైన లింగాలు మాత్రమే. అందులో కూడా నల్లరాతి శివలింగాలే అధికం. కానీ మనకు తెలియనివి ఎన్నో. ఏంటవి....వాటిని పూజిస్తే వచ్చే ఫలితం ఏంటి?
శివ లింగ తమోద్భూతః కోటిసూర్య సమ ప్రభః
కోటిసూర్య ప్రకాశ సమానమైన శివలింగం , జ్యోతిర్మయ స్వరూపుడైన మహదేవుని ప్రతి రూపం . అయితే కేవలం శిలారూప లింగాలే కాదు....రకరకాల పదార్ధాలతో రూపొందించిన శివలింగాలున్నాయి. వాటిలో మరీ ముఖ్యమైనవి, అపురూపమైనవి..30. అవేంటి? వాటిని పూజిస్తే వచ్చే ఫలితం ఏంటి?
1) గంధపు లింగం: రెండు భాగాలు కస్తూరి , నాలుగు భాగాలు గంధం , మూడు భాగాలు కుంకుమను కలిపి ఈ లింగాన్ని చేస్తారు .....దీనిని పూజిస్తే శివ సాయిజ్యం లభిస్తుంది.
2) నవనీత లింగం: వెన్నతో చేసిన ఈ లింగాన్ని పూజిస్తే కీర్తి సౌభాగ్యాలు కలుగుతాయి.
3) పుష్పలింగం: నానావిధ సుగంధ పుష్పాలతో దీనిని నిర్మిస్తారు....దీనిని పూజిస్తే రాజ్యాధిపత్యం కలుగుతుంది.
4) రజోమయ లింగం: పుప్పొడితో నిర్మించిన ఈ లింగాన్ని పూజించడం వల్ల విద్యాథరత్వం సిద్ధిస్తుంది..... శివ సాయిజ్యాన్ని పొందగలరు.
5) ధ్యాన లింగం: యవలు , గోధుమలు , వరిపిండితో ఈ లింగాన్ని నిర్మిస్తారు....దీనిని పూజించడం వల్ల సంపదల వృద్ధి చెందుతుంది , సంతానం కలుగుతుంది.
6 ) తిలిపిస్టోత్థ లింగం: నూగు పిండితో చేసిన ఈ లింగాన్ని పూజిస్తే ఇష్టసిద్ది కలుగుతుంది.
7) లవణ లింగం: హరిదళం , త్రికటుకము , ఉప్పు కలిపి చేసిన ఈ లింగాన్ని పూజిస్తే వశీకరణ శక్తి .
8 ) కర్పూరాజ లింగం: కర్పూరంతో చేసిన లింగం . ముక్తి ప్రదమైనది.
9) భస్మమయ లింగం:భస్మముతో తయారు చేస్తారు ...... సర్వసిద్ధులను కలుగచేస్తుంది
10) శర్కరామయ లింగం : సుఖప్రదం.
11) సద్భోత్థ లింగం : ప్రీతికరని కలిగిస్తుంది.
12) పాలరాతి లింగం : ఆరోగ్యదాయకం.
13) వంశా కురమయ లింగం: వంశవృద్దిని కలిగిస్తుంది ...... దీనిని వెదురు మొలకలతో తయారు చేస్తారు .
14) కేశాస్థి లింగం: వెంట్రుకలు , ఎముకలతో తయారు చేస్తారు .....ఇది శత్రునాశనం చేస్తుంది.
15) పిష్టమయ లింగం: ఇది పిండితో తయారు చేయబడుతుంది...ఇది విద్యలను ప్రసాదిస్తుంది.
16) దధిదుగ్థ లింగం :కీర్తి ప్రతిష్టలను కలిగిస్తుంది.
17) ఫలోత్థ లింగం : ఫలప్రదమైనది.
18) రాత్రి ఫల జాత లింగం : ముక్తి ప్రదం
19) గోమయ లింగం : కపిల గోవు పేడతో ఈ లింగాన్ని తయారు చేస్తారు ..... దీనిని పూజిస్తే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది..... భూమిపై పడి మట్టి కలిసిన పేడ పనికిరాదు
20) దూర్వాకాండజ లింగం: గరికతో తయారు చేయబడు ఈ లింగం అపమృత్యుభయాన్ని తొలగిస్తుంది
21) వైడూర్య లింగం : శత్రునాశనం , దృష్టి దోషహరం
22) ముక్త లింగం: ముత్యంతో తయారు చేయబడిన ఈ లింగం ఇష్ట సిద్దిని కలిగిస్తుంది
23) సువర్ణ నిర్మిత లింగం: బంగారంతో చేసిన ఈ లింగం ముక్తిని కలిగిస్తుంది
24) ఇత్తడి - కంచు లింగం : ముక్తిని ప్రసాదిస్తుంది
25) రజత లింగం : సంపదలను కలిగిస్తుంది
26) ఇనుము - సీసపు లింగం : శత్రునాశనం చేస్తుంది
27) అష్టధాతు లింగం : చర్మరోగాలను నివారిస్తుంది సర్వసిద్ధి ప్రదం
28) స్ఫటీక లింగం: సర్వసిద్ధికరం , అనుకున్న కార్యాలను సఫలీకృతం చేస్తుంది
29) తుష్టోత్థ లింగం : మారణ క్రియకు పూజిస్తారు
30) సీతాఖండ లింగం: పటిక బెల్లంతో తయారు చేసింది..... ఆరోగ్యసిద్ధి కలుగుతుంది
Also Read: వనభోజనాలు కార్తీకమాసంలోనే చేస్తారెందుకు .. ఉసిరి చెట్టుకిందే తినాలని ఎందుకు చెబుతారు..!
Also Read: కార్తీక స్నానాలు ఎందుకు చేయాలి… అంత చలిలో అవసరమా…!
Also Read: ఈ నంది లేచి రంకెలేస్తే కలియుగాంతమే… ఏటా పెరిగే బసవన్న, కాకులే కనిపించని క్షేత్రం
Also Read: పన్నెండు నెలల్లో కార్తీక మాసం ఎందుకు ప్రత్యేకం .. ఈ నెలలో ఈ పనులు మాత్రం చేయకండి..!
Also Read: ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి