అన్వేషించండి

Shukra Gochar 2026: మార్చి 15 నుంచి ఈ 3 రాశులవారికి ఆర్థిక కష్టాలు మొదలవుతాయి!

Shukra Nakshatra Gochar 2026: ప్రేమ, విలాసం , శ్రేయస్సుకు శుక్రుడు కారణమైన గ్రహం శుక్రుడు. దాని సంచారంలో మార్పు కొన్ని రాశులకు ఆర్థిక ఇబ్బందులను తెచ్చిపెట్టవచ్చు. ఆ రాశులేంటో చూద్దాం..

Shukra Gochar 2026 in Revati Nakshatra:

2026 మార్చి 15న శుక్రుడు రేవతి నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. ఈ నక్షత్రానికి అధిపతి బుధుడు. ఇది కొన్ని రాశిచక్రాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ఆర్థిక నష్టాలు, బడ్జెట్ అంతరాయాలు , అప్పులు చేయాల్సిన పరిస్థితి కూడా రావొచ్చు.

కర్కాటక రాశి
 
శుక్రుడు రేవతి నక్షత్రంలోకి ప్రవేశించడం వల్ల కర్కాటక రాశి వారికి సమస్యలు మొదలవుతాయి. అనుకున్న పనులు సమయానికి పూర్తికావు. అవసరానికి చేతిలో డబ్బులుండవు. ఖర్చులు రెట్టింపు అవడంతో ఇబ్బందులు తలెత్తవచ్చు. అనవసరమైన ఖర్చులు పెరిగి ఆ భారం మీపై పడుతుంది. ఈ సమయంలో ఖర్చు చేసే ప్రతి రూపాయి విషయంలోనూ ఆచితూచి వ్యవహరించకపోతే అప్పులు చేయాల్సిన పరిస్థితి ఎదురవుతుంది
 
ధనస్సు రాశి

రేవతి నక్షత్రంలో శుక్రుడి సంచాం ధనస్సు రాశివారికి అంత మంచి ఫలితాలను ఇవ్వడం లేదు. ఈ సమయంలో మీ వ్యక్తిగత, వృత్తి జీవితంలో కొత్త సమస్యలు మొదలవుతాయి. ఆస్తి వివాదాల్లో చిక్కుకునే అవకాశం ఉంది. తొందరపడి ఏ వస్తువులు కొనుగోలు చేయొద్దు.. ముఖ్యంగా ఆస్తుల వ్యవహారాల్లో అమ్మకాలు కొనుగోళ్లు ఈ సమయంలో చేపట్టవద్దు. అప్పులు తీసుకోవాల్సిన  పరిస్థితి ఎదురవుతుంది కానీ..మీరు ఆలోచించి అడుగువేస్తే సమస్యలను ఎదుర్కొనే మార్గం మీకు కనిపిస్తుంది. ఈ ప్రభావం మీ ఆరోగ్యంపై కూడా పడుతుంది


సింహ రాశి

మార్చి 15 తర్వాత సింహ రాశి వారు శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగం చేసే ప్రదేశంలో ప్రత్యర్థులు మీ పనికి అంతరాయం కలిగించవచ్చు. మీరు చేయని తప్పులకు నిందలు పడాల్సి వస్తుంది. ఉన్నతాధికారులతో వాగ్వాదం పెట్టుకోవద్దు. సింహ రాశి వ్యాపారులకు కూడా శుభసమయం కాదు.. నూతన ప్రయోగాలకు దూరంగా ఉండాలి, వ్యాపారంలో లాభాలు వస్తాయనుకున్నా కానీ చివరకు నష్టాలే మిగులుతాయి. ఆచితూచి అడుగేయండి. పొదుపు తగ్గుతుంది. పని పెరుగుతుంది కానీ ఫలితం పెరగదు. 

విలాసాలకు అధిపతి అయిన శుక్రుడు శుభస్థానంలో ఉంటే ఆ వ్యక్తి జీవితం ఎంత అద్భుతంగా, సంతోషంగా, ప్రేమమయంగా ఉంటుందో... శుక్రుడు ప్రతికూల సంచారం అంతే ప్రభావం చూపిస్తుంది. ఈ సమయంలో వ్యక్తిగత జీవితంలో వివాదాలు, ఆర్థిక సమస్యలు, ఉద్యోగం చేసే ప్రదేశంలో పనిలో ఒ‍త్తిడి పెరుగుతుంది. శుక్రదోషం ఉండడం వల్ల ఆర్థి ఇబ్బందులు , అప్పుల బాధలు వెంటాడుతాయి. 

శుక్రుడి శ్లోకం పఠించండి

హిమకుంద మృణాళాభం దైత్యానాం పరమం గురుమ్ 
సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహమ్ 

శుక్ర బీజ మంత్రం:
ఓం ద్రాం ద్రీం ద్రౌం సః శుక్రాయ నమః 
 
శుక్ర గాయత్రీ మంత్రం:
ఓం అశ్వధ్వజాయ విద్మహే ధనుర్హస్తాయ ధీమహి 
తన్నో శుక్రః ప్రచోదయాత్ 

 గమనిక: ఇక్కడ అందించిన సమాచారం కేవలం నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. పండితులు చెప్పిన వివరాలు, ఆధ్యాత్మిక గ్రంధాల నుంచి సేకరించి అందించిన వివరాలు ఇవి. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఏదైనా సమాచారం లేదా నమ్మకాన్ని అమలు చేయడానికి ముందు సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.

పరాభవ నామ సంవత్సరం కన్యా రాశి ఉగాది ఫలితాలు! మీ శత్రువులను గుర్తించకపోతే మిగిలేది అశాంతే! ఉద్యోగం, వ్యాపారం, విద్య ఎలా ఉంటాయి?

ఉగాది 2026 పరాభవ నామసంవత్సరంలో మీ రాశి ఆదాయం - వ్యయం తెలుసుకోండి!
 

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More

టాప్ హెడ్ లైన్స్

16-08-2026 ఆదివారం మీ రాశిఫలాలు!
16-08-2026 ఆదివారం మీ రాశిఫలాలు!
మీన రాశి ఆగస్టు 16-22 వారఫలం
మీన రాశి ఆగస్టు 16-22 వారఫలం
కుంభ రాశి ఆగస్టు 16-22 వారఫలం
కుంభ రాశి ఆగస్టు 16-22 వారఫలం
మకర రాశి ఆగస్టు 16-22 వారఫలం
మకర రాశి ఆగస్టు 16-22 వారఫలం

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BAN Defeats AUS In 1st Test: ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
భారత్‌లో చిన్న కార్ల టైమ్‌ వచ్చిందా? మిడ్‌సైజ్‌ SUVల జోరు తగ్గుతుందా?
SUVల హవాకు చెక్.. ఇక చిన్న కార్లదే జోరు, ట్రెండ్‌ మారుతోందా?
రూ.19.45 లక్షల నుంచి మహీంద్రా BE 6 Sporteq.. మీ అవసరానికి సరిపోయే వేరియంట్‌ ఇదే!
మహీంద్రా BE 6 Sporteqలో ఏ వేరియంట్‌ బెస్ట్? ధర, బ్యాటరీ, ఫీచర్ల పూర్తి వివరాలు!
Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల గడువు పూర్తి.. లబ్ధిదారుల ఎంపిక ఎప్పుడంటే
ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల గడువు పూర్తి.. లబ్ధిదారుల ఎంపిక ఎప్పుడంటే
RRB JE Posts 2026: రైల్వేలో 3,993 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీలు, అభ్యర్థుల అర్హతలు
RRB JE Posts: రైల్వేలో 3,993 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీలు, అభ్యర్థుల అర్హతలు
Deputy CM Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
Embed widget