Shruti Haasan: కమల్ దంపతుల విడాకులు - శ్రుతిహాసన్ ఫస్ట్ రియాక్షన్ ఇదే!
Shruti Haasan Reaction: తన పేరెంట్స్ విడాకుల సమయంలో తాను ఎంతో బాధ పడినట్లు హీరోయిన్ శ్రుతిహాసన్ తెలిపారు. అప్పటి నుంచి రెండు రకాల జీవితాలు చూసినట్లు చెప్పారు.

Shruti Haasan First Reaction On Kamal Haasan Couple Divorce: ఓ స్టార్ హీరో కుమార్తెగా కాకుండా తనదైన యాక్టింగ్, అందంతో అటు టాలీవుడ్ ఇటు బాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ స్పెషల్ గుర్తింపు తెచ్చుకున్నారు హీరోయిన్ శ్రుతిహాసన్ (Shruti Haasan). మూవీ బ్యాక్ గ్రౌండ్ ఉన్న కుటుంబం నుంచి వచ్చినా ఆ ఇమేజ్ వాడుకోకుండా తనదైన ప్రతిభతోనే ఇండస్ట్రీలో నిలిచారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన చిన్న నాటి విషయాలతో పాటు కెరీర్, తన పేరెంట్స్ డివోర్స్‌కు సంబంధించిన విషయాలు పంచుకున్నారు.
మెర్సిడెస్ బెంజ్ టూ లోకల్ ట్రైన్
తాను సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చినప్పటికీ ఎప్పుడూ దాన్ని దృష్టిలో పెట్టుకోలేదని శ్రుతి హాసన్ తెలిపారు. తన పేరెంట్స్ కమల్ హాసన్, సారిక విడాకులు తీసుకున్న సమయంలో తాను జీవిత పాఠం నేర్చుకున్నట్లు చెప్పారు. 'నేను ఇండస్ట్రీకి రావడానికి ముందు నా లైఫ్‌లో ఏం జరిగిందో చాలామందికి తెలియదు. నా పేరెంట్స్ విడిపోవడం నన్ను ఎంతో బాధించింది. వారిద్దరూ విడిపోయాక నేను అమ్మతో ఉన్నాను. అప్పటివరకూ ఉన్న జీవితం ఒక్కసారిగా మారిపోయింది. చెన్నై నుంచి ముంబయికి వచ్చేశాం. లగ్జరీ లైఫ్ దూరమైంది.
అప్పటివరకూ మెర్సిడెస్ బెంజ్ కారులో తిరిగిన నేను.. లోకల్ ట్రైన్‌లో వెళ్లేదాన్ని. అప్పటి నుంచి రెండు రకాల జీవితాలు చూశాను. ఇండస్ట్రీకి వచ్చాక నాన్నతో ఎక్కువగా ఉంటున్నాను. విదేశాల్లో సంగీతం నేర్చుకున్నాను. నాదైన కృషితో ఇండస్ట్రీలో నాకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాను. స్వతంత్రంగా, ఆత్మ విశ్వాసంతో జీవిస్తున్నాను.' అని అన్నారు. శ్రుతిహాసన్ తల్లిదండ్రులు కమల్ హాసన్ (Kamal Haasan), సారిక (Sarika) 1988లో పెళ్లి చేసుకుని 2004లో విడిపోయారు. వీరికి శ్రుతిహాసన్, అక్షరహాసన్ ఇద్దరు కుమార్తెలు.
Also Read: అల్లు అర్జున్, అట్లీ సినిమాలో 'సీతారామం' హీరోయిన్? - మరో ఇద్దరు స్టార్ హీరోయిన్లు కూడా..
ప్రస్తుతం శ్రుతి హాసన్ సూపర్ స్టార్ రజినీకాంత్ 'కూలీ' మూవీలో నటిస్తున్నారు. లోకేశ్ కనగరాజ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. నాగార్జున, ఉపేంద్ర, సౌబిన్, శ్రుతిహాసన్, సత్యరాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ కూడా ఓ కీలక రోల్ చేస్తున్నట్లు తెలుస్తోంది. హీరోయిన్ పూజా హెగ్డే ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్‌లో కనిపించబోతున్నారు. గోల్ట్ స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్‌లో మూవీ రూపొందింది. కింగ్ నాగార్జున సినిమాలో నెగిటివ్ రోల్‌లో కనిపించనున్నారు. ఈ మూవీని సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆగస్ట్ 14న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఎన్టీఆర్ నీల్ మూవీ స్పెషల్ సాంగ్‌లో
మరోవైపు, ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబోలో రాబోతోన్న మూవీలో శ్రుతిహాసన్ కూడా భాగం కానున్నారనే టాక్ వినిపిస్తోంది. ఓ స్పెషల్ సాంగ్‌లో ఆమె ఎన్టీఆర్‌తో కలిసి స్టెప్పులేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మేకర్స్ ఆమెను సంప్రదించగా ఓకే చెప్పారని సమాచారం. అంతకు ముందు ఎన్టీఆర్‌తో హరీష్ శంకర్ తెరకెక్కించిన 'రామయ్యా వస్తావయ్యా' సినిమాలో ఆమె నటించారు. ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో వచ్చిన ప్రభాస్ 'సలార్'లోనూ నటించారు.





















