Allu Arjun: అల్లు అర్జున్, అట్లీ సినిమాలో 'సీతారామం' హీరోయిన్? - మరో ఇద్దరు స్టార్ హీరోయిన్లు కూడా..
Allu Arjun Atlee Movie: అల్లు అర్జున్, అట్లీ మూవీపై అప్ డేట్స్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే దానిపై తాజాగా ఓ క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతోంది.

Mrunal Thakur In Allu Arjun Atlee AA22XA6 Movie: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun), స్టార్ డైరెక్టర్ అట్లీ (Atlee) కాంబోలో ఓ క్రేజీ మూవీ రాబోతున్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ 8న ఈ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన వచ్చినప్పటి నుంచీ అప్ డేట్స్ కోసం అటు బన్నీ ఫ్యాన్స్‌తో పాటు ఇటు సినీ ప్రియులు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీలో హీరోయిన్ ఎవరనే దానిపై ఆసక్తి నెలకొనగా తాజాగా ఓ క్రేజీ న్యూస్ హల్చల్ చేస్తోంది.
బన్నీ సరసన 'సీతారామం' హీరోయిన్
ఈ మూవీలో దాదాపు ముగ్గురు హీరోయిన్లు నటించనున్నట్లు తెలుస్తోంది. అందులో ఓ పాత్ర కోసం మృణాల్ ఠాకూర్‌ను (Mrunal Thakur) ఎంపిక చేశారనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే మూవీ టీం ఆమెను సంప్రదించారని.. కథా చర్చలు సైతం పూర్తయ్యాయని సమాచారం. ఇటీవలే మృణాల్ లుక్ టెస్టులో కూడా పాల్గొన్నట్లు తెలుస్తోంది. మరి దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఈ బాలీవుడ్ బ్యూటీ 'సీతారామం' మూవీతో హీరోయిన్‌గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. హాయ్ నాన్న, ఫ్యామిలీ స్టార్ సినిమాలతో మంచి హిట్స్ అందుకున్నారు. ఆ తర్వాత కొంత గ్యాప్ ఇచ్చారు. ప్రభాస్ బిగ్గెస్ హిట్ 'కల్కి' సినిమాలో ఓ చిన్న రోల్‌లో మెరిశారు. ఇప్పుడు ఏకంగా బన్నీ మూవీలోనే ఛాన్స్ కొట్టేశారనే టాక్ వినిపిస్తోంది.
మరో ఇద్దరు ఎవరంటే?
మరో ఇద్దరు స్టార్ హీరోయిన్లను సైతం ఈ సినిమా కోసం రంగంలోకి దించనున్నారనే టాక్ వినిపిస్తోంది. జాన్వీ కపూర్ (Janhvi Kapoor), దీపికా పదుకొణె (Deepika Padukone) పేర్లు మూవీ టీం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే జాన్వీతో చర్చలు పూర్తయ్యాయని.. దీపికతో సంప్రదింపులు జరుపుతున్నట్లుగా సమాచారం. త్వరలోనే దీనిపై పూర్తి క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.
డిఫరెంట్ లుక్‌లో బన్నీ.. స్టోరీ అదేనా..
ఈ మూవీలో ఎప్పుడూ లేని విధంగా ఓ డిఫరెంట్ రోల్‌లో బన్నీ కనపడనున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇటీవలే ముంబైలో దీనికి సంబంధించి లుక్ టెస్ట్ కూడా పూర్తైందని తెలుస్తోంది. ఇప్పటివరకూ 'పుష్ప రాజ్' లుక్ మెయింటైన్ చేసిన బన్నీ.. ఇప్పుడు రగ్గడ్ లుక్ నుంచి స్టైలిష్ అండ్ స్లీక్ లుక్ వరకు వివిధ వేరియేషన్స్ ట్రై చేశారు. తాజాగా.. హైదరాబాద్ ఎయిర్ పోర్టులో ఆయన లుక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. నల్లటి అథ్లెటిజర్ డ్రెస్ ధరించి.. రూ.1.2 కోట్ల విలువైన రిచర్డ్ మిల్లె వాచ్, మెడలో గొలుసుతో లగ్జరీ లుక్‌లో అదరగొట్టారు. ఇది అట్లీ మూవీలో లుక్కే అంటూ ఫ్యాన్స్ వైరల్ చేశారు.
స్టోరీ అదేనా..
ఈ మూవీని సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. విజువల్ ఎఫెక్ట్స్‌కు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఉండే మూవీ అని అనౌన్స్‌మెంట్ వీడియో బట్టి తెలుస్తోంది. ఇందుకోసం అంతర్జాతీయ వీఎఫ్ఎక్స్ కంపెనీతో మూవీ టీం పని చేయనున్నట్లు సమాచారం. హై - ఆక్టేన్ పాన్ - ఇండియా ఫీచర్ ఫిల్మ్ నిర్మించబోతున్నామంటూ సన్ పిక్చర్స్ నిర్మాత కళానిధి మారన్ ఇప్పటికే వెల్లడించారు.
సమాంతర ప్రపంచం, పునర్జన్మ కాన్సెప్ట్‌తో మూవీ ఉంటుందని ఇన్ సైడ్ వర్గాల టాక్. 'AA22XA6' వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కిస్తుండగా.. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ మూవీలో బన్నీ ట్రిపుల్ రోల్ చేస్తున్నారనే ప్రచారం బలంగా వినిపిస్తోంది. షూటింగ్ ఈ ఏడాది జూన్‌లో ప్రారంభించి.. వచ్చే ఏడాది ఆగస్టులో మూవీ రిలీజ్ చేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. హాలీవుడ్ రేంజ్‌లో మూవీ ఉంటుందని సమాచారం.





















